Niharika Konidela Post Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Niharika Konidela: మామిడికాయ తింటూ నిహారిక పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్

Published Wed, Apr 5 2023 4:39 PM | Last Updated on Wed, Apr 5 2023 5:08 PM

Niharika Konidela Post Goes Viral In Social Media - Sakshi

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యాంకర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన ఆమె నటిగా రాణించింది. ఇక పెళ్లి అనంతరం ప్రొడ్యూసర్‌గా మారిపోయింది. ఇప్పటికే ఓ వెబ్‌ సిరీస్‌, సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల మెగా డాటర్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. నిహారిక విడాకుల రూమర్స్‌ సోషల్‌ మీడియాలో వచ్చిన సంగతి తెలిసిందే. 2020లో జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్యతో నిహారిక వివాహం జరగింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య కొంతకాలంగా విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయంటూ వార్తలొచ్చాయి. 

అయితే తాజాగా నిహారిక మరోసారి వార్తల్లో నిలిచింది. ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేయడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మేకప్‌ లేకపోయినా చాలా అందంగా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఎనిథింగ్ స్పెషల్ అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. `డెడ్ పిక్సెల్స్`అనే టైటిల్ తో తెరకెక్కుతున్నఈ ప్రాజెక్ట్‌ను స్వయంగా నిహారిక నిర్మించడమే ఆమె కూడా నటిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement