Top 6 Amazing Benefits Of Sandalwood For Face And Skin In Telugu - Sakshi
Sakshi News home page

గంధంతో ప్రయోజనాలెన్నో మీకు తెలుసా?

Published Sun, Aug 8 2021 10:54 AM | Last Updated on Sun, Aug 8 2021 3:40 PM

Sandalwood Have Many Benefits Especially Face Beauty - Sakshi

►గంధం పొడిలో కొద్దిగా రోజ్‌ వాటర్‌ వేసి పేస్టులా కలుపుకుని మొటిమలపై రాయాలి. ఈ పేస్టుని క్రమం తప్పకుండా మొటిమలపై అప్లై చేయడం వల్ల ముఖంపై అసహ్యంగా ఉన్న మొటిమలు పోతాయి.

►ముల్తాని మట్టి, గంధం పొడిని సమపాళ్లల్లో తీసుకుని రోజ్‌ వాటర్‌తో పేస్టులా కలపాలి. దీనిని ముఖంపై ప్యాక్‌లా అప్లై చేసి ఆరిన తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల జిడ్డుకారుతున్న చర్మం తాజాగా మారడంతోపాటు నిగారింపును సంతరించుకుంటుంది.

►శరీరం వేడిగా అనిపిస్తే.. గంధం నూనెను నీటిలో వేసి స్నానం చేస్తే శరీరం చల్లబడుతుంది.

►చర్మ తత్వం ఎటువంటిదైనా తాజాగా ఉండాలంటే 50 ఎమ్‌ఎల్‌ రోజ్‌ వాటర్‌లో పది చుక్కల గంధం నూనె వేసి కలిపి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తాజాదనంతోపాటు, రక్షణ కలుగుతుంది.

► బాగా ఒత్తిడికి గురైనప్పుడు మూడు చుక్కల గంధం నూనెను టీ లో వేసుకుని తాగితే ఒత్తిడి తగ్గి ఉపశమనం కలుగుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement