Samyuktha Hegde's Stunning Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Samyuktha Hegde: కిరాక్ పార్టీ హీరోయిన్.. ఆ వీడియో చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

Published Mon, Jul 10 2023 2:06 PM | Last Updated on Mon, Jul 10 2023 4:06 PM

Samyuktha Hegde Stunning Video Goes Viral In Social Media - Sakshi

కిరిక్ పార్టీ సినిమా ద్వారా కన్నడ సినీ పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ సంయుక్తా హెగ్డే. ప్రస్తుతం షూటింగ్‌లతో విదేశీల్లో బిజీగా ఉంది. సినిమాలే కాకుండా సంయుక్త కన్నడ, హిందీ రియాల్టీ షోలలో పాల్గొని మంచి పేరు తెచ్చుకుంది. అంతే కాకుండా ఈ భామ ఫిట్‌నెస్‌పై కూడా ఎక్కువ శ్రద్ధ చూపుతోంది. ఎప్పటికప్పుడు వర్కవుట్స్ చేస్తూ సోషల్ మీడియాలోనూ షేర్ చేస్తూ ఉంటోంది. ఇటీవల సంయుక్తా హెగ్డే సినిమాల కంటే వ్యక్తిగత సమస్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో సంయుక్తి షేర్ చేసిన వీడియో తెగ వైరలవుతోంది. దీనిపై ఆమెను కొందరు ప్రశంసిస్తుండగా.. మరికొందరేమో తప్పుబడుతున్నారు. సంయుక్త లుక్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసుకుందాం.

(ఇది చదవండి: ఆమె జీవితమంతా కష్టాలు, కన్నీళ్లే.. కానీ ఇప్పుడామె స్టార్ హీరోయిన్!)

ఇన్‌స్టాలో వీడియో షేర్ చేసిన ముద్దుగుమ్మ.. 'మీ శరీరం మీ ఆస్తి. మనం ఎలాంటి సామాజిక నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. మహిళలు దృఢంగా, స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. బలమనేది పురుషులు లేదా స్త్రీలకు సంబంధించింది కాదు. బలం, విశ్వాసం మీ శక్తిని పెంచుకోవడానికి ప్రతిరూపం' అంటూ అర్ధనగ్నంగా ఉన్న వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుండగా.. దీనిపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు.  మీరు ఇతర మహిళలకు స్ఫూర్తి అని కొందరు వ్యాఖ్యానించగా.. మరికొందరు ఒక మహిళగా మీ శరీరాన్ని ఇలా ప్రదర్శించాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. ఫేమ్ కోసం మీరు చేస్తున్న జిమ్మిక్కు అంటూ కామెంట్ చేస్తున్నారు. 

తరచుగా  వివాదాలే

బిగ్ బాస్ సీజన్ 5లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కంటెస్టెంట్‌గా వచ్చిన సంయుక్త హెగ్డే తన కంటెస్టెంట్ సమీర్‌ను చెంపపై కొట్టడంతో వార్తల్లో నిలిచింది. అప్పట్లో సంయుక్త ప్రవర్తనను అందరూ వ్యతిరేకించారు. తరువాత 2020లో.. బెంగళూరులోని ఒక పార్క్‌లో సంయుక్త తన స్నేహితులతో కలిసి హులా హూప్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు.. ఆమె దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేసిన మహిళతో గొడవ పడ్డారు. అలాగే, గతేడాది కాంపౌండ్ పూల్ దగ్గర బ్లూ మైక్రో బికినీలో కనిపించి వార్తల్లో నిలిచింది.

కాగా.. కర్ణాటకకు చెందిన సంయుక్త హెగ్డే రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కిరిక్ పార్టీ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సంయుక్త కోలేజ్ కుమార్ సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగులో కిరాక్ పార్టీ ద్వారా అడుగు పెట్టారు. తెలుగు, తమిళ సినిమాల్లో బిజీగా ఉన్న సంయుక్త హెగ్డే చాలా ఏళ్ల తర్వాత రానా సినిమాతో మళ్లీ కన్నడలోకి  రీ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల విడుదలైన అర్జెంట్ ఎగ్జిట్ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న క్రీమ్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

(ఇది చదవండి: ఈ వారం కొత్త సినిమాల సందడి.. ఓటీటీలోనే ఎక్కువ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement