నేటి నుంచి అయోధ్య కేసుల విచారణ
లక్నో: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులుసహా బీజేపీ సీనియర్ నాయకులు ఎల్కే ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ ఉమా భారతిలపై నమోదైన కేసును నేడు లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు విచారించనుంది. కుట్ర ఆరోపణలపై నేర విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆడ్వానీ, జోషీ, ఉమా భారతిలను గత నెలలో ఆదేశించిన సుప్రీంకోర్టు.. సంబంధిత కేసును రాయ్‌బరేలీ నుంచి లక్నోకు బదిలీచేయాలని ఆదేశాలిచ్చింది.
మరో కేసులో నిందితుల్లో ఒకరైన సతీశ్ ప్రధాన్ హాజరుకాకపోవడంతో కేసును కోర్టు విచారించలేదు. రాజకీయంగా సున్నితమైన కేసు కావడంతో ఈ కేసును సీబీఐ కోర్టు ప్రతిరోజూ విచారిస్తోంది.