గత 20 ఏళ్లుగా ఎన్టీఆర్‌ అభిమానిని: కేజీఎఫ్‌ డైరెక్టర్‌ | Prashanth Neel Says He Is Jr Ntr For 20 Years | Sakshi
Sakshi News home page

Prashanth Neel: గత 20 ఏళ్లుగా ఎన్టీఆర్‌ అభిమానిని: ప్రశాంత్‌ నీల్‌

Published Sun, Apr 10 2022 7:08 PM | Last Updated on Sun, Apr 10 2022 7:23 PM

Prashanth Neel Says He Is Jr Ntr For 20 Years - Sakshi

Prashanth Neel Says He Is Jr Ntr For 20 Years: మామూలు సినిమాగా వచ్చి రికార్డులెన్నో బద్దలు కొట్టిన చిత్రం 'కేజీఎఫ్‌'. ఆ సినిమా చూసిన ఆడియన్స్‌ దానికి సీక్వెల్‌ ఎప్పుడెప్పుడూ వస్తుందా? అని వేయి కళ్లతో ఎదురుచూశారు. ఎట్టకేలకు వారి నిరీక్షణకు తెరపడనుంది. ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్‌ 14న ప్రపంచవ్యాప్తంగా 'కేజీఎఫ్‌: చాప్టర్‌ 2' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఇంతలా క్రేజ్‌ సంపాదించుకోవడానికి యశ్‌ యాక్టింగ్‌ ఒక కారణమైతే.. ఆ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ మరో ప్రధాన కారణం. ఈ ఒక్క సినిమాతో అటు యశ్‌, ఇటు ప్రశాంత్‌ నీల్‌ సూపర్‌ పాపులర్‌ అయ్యారు. దీంతో ప్రశాంత్ నీల్‌కు వరుసపెట్టి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ ప్రభాస్‌తో 'సలార్‌' తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

చదవండి: కేజీఎఫ్‌తో పాటు ‘సలార్‌’, ఆడియన్స్‌కి ప్రశాంత్‌ నీల్‌ డబుల్‌ ట్రీట్‌

ఆ తర్వాత యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌తో సినిమా చేయనున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌తో సినిమా గురించి ప్రశాంత్‌ నీల్‌ మాట్లాడుతూ 'నేను గత 15, 20 ఏళ్లుగా ఎన్టీఆర్‌ అభిమానిని. మేము స్క్రిప్ట్‌ వర్క్‌ ప్రారంభించాక 10 - 15 సార్లు కలిశాం. ఆయనకు స్క్రిప్ట్‌ నచ్చడంతో దానిపై పూర్తిగా వర్క్‌ చేస్తున్నాను. మేము గత రెండేళ్లుగా సన్నిహితులం. ఈ సినిమా గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాను. దయచేసి అది ఏ జోనర్‌ అని నన్ను అడగొద్దు' అని తెలిపాడు. ప్రస్తుతం కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్. 


చదవండి: ప్రభాస్‌ హైఓల్టేజ్‌ యాక్షన్‌ సీన్స్‌.. అన్ని కోట్ల ఖర్చు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement