avanthi engineering college
-
అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత్
తగరపువలస (భీమిలి): నూతన విద్య, ఆర్థిక విధానాల కారణంగా అభివృద్ధిలో దేశం దూసుకుపోతోందని మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. చెరకుపల్లిలోని అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో రెండు రోజులపాటు నిర్వహించనున్న గ్యాన్–2కే23 జాతీయ సాంకేతిక ఫెస్ట్‌ను శుక్రవారం ఆయన c. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అభివృద్ధిని నేటి తరం అనుభవిస్తుంటే తనకు అసూయగా ఉందన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా దేశం తన అవసరాలను తీర్చుకోవడంతోపాటు విదేశాలకు అవసరమైన ఎగుమతులు చేయగలుగుతోందన్నారు. ప్రపంచానికి అవసరమైన సాంకేతికపరమైన డేటా మనదేశంలో చౌకగా లభిస్తుందన్నారు. విద్యార్థులు తన చుట్టూ ఉన్నవారికి, దేశానికి అవసరమైన వాటిని గుర్తించి ఉత్పత్తి చేయడం ద్వారా పారిశ్రామికవేత్తలుగా విజయం సాధించాలని సూచించారు. అవంతి విద్యాసంస్థల చైర్మన్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి కులం, డబ్బు వంటివాటితో పనిలేదన్నారు. తెలివితేటలు, కష్టపడే తత్వం అలవరచుకోవాలన్నారు. జేఎన్టీయూ–కె ఉపకులపతి ఆచార్య జీవీఆర్ ప్రసాదరాజు మాట్లాడుతూ విద్యార్థులు టెక్నికల్, సాఫ్ట్ స్కిల్స్, లైఫ్‌స్కిల్స్‌ను మెరుగుపరుచుకుంటూ నిరంతరం అభ్యాసం చేయాలన్నారు. వరంగల్ నిట్ ప్రొఫెసర్ ఎం.సైదులు, అవంతి విద్యాసంస్థల డైరెక్టర్ ఆకుల చంద్రశేఖర్, మేనేజింగ్ డైరెక్టర్ ఐ.శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: Andhra Pradesh: సామాన్యుడికి ఆధునిక వైద్యం -
కిరాక్ పుట్టించిన నిఖిల్
కిరాక్ పార్టీ సినిమా ప్రమోషన్లో భాగంగా శుక్రవారం నగరానికి వచ్చేసిన ఆ చిత్ర హీరో నిఖిల్‌తో సహా యూనిట్ సభ్యులు అవంతి ఇంజినీరింగ్ కళాశాలతోపాటు సీఎంఆర్ సెంట్రల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని అభిమానులను ఉర్రూతలూగించారు. తగరపువలస (భీమిలి) / మద్దిలపాలెం(విశాఖ తూర్పు):ఈ నెల 16న విడుదల కానున్న కిరాక్‌పార్టీ సినిమా హీరో నిఖిల్ సిద్ధార్థ్, హీరోయిన్లు సిమ్రాన్ పరీంజా, సంయుక్త హెగ్డేలు చెరకుపల్లి అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో సందడి చేశారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం చేరుకున్న వీరు విద్యార్థులను ఆటా, పాటలతో అలరించారు. హుషారైన పాటలకు స్టెప్పులు వేశారు. వీరితో సెల్ఫీలు దిగడానికి విద్యార్థులు పోటీపడ్డారు. హాస్య నటుడు రఘు కొంతసేపు విద్యార్థులను నవ్వించాడు. డైరెక్టర్ కొప్పశెట్టి శరణ్ మాట్లాడుతూ కళాశాల నేపథ్యంలో విద్యార్థులను ఆకట్టుకునేవిధంగా ఈ చిత్రాన్ని నిర్మించినట్టు చెప్పాడు. తమ కిర్రాక్ పార్టీని అందరూ ఆదరించాలని కోరారు. అనంతరం ఈ నెల 16, 17 తేదీలలో కళాశాలలో జరుగనున్న జాతీయస్థాయి యూత్ లెవెల్ ఫెస్టివల్ అవెన్సిస్ పోస్టర్‌ను హీరో నిఖిల్ అవిష్కరించారు. కిరాక్ పార్టీ చిత్ర యూనిట్ మద్దిలపాలెం సీఎంఆర్ సెంట్రల్లో శుక్రవారం సందడి చేసింది. హీరో నిఖిల్, హీరోయిన్ సిమ్రాన్ పరీంజా, హాస్యనటుడు రఘు చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేస్తా
-
ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేస్తా: రామ్ చరణ్
విశాఖ : స్టూడెంట్ లైఫ్ తనకు ఇష్టమని ఏడాది పాటు షూటింగ్‌లకు సెలవు పెట్టి కాలేజీలో చేరిపోవాలని ఉందని టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తెలిపారు. విద్యార్థలకు నచ్చితే ఎందరినైనా స్టార్లు చేస్తారు, పార్టీలను నిలబెడతారు, నచ్చకపోతే కూల్చగలరని ఆయన అన్నారు. చెరకుపల్లి అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన అవిన్సెస్–2కె17 జాతీయస్థాయి సాంస్కృతిక, క్రీడా ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆదివారం రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాన్న చిరంజీవి, బాబాయ్ పవన్ కల్యాణ్‌ల ద్వారా తనకు వచ్చిన హోదాను కాపాడుకోవడానికి ఒళ్లు దగ్గరపెట్టుకుని అభిమానుల తల ఎత్తుకునేలా పని చేస్తానన్నారు. గతేడాది ధృవ, ఈ ఏడాది ఖైదీనంబర్ 150తో అభిమానులు తమ కుటుంబానికి మంచి ఊపు ఇచ్చారన్నారు. కాటమరాయుడు టీజర్ బాగుందని ఈ సినిమా ద్వారా ఉగాది నాలుగురోజులు ముందే వస్తుందన్నారు. విద్యార్థుల కోరిక మేరకు షేర్‌ఖాన్.. ఒక్కొక్కర్ని కాదు వందమందిని పంపించు అంటూ ... మగధీరలోని డైలాగ్ చెప్పిన చెర్రీ... వారితో కేరింతలు కొట్టించారు.