Bigg Boss Fame Samrat Reddy Blessed With Baby Girl, First Picture Goes Viral - Sakshi
Sakshi News home page

Bigg Boss Samrat: 'ఇది డిఫరెంట్‌ పీలింగ్‌'.. కూతురి ఫోటోను షేర్‌ చేసిన సామ్రాట్‌

Aug 16 2022 10:44 AM | Updated on Aug 16 2022 2:06 PM

Bigg Boss Fame Samrat Reddy Blessed With Baby Girl Shares First Picture - Sakshi

నటుడు సామ్రాట్‌ రెడ్డి తండ్రిగా ప్రమోషన్‌ పొందాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇక క్యారెక్టర్‌ ఆర్టీస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించిన సామ్రాట్‌.. వైఫ్‌ ఆఫ్‌ రామ్‌, పంచాక్షరి వంటి సినిమాల్లో లీడ్‌ రోల్‌లో నటించారు. ఆ తర్వాత హీరో నాని హోస్ట్‌ చేసిన బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు.

ఇంతకుముందు హర్షితా రెడ్డి అనే యువతితో సామ్రాట్‌కు వివాహం జరిగింది. అయితే విబేధాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. 2020లో కాకినాడకు చెందిన అంజనా శ్రీలిఖిత అనే అమ్మాయితో సామ్రాట్‌కు రెండో విహాహం జరిగింది. ఆగస్టు 15న సామ్రాట్‌ భార్య లిఖిత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

ఇండిపెండెన్స్‌ రోజును ఇలా సెలబ్రేట్‌ చేసుకోవడం డిఫరెంట్‌ ఫీలింగ్‌ అంటూ సామ్రాట్‌ తన కూతురితో దిగిన ఫోటోను షేర్‌ చేశాడు. ఈ పోస్ట్‌ చూసిన పలువురు ప్రముఖులు సామ్రాట్‌ దంపతులకు శుభాంకాంక్షలు తెలుపుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement