
Jr NTR Prashanth Neel Celebrate Wedding Anniversary: 'రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్)' సక్సెస్‌తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ పాన్ ఇండియా చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా కూడా మారాడు. మరోవైపు 'కేజీఎఫ్ 2'తో భారీ విజయం సాధించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కొరటాల శివ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ సినిమా చేయనున్నారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరి కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ సెలబ్రేషన్ సినిమా గురించి అనుకుంటే పొరపాటే. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఎవరికివారి పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాన్ని ఒకే రోజు వేడుక చేసుకున్నారు.
మే 5న ఇటు తారక్‌తోపాటు అటు ప్రశాంత్ నీల్ వివాహ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవాన్ని వారిద్దరు తమ ఫ్యామిలీలతో కలిసి జరుపుకున్నారు. ఈ విషయానికి సంబంధించిన ఒక స్పెషల్ ఫొటోను తారక్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇందులో ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి దంపతులతోపాటు ప్రశాంత్ నీల్, ఆయన భార్య లిఖిత ఉన్నారు. ఈ రెండు జంటల వివాహ వార్షికోత్సవం మే 5న కావడంతో ఇరు జంటలు కలిసి ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించి ఫొటోను షేర్ చేస్తూ 'ఒకే రోజు మా రెండు జంటల వివాహ వార్షికోత్సవం జరుపుకోవడం వేడుకగా ఉంది. ఇదొక కొత్త ఆరంభం.' అని ఎన్టీఆర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు రిహార్సల్స్‌కు రాలేదు: శేఖర్ మాస్టర్
Comments
Please login to add a commentAdd a comment