Sharwanand Oke Oka Jeevitham Director Sri Karthik Comments On Movie Success Deets Here - Sakshi
Sakshi News home page

Oke Oka Jeevitham Movie: ఆ ఆలోచనతో ‘ఒకే ఒక జీవితం’ కథ రాసుకున్నాను: శ్రీకార్తీక్‌

Published Wed, Sep 14 2022 11:18 AM | Last Updated on Wed, Sep 14 2022 11:40 AM

Oke Oka Jeevitham Director Sri Karthik Comments On Movie Success - Sakshi

‘‘మనం ఏదైనా పనిని నిజాయితీగా చేస్తుంటే ఈ విశ్వమే తోడై మనల్ని ముందుకు నడిపిస్తుంటుందని నా నమ్మకం. ఒకే ఒక జీవితం’ సినిమా షూటింగ్‌ సమయంలో ఈ విషయం నాకు చాలా సందర్భాల్లో అనుభవంలోకి వచ్చింది. అలాగే అన్ని వేళలా సహనంతో ఉండాలని ఈ సినిమాతో నేర్చుకున్నాను’’ అన్నారు దర్శకుడు శ్రీ కార్తీక్‌. శర్వానంద్, రీతూ వర్మ జంటగా అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్ర యూనిట్‌ పేర్కొంది

(చదవండి: ఇంతకంటే గొప్ప విజయం ఏముంటుంది)

 ఈ సందర్భంగా ఈ చిత్రదర్శకుడు శ్రీకార్తీక్‌ మాట్లాడుతూ – ‘‘నటుడిగా ట్రై చేసి, అవకాశాలు రాకపోవడంతో ఆ ఫ్రస్ట్రేషన్‌లో నేనే రాయాలి, నేనే తీయాలనుకుని కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్, యాడ్‌ ఫల్మ్స్‌ చేశాను. నేను షార్ట్‌ ఫిల్మ్స్ చేసేటప్పుడు మా అమ్మగారు అపస్మారక స్థితిలో ఉన్నారు. నేను ఫిల్మ్‌మేకర్‌ను అవుతానని కూడా ఆమెకు తెలియదు. ఈ విషయంలో నాకు పశ్చాత్తాపం ఉండేది. దాంతో కాలాన్ని వెనక్కి తీసుకుని వెళ్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో ‘ఒకే ఒక జీవితం’ కథ రాసుకున్నాను. ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని టైమ్‌ మిషన్ బ్యాక్‌డ్రాప్‌ పెట్టాను. ఈ సినిమాకు ఆడియన్స్‌ కనెక్ట్‌ అయ్యారు. శర్వానంద్ లాంటి హీరో ఇలాంటి సినిమాను యాక్సెప్ట్‌ చేయడమే పెద్ద సక్సెస్‌. కథ విన్న వెంటనే అమలగారు ఒప్పుకున్నారు. ఇక అల్లు అర్జున్ గారి కోసం నా దగ్గర ఓ రియల్‌ ఫ్యాంటసీ కథ ఉంది’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement