
ఈ తరం కథానాయకులు కొందరు సినిమా ఆకాశాల కోసమో, లేక వార్తల్లో ఉండడం కోసమో పడరాని పాట్లు పడుతున్నారు. అదేవిధంగా ఇన్‌స్ట్రాగామ్‌లో ఫాలోవర్స్ కోసం గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. చివరికి బికినీల్లోనూ కనిపించడానికి వెనుకాడడం లేదు. నటి సంయుక్త హెగ్డే పరిస్థితి ఇదే. ఈ శాండిల్ వుడ్ బ్యూటీ ఆ మధ్య బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోలో పాల్గొని హల్ చల్ చేసింది.
(ఇది చదవండి: క్రికెట్ జట్టు కొనుగోలు చేయనున్న రామ్ చరణ్, ఐపీఎల్‌లోనా?)
కన్నడలో కథానాయకిగా చిత్రాలు చేస్తున్న సంయుక్త హెగ్డే తమిళంలోనూ జి వీ.ప్రకాష్ కుమార్ సరసన వాచ్మెన్, జయం రవి తో కోమాలి, అశోక్ సెల్వన్ కు జంటగా మన్మధ లీలై, వరుణ్‌కు జతగా పప్పీ వంటి చిత్రాల్లో నటించింది. అయితే వీటిలో చాలావరకు సక్సెస్ అయిన సంయుక్తకు మాత్రం పెద్దగా క్రేజ్ తెచ్చి పెట్టలేదు. దీంతో ప్రస్తుతం తమిళంలో ఒక చిత్రం కూడా లేదు.
దీంతో మళ్లీ అవకాశాలను రాబట్టుకోవాలనే ప్రయత్నంలో భాగంగా సామాజిక మాధ్యమాలను వేదికగా వాడుకుంటోంది. తన గ్లామరస్ ఫొటోలను ఇన్ స్ట్రాగామ్‌లో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అలాంటిది తాజాగా ఈత దుస్తుల్లో స్విమ్ చేస్తున్న ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది.
(ఇది చదవండి: క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీ ఆర్టిస్టుగా మారిన రంగస్థలం మహేశ్)
అది ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. నెటిజన్లు మాత్రం సంయుక్త హెగ్డేపై రకరకాల ట్రోలింగ్ చేస్తున్నారు. తను కోరుకున్నదీ ఇదే కాబట్టి ఈ అమ్మడు వాటిపై నోరు మెదపడం లేదని సమాచారం. మరి నటి సంయుక్త హెగ్డే ట్రిక్స్ ఎంతవరకు ఫలితానిస్తాయో కాలమో నిర్ణయించనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment