Samyuktha Hegde Injured During Cream Movie Action Scene Shooting Set, Details Inside - Sakshi
Sakshi News home page

Samyuktha Hegde Injury: షూటింగ్‌లో గాయపడ్డ హీరోయిన్‌, వీడియో వైరల్‌

Published Thu, Jul 28 2022 2:55 PM | Last Updated on Thu, Jul 28 2022 3:42 PM

Samyuktha Hegde Injured in Cream Movie Set With Short Action Scene - Sakshi

యంగ్‌ హీరో నిఖిల్‌ ‘కిరాక్‌ పార్టీ’ మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన కన్నడ బ్యూటీ సంయుక్త హెగ్డే. తాజాగా ఆమె షూటింగ్‌లో గాయపడింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న కన్నడ చిత్రం ‘క్రీమ్‌’. ఈ చిత్రంలో యాక్షన్‌ సీన్స్‌ చేస్తుండగా ఆమె తీవ్రంగా గాయపడటంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. ఫైట్‌ సీన్స్‌ చేస్తుండగా తన కాలు సరిగా ల్యాండ్‌ అవ్వకపోవడం మోకాలి దగ్గర బలమైన గాయమైందని, వైద్యులు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు ఈ సందర్భంగా సంయుక్తి చెప్పుకొచ్చింది.

అంతేకాదు ఇందుకు సంబంధించిన మేకింగ్‌ వీడియోను కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. అయితే తనకు గాయమైనప్పటికీ.. సినిమా విడుదలైన తర్వాత ఆ ఫైట్‌ సీన్‌ చూసి ప్రేక్షకులు తనని మెచ్చుకుంటారని పోస్ట్‌లో పేర్కొంది. కాగా ఇటీవల కాలేజ్‌ కుమార్‌ మూవీతో ప్రేక్షకులను అలరించిన ఆమె ‘ఆహా’లో విడుదలైన తమిళ డబ్బింగ్ సినిమా ‘మన్మథ లీలై’లో నటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement