
‘యంగ్’ ఎఫైర్!
ముప్పై ఒక్కేళ్ల భామ పూజాగాంధీ... ఇరవై ఏడేళ్ల దర్శకుడు సతీష్ ప్రధాన్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తుందట. శాండల్‌వుడ్‌లో ‘హాట్’ టాపిక్ ఇది. కానీ అలాంటిదేమీ లేదంటోందీ నటి. ‘నేను మహిళను. బెంగళూరు దాటి బయటకు వెళ్లేప్పుడు సహజంగానే ఎవరో ఒకరి తోడు కావాలి. అదీ నేను చేస్తున్న సినిమా దర్శకుడతడు. అందులో తప్పేముంది! పైగా ఇద్దరం కలసి స్క్రిప్ట్, పాత్రల తీరు వంటివి చర్చించుకోవడం వల్ల చిత్రం మరింత అద్భుతంగా వస్తుంది’ అంటూ చెబుతున్న ఈ తారకు... నిప్పు లేనిదే పొగ రాదని తెలియలేదేమో మరి.