నిఖిల్ 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' ట్రైలర్ రిలీజ్ | Nikhil's 'Appudo Ippudo Eppudo' Movie Trailer Out | Sakshi
Sakshi News home page

'స్వామి రారా' దర్శకుడితో నిఖిల్ మూడో మూవీ.. ట్రైలర్ చూశారా?

Published Mon, Nov 4 2024 5:15 PM | Last Updated on Mon, Nov 4 2024 5:22 PM

Nikhil's 'Appudo Ippudo Eppudo' Movie Trailer Out

'కార్తికేయ 2' మూవీతో నిఖిల్.. పాన్ ఇండియా క్రేజ్ సంపాదించాడు. అలాంటిది ఈ హీరో నుంచి సినిమా వస్తుందంటే ఎంత హడావుడి ఉండాలి. కానీ అలాంటిదేం లేకుండా ఉన్నట్లుండి ఓ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' పేరుతో తీసిన ఈ చిత్రం నవంబర్ 8న థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)

ట్రైలర్ చూస్తుంటే యూకేలోనే మూవీ అంతా తీసినట్లు కనిపిస్తుంది. డివైజ్ కోసం ఓ గ్యాంగ్ అంతా వెతుకుంటారు. అసలు ఇందులో హీరో, అతడి ఫ్రెండ్ ఎలా ఇరుక్కున్నారు? చివరకు ఏమైందనేదే స్టోరీ అనిపిస్తుంది. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్, దివ్యాంశ హీరోయిన్లుగా నటించారు. నిఖిల్‌తోనే 'స్వామి రారా', 'కేశవ' సినిమాలు తీసిన సుధీర్ వర్మ ఈ మూవీకి దర్శకుడు. చాలా ఏళ్ల క్రితమే షూటింగ్ పూర్తవగా.. ఇప్పుడు మూవీని రిలీజ్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న నటి సన్నీ లియోన్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement