likhitha
-
సలార్‌లో అఖిల్ అక్కినేని.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్ సతీమణి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'సలార్' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించి తాజాగా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వానికి.. ప్రభాస్, పృథ్వీరాజ్‌ల యాక్షన్ సీన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సలార్ పార్ట్-2 ఉంటుందని ఇప్పటికే ప్రకటన వచ్చేసింది. దానికి 'సలార్ శౌర్యాంగపర్వం' అనే టైటిల్ కూడా రివిల్ అయిపోయింది. సలార్ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని అతిథి పాత్రలో కనిపించనున్నారంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది. అఖిల్ లుక్‌తో పాటు అతని బాడీ కూడా బాలీవుడ్ హీరోలకు ఏం తక్కువ కాదు అన్నట్టుగా ఉంటుంది. అఖిల్ భారీ యాక్షన్ సీన్స్‌లలో దుమ్ములేపగలడు. దీంతో సలార్ పార్ట్ 2లో అఖిల్ ఎంట్రీ దాదాపు ఖాయం అని నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై ప్రశాంత్ నీల్ సతీమణి లిఖితా రెడ్డి తాజాగా స్పందించారు. అవన్నీ పూర్తిగా వదంతులు మాత్రమేనని, అందులో ఎలాంటి నిజం లేదని ఆమె తెలిపారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లు అడిగడంతో క్లారిటీ ఇచ్చారు. సలార్‌లో దేవా తండ్రి పాత్ర ఎవరు పోషిస్తున్నారు..? తన తండ్రిని రాజమన్నార్ చంపాడనే విషయం దేవాకు తెలుసా..? అని చాలామంది అడిగిన ప్రశ్నకు ఆమె రివీల్ చేయలేదు.. సమాధానాల కోసం తాను కూడా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. 'సలార్' గ్లింప్స్‌లో చూపించిన జురాసిక్ పార్క్ డైలాగ్ గురించి ఆమె చాలా ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. శౌర్యాంగపర్వం విడుదలయ్యాకు ఆ డైలాగ్ కరెక్టా? కాదా? అనేది తెలుస్తుందని తెలిపారు. అంతేకాకుండా పండిట్ రోల్ కూడా సలార్‌లో కొంత మాత్రమే రివీల్ చేసినట్లు ఆమె చెప్పారు. -
పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటుడు సామ్రాట్ భార్య
నటుడు సామ్రాట్ రెడ్డి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇక క్యారెక్టర్ ఆర్టీస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన సామ్రాట్.. వైఫ్ ఆఫ్ రామ్, పంచాక్షరి వంటి సినిమాల్లో లీడ్ రోల్లో నటించారు. ఆ తర్వాత హీరో నాని హోస్ట్ చేసిన బిగ్‌బాస్ సీజన్ 2లో పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇంతకుముందు హర్షితా రెడ్డి అనే యువతితో సామ్రాట్‌కు వివాహం జరిగింది. అయితే విబేధాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. 2020లో కాకినాడకు చెందిన అంజనా శ్రీలిఖిత అనే అమ్మాయితో సామ్రాట్‌కు రెండో విహాహం జరిగింది. ఆగస్టు 15న సామ్రాట్ భార్య లిఖిత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇండిపెండెన్స్ రోజును ఇలా సెలబ్రేట్ చేసుకోవడం డిఫరెంట్ ఫీలింగ్ అంటూ సామ్రాట్ తన కూతురితో దిగిన ఫోటోను షేర్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన పలువురు ప్రముఖులు సామ్రాట్ దంపతులకు శుభాంకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Samrat Reddy (@samratreddy) -
ఎన్టీఆర్ షేర్ చేసిన స్పెషల్ ఫొటో.. క్షణాల్లో వైరల్
Jr NTR Prashanth Neel Celebrate Wedding Anniversary: 'రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్)' సక్సెస్‌తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ పాన్ ఇండియా చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా కూడా మారాడు. మరోవైపు 'కేజీఎఫ్ 2'తో భారీ విజయం సాధించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కొరటాల శివ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ సినిమా చేయనున్నారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరి కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ సెలబ్రేషన్ సినిమా గురించి అనుకుంటే పొరపాటే. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఎవరికివారి పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాన్ని ఒకే రోజు వేడుక చేసుకున్నారు. మే 5న ఇటు తారక్‌తోపాటు అటు ప్రశాంత్ నీల్ వివాహ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవాన్ని వారిద్దరు తమ ఫ్యామిలీలతో కలిసి జరుపుకున్నారు. ఈ విషయానికి సంబంధించిన ఒక స్పెషల్ ఫొటోను తారక్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇందులో ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి దంపతులతోపాటు ప్రశాంత్ నీల్, ఆయన భార్య లిఖిత ఉన్నారు. ఈ రెండు జంటల వివాహ వార్షికోత్సవం మే 5న కావడంతో ఇరు జంటలు కలిసి ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించి ఫొటోను షేర్ చేస్తూ 'ఒకే రోజు మా రెండు జంటల వివాహ వార్షికోత్సవం జరుపుకోవడం వేడుకగా ఉంది. ఇదొక కొత్త ఆరంభం.' అని ఎన్టీఆర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు రిహార్సల్స్‌కు రాలేదు: శేఖర్ మాస్టర్ View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌కు ఖమ్మం విద్యార్థిని
రఘునాధపాలెం, న్యూస్‌లైన్: జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు రఘునాధపాలెంలోని వీవీసీ పాఠశాల విద్యార్థిని బుడిగం లిఖిత ఎంపికైంది. ఇటీవల వరంగల్ జిల్లా కేసముద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-17 పోటీలలో ప్రతిభ ప్రదర్శించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. లిఖితను పాఠశాల కరస్పాండెంట్ రేఖల భాస్కర్, ప్రిన్సిపాల్ విద్యుల్లత, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, పీడీలు డి.శ్రీనివాస్, జ్శైవాసరావు తదితరులు అభినందించారు.