puja gandhi
-
మెరుపులా వచ్చి మాయమవుతున్న సినీ స్టార్లు..
వెండితెరపై అలవోకగా సాహసకృత్యాలను పండించే నటీనటులు నిజజీవిత రాజకీయాల్లోను, ఎన్నికల్లోను కూడా అదే హవా కొనసాగించాలని రావడం, వారిలో కొందరంటే కొందరే ప్రజామోదం పొందడం జరుగుతోంది. ఎక్కువమంది నటీనటులు పెద్ద ప్రభావం చూపకుండానే రాజకీయాలను చాలించుకోవడం విశేషం. సాక్షి, బెంగళూరు: ఎన్నికలు వస్తే చాలు రాష్ట్ర రాజకీయా ల్లో సినీ స్టార్లు తళుక్కున మెరుస్తుండడం సహజం. కానీ అలా రాజకీయాల్లోకి మెరుపులా వచ్చి మాయమవుతున్నవారే అధికంగా ఉన్నారు. బహుభాషా నటుడు ప్రకాశ్‌రాజ్ కొన్ని నెలలుగా బీజేపీ, ప్రధాని మోదీపై విమర్శల యుద్ధం ప్రారంభించి తాజాగా బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అదృష్టం పరీక్షించుకుంటున్నారు. గతంలో కూడా ఇక్కడ పలువురు ఐటీ, పారిశ్రామిక ప్రముఖులు పోటీ చేసి ఓటమి మూటగట్టుకున్నారు. ప్రకాశ్ రాజ్ భవితవ్యం ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది. ఎన్నికల తర్వాత ఆయన రాజకీయాల్లో కొనసాగుతారా లేక చాలా మందిలా మళ్లీ సినిమాలకు వెళ్లిపోతారా? అని కొందరు ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. ఊరించిన ఉపేంద్ర ఇక శాండల్‌వుడ్‌లో విలక్షణ నటుడు ఉపేంద్ర రాజకీయాల్లో రియల్స్టార్లా సత్తా చూపలేకపోతున్నారు. ఉత్తమ ప్రజాకీయ పార్టీ (యూపీపీ) ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలో నిలిపారు. వీరిలో ఎక్కువమంది పెద్దగా ఊరూపేరు లేనివారే. దీంతో ఎన్నికలపై ప్రభావం చూపలేకపోతున్నారని చెప్పాలి. మండ్యలో వార్ ఇక ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మాత్రం మండ్య నియోజకవర్గమనే చెప్పాలి. రెబెల్‌స్టార్ సతీమణి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తుండడం, ఆమెకు బీజేపీ మద్దతిస్తుండడం సంచలనంగా మారింది. ఆమె పోటీదారు, జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ కూడా వర్ధమాన హీరోనే. ప్రచారంలో హోరాహోరీగా తలపడుతున్నారు. వీరితో పాటు చాలా మంది గతంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వెండితెరపై మెరిసిన చాలా మంది రాజకీయాల్లో హిట్లు కొట్టలేకపోయారు. అంబరీశ్ రాజకీయాల్లో విజయం సాధించారు. అంబరీశ్ కేంద్రం,రాష్ట్రంలో మంత్రిగా పనిచేశా రు .అంతేకాకుండా పలుమార్లుఎన్నికల్లో గెలిచారు. ప్రముఖ నటి రక్షిత బీఎస్ఆర్ పార్టీలో చేరారు. తరువాత రాజకీయాల్లో కనిపించలేదు. పూజాగాంధీ జేడీఎస్ పార్టీలో చేరి కొద్దిరోజులు హల్చల్ చేశారు. పలు ఎన్నికల్లో ప్రచారం చేసినా తరువాత రాజకీయాల నుంచి దాదాపు దూరమయ్యారు. నటులు శ్రీనాథ్, జగ్గేశ్, చంద్రు, తారా, శ్రుతి, మాళవిక వంటివారు బీజేపీలో తగిన స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ఉమాశ్రీ, జయమాల వంటి వారు ఇప్పటికీ విజయాన్ని కొనసాగిస్తున్నారు. రాజకీయాల్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు. శాండల్‌వుడ్ సీనియర్ నటుడు అనంత్‌నాగ్ గతంలో జేహెచ్ పటేల్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా జేహెచ్ పటేల్, రామక్రిష్ణ హెగ్డే వంటి ముఖ్యమంత్రులతో సన్నిహితుడిగా పేరుపొందారు. మండ్య మాజీ ఎంపీ రమ్య కాంగ్రెస్‌లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. సోషల్ మీడియా విభాగం చీఫ్‌గా ట్విట్టర్లో కాక పుట్టిస్తుంటారు. చిత్రదుర్గ మాజీ ఎంపీ శశికుమార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద పనిచేస్తూ కొనసాగుతున్నారు. కొన్ని సినిమాల్లో ప్రముఖ పాత్రలు పోషించిన ఎమ్మెల్యే ఇప్పుడు బీసీ పాటిల్ మంత్రి పదవి కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు. స్టార్ హీరోలు యశ్, దర్శన్ ఈ ఎన్నికల్లో సుమలత తరఫున మండ్యలో జేడీఎస్, కాంగ్రెస్‌లను ఢీకొంటున్నారు. -
దండుపాళ్యం4కి సెన్సార్ షాక్
కర్ణాటక , యశవంతపుర: బెంగళూరు సమీపంలోని దండుపాళ్యకు చెందిన దోపిడీదొంగల స్వైర విహారానికి దృశ్యరూపమైన దండుపాళ్యం సినిమాల గురించి తెలియనివారుండరు. అందులో 4వ చిత్రానికి అనుకోని షాక్ తగిలింది. మోడల్, నటి సుమన్ రంగనాథ్, పూజాగాంధీ తదితరులు నటించిన ‘దండుపాళ్యం–4’ సినిమాను రాష్ట్ర సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడానికి అర్హత లేదంటూ తిరస్కరించింది. సినిమాలోని సన్నివేశాలు చాలా హింసాత్మకంగా, అసభ్యంగా ఉన్నందున ప్రజలు ఈ సినిమాను చూడడం సాధ్యంకాదని స్పష్టం చేసింది. దీంతో సెన్సార్ బోర్డ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ చిత్ర నిర్మాత వెంకటేశ్ కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి, కేంద్ర సెన్సార్ బోర్డ్‌కు ఫిర్యాదు చేయడంతో పరిణామాలు ఉత్కంఠగా మారాయి. కోర్టుకు వెళ్లే విషయంలో నిపుణులతో చర్చిస్తానని నిర్మాత ప్రకటించారు. బోర్డుపై నిర్మాత ఆరోపణలు నిర్మాత మాట్లాడుతూ గత నవంబర్ 7న దండుపాళ్యం–4 సినిమాను చూసి సర్టిఫికెట్ మంజూరు చేయాలని చిత్ర బృందం ఆన్లైన్లో దరఖాస్తు చేసింది. జనవరి 2న తమ సినిమాను చూడకుండానే తరువాత వచ్చిన సినిమాలకు సర్టిఫికెట్లను కేటాయించారు. తాము ఒత్తిడితేవటంతో సినిమాను చూసిన సెన్సార్‌బోర్డ్ సభ్యులు ఎలాంటి కారణాలను చూపకుండానే సినిమాను తిరస్కరించినట్లు ఆరోపించారు. అభ్యంతకర సన్నివేశాలు ఏమైనా ఉంటే తొలగించాలని ఆదేశించాలి, లేదా మళ్లీ షూటింగ్ చేయాలని సూచించాలి, అలా కాకుండా సెన్సార్‌బోర్డ్ తమను వేధిస్తోందని నిర్మాత విమర్శించారు. కోట్లు ఖర్చుచేసి తీసిన సినిమాను సెన్సార్‌బోర్డ్ తిరస్కరించడం సరికాదన్నారు. సినిమాను ఐదు బాషల్లో విడుదల చేయాలని నిర్ణయించామని, అంతలోనే ఇలా జరిగిందని అన్నారు. ఇవేనా కారణాలు దోపిడీ దొంగల కథతో దండుపాళ్యం ఇప్పటివరకు మూడు పార్టులు విడుదలైంది. ఈ మూడు సినిమాలకూ సెన్సార్ బోర్డ్ పెద్దలకు మాత్రమేనని ‘ఎ’ సర్టిఫికెట్‌ను మంజూరు చేసింది. 4వ సినిమాలో మహిళలను వేధిస్తున్న సన్నివేశాలు భయపెట్టేలా ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా మహిళా పాత్రధారుల వస్త్రధారణ, ఒక ఇంట్లో చొరబడి మహిళను మహిళను లైంగికంగా వేధించటం లాంటి సన్నివేశాలు జుగుప్సాకరంగా ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. సినిమా ప్రారంభం నుండి ఇలాంటి భయంకరణమైన సన్నివేశాలు ఉండటంతో సెన్సార్‌బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నరకటం, చంపటం, వేధించటం తప్ప సమాజానికి అవసరమైన మంచి సందేశమే సినిమాలో లేదనే భావన బోర్డ్ సభ్యులకు కలిగినట్లు ఉందని పేరు రాయటానికి ఇష్టపడని సినీ దర్శకుడు ఒకరు అన్నారు. దండుపాళ్యంకు సెన్సార్‌బోర్డ్ నిరాకరణ శాండల్‌వుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. -
జేడీఎస్‌ను గెలిపించండి : నటి
యశవంతపుర: రాష్ట్రం గౌరవం కాపాడటంతో జాతీయ పార్టీలు ఘోరంగా విఫలమైనట్లు నటి, జేడీఎస్ స్టార్ క్యాంపెయినర్ పూజాగాంధీ ఆరోపించారు. సోమవారం ఆమె కన్నడ జిల్లా కార్వార్లో జేడీఎస్ అభ్యర్థి ఆనంద అస్నోటికర్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారవార అంబేడ్కర్ సర్కిల్లో జరిగిన ఎన్నికల బహిరంగసభలో అమె కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కర్ణాటక ప్రతిష్టను కాపాడటంతో కాంగ్రెస్, బీజేపీలో ఘోరంగా విఫలమైనట్లు మండిపడ్డారు. -
ఫోర్త్ గ్యాంగ్‌తో సంబంధం లేదు!
భయానికి కేరాఫ్ అడ్రస్ అనేలా సిల్వర్‌స్క్రీన్‌పై నటించి ప్రేక్షకుల మెప్పుపొందారు దండుపాళ్యం గ్యాంగ్. శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో దండుపాళ్యం గ్యాంగ్‌గా పూజా గాంధీ, మకరంద్ దేశ్‌పాండే, రవి కాలే, రవి శంకర్ ముఖ్య పాత్రలుగా రూపొందిన చిత్రం ‘దండుపాళ్యం’. ఈ సినిమా హిట్ కావడంతో దండుపాళ్యం 2, దండుపాళ్యం 3 చిత్రాలను తెరకెక్కించారు శ్రీనివాస్ రాజు. ‘దండుపాళ్యం 3’ రిలీజ్‌కు రెడీ అయింది. దండుపాళ్యం సిరీస్‌లో ఇదే చివరిదని ఆయన ఇటీవల తెలిపారు. కానీ సడన్‌గా వెంకట్ అనే నిర్మాత సారథ్యంలో ‘దండుపాళ్యం 4’ తెరపైకి వచ్చింది. ‘‘ఈ దండుపాళ్యం 4తో నాకు ఎలాంటి సంబంధం లేదు. పోస్టర్‌పై నా ఫొటో ఉంది. అయితే నేను ఇందులో నటించడంలేదు. నటించమని నన్నెవరూ సంప్రదించలేదు. ‘దండుపాళ్యం 4’ పోస్టర్స్‌పై నా అనుమతి లేకుండా నా ఫొటోలను ఎలా వాడతారు’’ అని పూజగాంధీ పేర్కొన్నారు. మకరంద్ దేశ్‌పాండే అండ్ రవికాలే కూడా ‘దండుపాళ్యం 4’లో నటించడం లేదని స్పష్టం చేశారు. -
మమ్మల్ని దండుపాళ్యం గ్యాంగ్ అంటున్నారు – పూజా గాంధీ
‘‘దండుపాళ్యం 3’ తర్వాత మరో రెండు మూడేళ్ల వరకూ ఈ జానర్లో సినిమాలు చేయను. రెండు భాగాల్లో కీలక పాత్రలు చేసిన నటీనటులే మూడో భాగంలోనూ చేశారు. కొన్ని పాత్రలకు మాత్రం వేరేవాళ్లను తీసుకున్నాం. ఈ మూడు భాగాలకు నాతో పాటు వర్క్ చేసిన డైలాగ్ రైటర్ రమేశ్, కెమెరామేన్ వెంకట్‌ప్రసాద్, ఎడిటర్ రవిచంద్రన్‌లకు థ్యాంక్స్. ‘దండుపాళ్యం’ సిరీస్‌లో ఇదే చివరిది’’ అని శ్రీనివాసరాజు అన్నారు. బొమ్మాళి రవిశంకర్, పూజా గాంధీ, మకరంద్ దేశ్‌పాండే, రవి కాలే ముఖ్య తారలుగా ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘దండుపాళ్యం 3’ని శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో సాయికృష్ణ ఫిలింస్ సమర్పణలో శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషపై శ్రీనివాస్ మీసాల, సాయికృష్ణ పెండ్యాల తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో వేడుకలో పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘ఇప్పటికి మేం 365 చిత్రాలకి రాసాం. ఇప్పుడు మేము, శ్రీనివాసరాజు ఓ సినిమాకి పని చేస్తున్నాం. తను ఏ సినిమా గురించైనా 365 రోజులు డిస్కస్ చెయ్యగలడు. అంత నాలెడ్జ్ ఉంది. వరుసగా సీక్వెల్స్‌తో హిట్స్ సాధిస్తున్నాడు. ఇప్పడు ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘మేం ఇంతకుముందు చేసిన పాత్రలను మరచిపోయి, ‘దండుపాళ్యం’లో చేసిన పాత్రలను గుర్తుపెట్టుకుంటున్నారు. మమ్మల్ని ‘దండుపాళ్యం’ గ్యాంగ్ అంటున్నారు. ఈ సినిమాలో చేసిన లక్ష్మీ పాత్ర కోసం నా బాడీ లాంగ్వేజ్, మాట తీరు మార్చుకోవాల్సి వచ్చింది’’ అని పూజా గాంధీ అన్నారు. ‘‘ఈ సినిమాలో మేం భయంకరమైనవాళ్లలా కనిపించినా రియల్‌గా అమాయకులం’’ అని మకరంద్ అన్నారు. ‘‘తెలుగులో ఎన్నో సినిమాలు చేసినా రాని గుర్తింపు ఈ సినిమాతో వచ్చింది’’ అని రవి కాలే చెప్పారు. ఈ వేడుకలో దర్శకుడు నక్కిన త్రినాథరావు, వీఐ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
నాకు గొంతే ఇష్టం
‘పదకొండు మంది.. ఐదు సంవత్సరాలు.. ఎనభై కేసులు.. మూడు రాష్ట్రాల పోలీసుల కళ్లు కప్పి క్రూర మృగాల్లా తిరుగుతున్నారు’’ అంటూ ప్రారంభమయ్యే ‘దండుపాళ్యం 3’ ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ‘నీకు గొంతుపై ఉండే మాల్ ఇష్టం.. వీడికి గొంతు కింద ఉండే మాల్ ఇష్టం. నాకు గొంతే ఇష్టం’ అనే మరో డైలాగ్ దండుపాళ్యం గ్యాంగ్ క్రూరత్వాన్ని చూపేలా ఉంది. బొమ్మాళి రవిశంకర్, పూజాగాంధీ, మకరంద్ దేశ్‌పాండే, రవికాలే ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘దండుపాళ్యం 3’. శ్రీనివాసరాజు దర్శకత్వంలో రజనీ తాళ్ళూరి నిర్మించిన ఈ చిత్రం జనవరి 25న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు. కన్నడ, తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించి, కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించిన ‘దండుపాళ్యం’ సీక్వెల్స్‌లో భాగంగా ‘దండుపాళ్యం 3’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ‘‘ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్‌కి కూడా అదే రేంజ్లో స్పందన వస్తోంది’’ అన్నారు దర్శకుడు శ్రీనివాసరాజు. ఈ చిత్రానికి సంగీతం: అర్జున్ జన్యా, కెమెరా: వెంకట్ ప్రసాద్. -
సినిమాలో క్రైమ్ నడుస్తుంది..
ప్రపంచ సినిమాలో రియల్ క్రైమ్ ఇన్సిడెంట్స్‌ని తీసుకుని, సీక్వెల్స్‌గా బిల్డ్ చేసి, పెద్ద హిట్స్ అందుకున్న సంస్థలు ఉన్నాయి. యూనివర్శల్, ఫాక్స్‌స్టార్ వంటివి. సినిమాలో క్రైమ్ కాకుండా క్రైమ్‌ని సినిమాగా చూపించడం అనే శ్రీనివాసరాజు ఎక్స్పరిమెంట్ మూడు సీక్వెల్స్‌తో క్లోజ్. ఇది భారత సినిమాలో ‘క్రైమ్ రాయి’. ఆడవాళ్లూ జాగ్రత్త... మీరు ఒంటరిగా ఇంట్లో ఉన్నారా? ఒక లేడీ తలుపు తట్టి, మంచినీళ్లు అడిగిందా? నీళ్లు ఇవ్వడానికి మీరు లోపలికి వెళితే ఘోరం జరుగుతుంది. మీ వెనకాలే ముందు ఆమె, ఆ తర్వాత ఆమె గ్యాంగ్ ఇంట్లోకి చొరబడతారు. ఇంటిని, మీ మానాన్ని దోచుకుంటారు. చివరికి మిమ్మల్ని కిరాతకంగా చంపేస్తారు. అందులో ఒకడు మరీ ఘోరమైనవాడు. పీక కోసి చంపుతాడు. పీకలోంచి రక్తం వస్తున్నప్పుడు వచ్చే శబ్దం అతనికి ఇష్టం. అక్కడ చెవి ఆన్చి, శబ్దం వింటూ ఆనందంలో మునిగిపోతాడు. ‘దండుపాళ్యం’ సినిమా గుర్తొస్తోంది కదూ! కర్నాటకలోని దండుపాళ్యకి చెందిన గ్యాంగ్ ‘దండుపాళ్య’. దోపిడీలు, హత్యలు, మానభంగాలు... ఇవే ఆ గ్యాంగ్ పని. ఈ గ్యాంగ్ పేరు వింటే అక్కడి వాళ్లకు వెన్నులో వణుకు పుట్టాల్సిందే. 2012లో దర్శకుడు శ్రీనివాసరాజు ఈ దండుపాళ్య గ్యాంగ్ ఆధారంగా తీసిన ‘దండుపాళ్యం’ కన్నడ, తెలుగు భాషల్లో విడుదలైంది. సినిమా చూసినవాళ్లు ‘ఇలాంటి మనుషులు ఉంటారా?’ అనుకోకుండా ఉండలేకపోయారు. ఆ తర్వాత ‘దండుపాళ్యం–2’ వచ్చింది. ఈ నెల ‘దండుపాళ్యం–3’ రాబోతోంది. ‘‘ఈ సిరీస్‌లో ఇదే లాస్ట్ పార్ట్. యాక్చువల్‌గా ఐదు పార్ట్స్ తీయాలనుకున్నాను కానీ, మూడింటితోనే ముగిస్తున్నా. రియల్ క్రైమ్ స్టోరీ ఆధారంగా క్రైమ్ నేపథ్యంలో మూడు భాగాలుగా ఇండియన్ స్క్రీన్ మీద వచ్చిన ఫస్ట్ మూవీ ఇది’’ అన్నారు శ్రీనివాసరాజు. మూడో భాగాన్ని రజనీ తాళ్ళూరి నిర్మించారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ – ‘‘దండుపాళ్యం’ని 26 రోజుల్లో తీశాను. ఆడిందా? ఓకే! లేకపోతే? కష్టాలు తప్పవు. అందుకే రిలీజయ్యాక నా అసిస్టెంట్‌ని థియేటర్‌కి పంపించి, అసలు జనాలు ఉన్నారో లేదో చూడనమన్నాను. థియేటర్ నుంచి ఫోన్... హౌస్‌ఫుల్ అని. ఆ తర్వాత నేను థియేటర్‌కి వెళితే అక్కడ బ్లాక్ టికెట్లు అమ్ముతున్న వ్యక్తి ‘50 రూపాయల టికెట్ ఒక్కటే ఉంది. 150 సార్’ అన్నాడు. థియేటర్ మేనేజర్ నన్ను గుర్తుపట్టి, లోపలికి తీసుకెళ్లారు. కన్నడ, తెలుగు భాషల్లో సినిమా సూపర్ డూపర్ హిట్. ఫస్ట్ పార్ట్ హిట్టవ్వడంతో సెకండ్ పార్ట్ మీద చాలా క్రేజ్ పెరిగింది. అది ఓకే అనిపించుకుంది. బోలెడన్ని అంచనాల మధ్య ఇప్పుడు థర్ట్ పార్ట్ రెడీ అయింది. ఇందులో ఏం ఉందో ప్రస్తుతానికి సస్పెన్స్’’ అన్నారు. డైరెక్టర్‌గా మంచి కథ చెప్పాలి కానీ, క్రైమ్ బేస్ట్ రియల్ స్టోరీని ఎందుకు తీసుకున్నారు? టికెట్స్ తెగడానికా? అసలు న్యూడ్ సీన్స్ చూపించాల్సిన అవసరం ఏంటి? అనడిగితే – ‘‘ఏ సినిమాకైనా స్టోరీ ఇంపార్టెంట్. అల్లిన కథతో తీస్తారు. లేకపోతే రియల్ స్టోరీతో తీస్తారు. నేను రెండోది సెలెక్ట్ చేసుకున్నా. రియల్ స్టోరీ తీస్తున్నప్పుడు రియల్‌గా జరిగినవి తీయాలి కదా’’ అన్నారు. ఏం చెప్పి పూజా గాంధీ, సంజనాలతో నగ్న దృశ్యాల్లో నటింపజేశారు? అనడిగితే – ‘‘కథ నచ్చినా న్యూడ్ సీన్స్ ఉన్నాయని పూజా గాంధీ ముందు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఈ సినిమా చేయడానికి మరో నటి రమ్య ఆసక్తిగా ఉందని తెలిసి, పూజా వదలుకోకూడదనుకుంది. ‘మా అమ్మకు కథ చెబుతారా’ అనడిగింది. తల్లీకూతుళ్లిద్దరూ కథ విన్నారు. ‘ఈ సినిమా మిస్సయితే నటిగా నువ్వు చాలా కోల్పోయినట్లే’ అని తల్లి చెప్పడంతో పూజా గాంధీ ఈ సినిమా చేసింది. సెకండ్ పార్ట్‌లో సంజన కూడా సీన్ డిమాండ్ మేరకు చేసింది. ఆ సీన్స్ అలా తీయకపోతే సినిమా పండదు. రియల్‌గా జరిగినవే కాబట్టి, కాంప్రమైజ్ కాకూడదనుకున్నా. ఇలాంటి సీన్స్ తీసేటప్పుడు లొకేషన్లో తక్కువమంది ఉండేలా చూసుకుంటారు. కానీ, నేను మాత్రం యూనిట్ అంతా ఉంటారు. మీకిష్టమైతేనే చేయండి అని క్లారిటీగా చెప్పాను. వాళ్లూ చేసారు. ఈ సీన్స్ చేయాల్సిందేనని నేనెవర్నీ ఒత్తిడి చేయలేదు. వాళ్లే ఇష్టపడి చేశారు’’ అని చెప్పారు. త్వరలో విడుదల కానున్న థర్డ్ పార్ట్ ఎలా ఉంటుంది? అనే ప్రశ్నకు –‘‘ఫస్ట్, సెకండ్ పార్ట్ కన్నా థర్డ్ పార్ట్ బీభత్సంగా ఉంటుంది. టికెట్స్ తెగుతాయనీ, కావాలనీ ఏ సీనూ పెట్టలేదు. జరిగిందే చూపించా. ఈ సిరీస్‌లో చివరి పార్ట్ ఇదే. ఆల్రెడీ రెండు పార్ట్స్ బాగా ఆడటంతో థర్ట్ పార్ట్‌కి చాలా క్రేజ్ వచ్చింది. ఈ పార్ట్‌తో నా ‘దండుపాళ్యం’ జర్నీ కంప్లీట్ అవుతుంది. అయితే, కెరీర్లో ఎప్పటికీ మరచిపోలేని జర్నీ ఇది’’ అని శ్రీనివాసరాజు అన్నారు. ‘బొమ్మాళి’ రవిశంకర్, పూజా గాంధీ, సంజన, మకరంద్ దేశ్‌పాండే, రవి కాలే ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: అర్జున్ జన్యా, కెమెరా: వెంకట ప్రసాద్. -
ఎట్టకేలకు ‘స్పెషల్’ ఫ్రెండ్ దొరికాడు!
ఎఫైర్లతో ఎప్పుడూ వార్తల్లో ఉండే శాండల్‌వుడ్ తార పూజాగాంధీకి ఎట్టకేలకు ‘స్పెషల్’ ఫ్రెండ్ దొరికేశాడు. ఎంగేజ్మెంట్ బ్రేకప్‌తో కొంత కాలంగా డిస్టర్బ్డ్ మూడ్‌లో ఉన్న ఈ చిన్నది... ఇండస్ట్రీ పీపుల్‌తో వెక్స్ అయినట్టుంది. ఇప్పటి వరకూ దర్శక నిర్మాతలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన అమ్మడు తాజాగా ఇండస్ట్రీకి సంబంధం లేని ఓ కుర్రోడితో లింకు పెట్టుకుందని అక్కడ టాక్. పూజా ఎక్కడుంటే అక్కడే కనిపిస్తున్నాడట అతగాడు. ఖాళీ సమయాల్లోనూ ఒకరినొకరు వదలకుండా... లంచ్‌లు, డిన్నర్లకు చెక్కేస్తున్నారట. -
‘యంగ్’ ఎఫైర్!
ముప్పై ఒక్కేళ్ల భామ పూజాగాంధీ... ఇరవై ఏడేళ్ల దర్శకుడు సతీష్ ప్రధాన్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తుందట. శాండల్‌వుడ్‌లో ‘హాట్’ టాపిక్ ఇది. కానీ అలాంటిదేమీ లేదంటోందీ నటి. ‘నేను మహిళను. బెంగళూరు దాటి బయటకు వెళ్లేప్పుడు సహజంగానే ఎవరో ఒకరి తోడు కావాలి. అదీ నేను చేస్తున్న సినిమా దర్శకుడతడు. అందులో తప్పేముంది! పైగా ఇద్దరం కలసి స్క్రిప్ట్, పాత్రల తీరు వంటివి చర్చించుకోవడం వల్ల చిత్రం మరింత అద్భుతంగా వస్తుంది’ అంటూ చెబుతున్న ఈ తారకు... నిప్పు లేనిదే పొగ రాదని తెలియలేదేమో మరి.