
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం 18 పేజెస్, కార్తీకేయ 2తో బిజీగా ఉన్నాడు. అలాగే వీటితో పాటు సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ తెరకెక్కుతున్న ఈ హాట్రిక్ మూవీకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. గతేడాది 2021లో ఈమూవీపై నిఖిల్ ప్రకటన ఇచ్చాడు. ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
చదవండి: రామ్ గోపాల్ వర్మపై నిర్మాత చీటింగ్ కేసు, వివరణ ఇచ్చిన ఆర్జీవీ
ఇప్పటికే మేకర్స్ పలు ఓటీటీ సంస్థలతో చర్చలు జరిపారని, చివరకు జీ5 మంచి డీల్‌ను ఒప్పందం కుదుర్చుకున్నట్లు సినీవర్గాల నుంచి సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ విషయం తెలిసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు అన్ని ఓటీటీ బాట పట్టాయి. ఇక కరోనా అనంతరం థియేటర్ల తెరుచుకోవడంతో చిన్న సినిమాలు సైతం వెండితెరపైకి వస్తున్న నేపథ్యంలో నిఖిల్ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయడంపై అతడి ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈవార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment