విద్యార్థులతో మాట్లాడుతున్న హీరో నిఖిల్
కిరాక్ పార్టీ సినిమా ప్రమోషన్‌లో భాగంగా శుక్రవారం నగరానికి వచ్చేసిన ఆ చిత్ర హీరో నిఖిల్‌తో సహా యూనిట్ సభ్యులు అవంతి ఇంజినీరింగ్ కళాశాలతోపాటు సీఎంఆర్ సెంట్రల్‌లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని
అభిమానులను ఉర్రూతలూగించారు.
తగరపువలస (భీమిలి) / మద్దిలపాలెం(విశాఖ తూర్పు):ఈ నెల 16న విడుదల కానున్న కిరాక్‌పార్టీ సినిమా హీరో నిఖిల్ సిద్ధార్థ్, హీరోయిన్లు సిమ్రాన్ పరీంజా, సంయుక్త హెగ్డేలు చెరకుపల్లి అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో సందడి చేశారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం చేరుకున్న వీరు విద్యార్థులను ఆటా, పాటలతో అలరించారు. హుషారైన పాటలకు స్టెప్పులు వేశారు. వీరితో సెల్ఫీలు దిగడానికి విద్యార్థులు పోటీపడ్డారు. హాస్య నటుడు రఘు కొంతసేపు విద్యార్థులను నవ్వించాడు. డైరెక్టర్ కొప్పశెట్టి శరణ్ మాట్లాడుతూ కళాశాల నేపథ్యంలో విద్యార్థులను ఆకట్టుకునేవిధంగా ఈ చిత్రాన్ని నిర్మించినట్టు చెప్పాడు. తమ కిర్రాక్ పార్టీని అందరూ ఆదరించాలని కోరారు. అనంతరం ఈ నెల 16, 17 తేదీలలో కళాశాలలో జరుగనున్న జాతీయస్థాయి యూత్ లెవెల్ ఫెస్టివల్ అవెన్సిస్ పోస్టర్‌ను హీరో నిఖిల్ అవిష్కరించారు. కిరాక్ పార్టీ చిత్ర యూనిట్ మద్దిలపాలెం సీఎంఆర్ సెంట్రల్‌లో శుక్రవారం సందడి చేసింది. హీరో నిఖిల్, హీరోయిన్ సిమ్రాన్ పరీంజా, హాస్యనటుడు రఘు చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment