మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన నిహారిక ఒక మనసు చిత్రంతో హీరోయిన్‌గా మారింది. మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఫ్యామిలీ సహా పర్సనల్ విషయాలు షేర్ చేసేది.అయితే ఇటీవలె జిమ్‌లో ఆమె షేర్ చేసిన ఓ వీడియోపై విపరీతంగా ట్రోల్స్ రావడంతో సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిన నిహారిక సడెన్‌గా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డిలీట్ చేసేసింది.
దీనిపై అప్పట్లో నెట్టింట తెగ చర్చ నడిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పబ్ ఇన్సిడెంట్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన నిహారిక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
8వారాల ఇన్‌స్టాగ్రామ్ బ్రేక్ నుంచి నేను నేర్చుకున్న పాఠాలు ఇవే..
1. ''ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదు
2.ఇతరులు ఏం చేస్తున్నారన్నది నేను పట్టించుకోను
3.ఇప్పుడు నేను నిజంగా రీఫ్రెష్ అయ్యాను. పోస్టులు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాను'' అంటూ నిహారిక చేసిన పోస్ట్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఇక వెల్‌కం బ్యాక్ నిహారిక.. నిన్ను చాలా మిస్సయ్యాం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment