Oke Oka Jeevitham
-
Mother's Day 2024: బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ‘అమ్మ’
నిస్వార్థ ప్రేమకు చిరునామ అమ్మ. తొమ్మిది నెలలు కడుపున మోసి, ప్రాణాలు పోయేంత నొప్పులను భరించి, ప్రాణం పోసిన తర్వాత బిడ్డ కోసం తల్లి చేసే త్యాగాలు అన్ని ఇన్ని కాదు. మన ఎదుగుదలలో అడుగడుగునా తోడుండే ఏకైక వ్యక్తి అమ్మ. మనకు ఏ చిన్న కష్టం వచ్చినా..విలవిలలాడి పోయేది మొదటి వ్యక్తి అమ్మ. అలాంటి అమ్మ ప్రేమకు గుర్తుగా ప్రతి ఏడాది మే రెండో ఆదివారం ప్రపంచవ్యాప్తంగా మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన కొన్ని టాలీవుడ్ సినిమాలపై లుక్కేద్దాం.గుంటూరు కారం(2024)మహేశ్‌బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం చిత్రం మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కినదే. ఇందులో మహేశ్‌కు తల్లిగా రమ్యకృష్ణ నటించింది. అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం కారణంగా చెల్ల చెదురైన ఓ మంచి కుటుంబం.. మళ్లీ ఎలా కలిసింది? దూరమైన తల్లి, కొడుకు చివరకు ఎలా దగ్గరయ్యారు అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా క్లైమాక్స్‌లో రమ్యకృష్ణ- మహేశ్‌బాబు మధ్య జరిగే సంభాషణలు హృదయాలను హత్తుకుంటాయి.ఒకే ఒక జీవితం(2022)శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అతని తల్లిగా సీనియర్ హీరోయిన్ అక్కినేని అమల నటించింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌కి మదర్ సెంటిమెంట్‌ని యాడ్ చేసి అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శ్రీకార్తిక్. 20 ఏళ్ల క్రితం తల్లిని కోల్పోయిన ఓ బిడ్డకి.. తిరిగి అమ్మను చూసే అవకాశం వస్తే..? గతంలో చేసిన తప్పుల్ని సవరించుకునే చాన్స్ లభిస్తే..? ఇది వినడానికే ఆశ్చర్యంగా, ఆసక్తికరంగా ఉంది. అంతే ఆసక్తికరంగా తెరపై చూపించాడు దర్శకుడు శ్రీకార్తీక్. టైమ్ మిషన్ కథని అమ్మ ఎమోషన్ తో ముడి పెట్టి ‘ఒకే ఒక జీవితం’చిత్రాన్ని తెరకెక్కించాడు. జీవితం ఎవరికీ రెండో అవకాశం ఇవ్వదు. ఒకవేళ ఇస్తే... విధి రాతని మార్చగలమా? అనే పాయింట్‌ని ఆసక్తికరంగా చూపించాడు.'బిచ్చగాడు'తమిళ నటుడు విజయ్ ఆంటోని నటించిన చిత్రం బిచ్చగాడు. 2016లో విడుదలైన పిచ్చైకారన్ అనే తమిళ చిత్రానికి తెలుగు రీమేక్. తమిళ దర్శకుడు శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా విజయ్ ఆంటోనీ, సట్నా టైటస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఒక కోటీశ్వరుడు తన తల్లి ఆరోగ్యం కోసం కొద్ది రోజులు బిచ్చగాడిగా మారడం ఈ సినిమా కథాంశం. తెలుగులో మే 13, 2016న విడుదలైంది.లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్(2012)2012లో విడుదలైన చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగున్, జరా షా, రష్మీ, కావ్య, నవీన్ పోలిశెట్టి, అమల ప్రధాన పాత్రలో నటించారు. తల్లి పాత్రలో అమల మెప్పించింది. ప్రస్తుతం ఈ చిత్రం హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అమ్మ చెప్పింది2006లో విడుదలైన చిత్రం ‘అమ్మ చెప్పింది’. శర్వానంద్, శ్రియా రెడ్డి, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు. గంగరాజు గుణ్ణం దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా లభించింది. సంగీతాన్ని ఎమ్ఎమ్ కీరవాణి అందించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. ప్రభాస్ 'ఛత్రపతి'(2005)రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'ఛత్రపతి'. 2005లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో భానుప్రియ ప్రభాస్‌కు తల్లిగా నటించింది. తల్లి, కుమారుల మధ్య అనుబంధం ఈ సినిమాలో చూపించారు. శ్రియ శరణ్ హీరోయిన్ పాత్ర పోషించింగి.యోగి: ఒక చిన్న గ్రామానికి చెందిన తల్లి తన కొడుకు కోసం నగరంలో వెతికే కథాచిత్రమే 'యోగి'. ఈ చిత్రంలో 'యే నోము నోచింది.. ఏ పూజ చేసింది' అనే పాట ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించింది. తల్లి, కుమారుల ప్రేమను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. ప్రభఆస్ హీరోగా నటించిన చిత్రాన్ని వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కించారు.అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి(2003)2003లో దర్శకుడు పూరీ జగన్నాధ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన చిత్రం అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎమోషనల్‌గా టచ్ చేసింది. ఒక తల్లి తన కొడుకు కోసం తన భర్తతో సహా సర్వస్వం త్యాగం చేస్తుంది. ఈ సినిమాలో రవితేజ, ఆసిన్, జయసుధ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు.నిజంకొడుకు సాయంతో భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకునే తల్లి కథే నిజం. ఈ సినిమాను తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు, రక్షిత, రామేశ్వరి, గోపీచంద్, రంగన్నాధ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2003లో విడుదలైంది. ఉత్తమ నటుడిగా మహేష్ బాబు, సహాయ నటిగా రామేశ్వరి నంది అవార్డులను గెలుచుకున్నారు. ఈ సినిమా ప్రస్తుతం జియో సినిమా, సన్ నెక్ట్స్‌లో అందుబాటులో ఉంది. వీటితో పాటు అమ్మ, యమలీల, మాతృదేవోభవ, లోఫర్, చిరుత, అమ్మ రాజీనామా, సింహరాశి, పెదబాబు లాంటి సినిమాలు కూడా మదర్ సెంటిమెంట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించాయి. -
‘ఓకే ఒక జీవితం’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్
శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తీక్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 16న తెలుగు, తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అక్కినేని అమల శర్వానంద్ తల్లిగా కీలక పాత్రలో నటించారు. మదర్సెంటిమెంట్తో వచ్చిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళనంలో విశేష ప్రేక్షకులను ఆదరణ అందుకుంది. థియేటర్లో మంచి విజయం సాధించిన ఒకే ఒక జీవితం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసంది. చదవండి: ‘గాడ్‌ఫాదర్’పై సూపర్ స్టార్ రజనీ రివ్యూ.. ఏమన్నారంటే అక్టోబరు 20 నుంచి ఈ సినిమాను ఓటీటీలో అందుబాటులోకి తెస్తున్నట్లు సోనీ లీవ్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ‘జీవితం రెండో అవకాశం ఇస్తే విధిరాతను మార్చుకోగలమా? శర్వానంద్, రీతూవర్మ, అమల కలయికలో వచ్చిన ఒకేఒక జీవితం మూవీ ఈ నెల 20 నుంచి మీ సోనీలివ్ ఇంటర్నేషనల్‌లో రానుంది’ అంటూ అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. ముగ్గురు యువకుల జీవితాలను ఎమోషన్స్, కామెడీ మిక్స్ చేసి తీశారు. సైన్స్ గొప్పదే కానీ గతాన్ని మర్చగలిగే శక్తి దానికి లేదనే సందేశాన్ని ఈ సినిమాతో ఇచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలో కణం పేరుతో విడుదలైంది.ఈ సినిమాలో వెన్నెల కిశోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చదవండి: తల్లిదండ్రులైన మరుసటి రోజే నయన్ దంపతులకు షాక్! జీవితం రెండో అవకాశం ఇస్తే విధి రాతను మార్చుకోగలమా? శర్వానంద్, రీతు వర్మ, అమల కలయికలో వచ్చిన “ఒకే ఒక జీవితం” ఈ నెల 20 నుండి మీ సోనీ LIV International లో#OkeOkaJeevithamOnSonyLIV #SonyLIVInternational #OkeOkaJeevitham pic.twitter.com/QMQPpxiCJq — SonyLIV International (@SonyLIVIntl) October 10, 2022 -
ఓటీటీలో శర్వానంద్ 'ఒకే ఒక జీవితం'.. రిలీజ్ డేట్ ఫిక్స్
శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఈ చిత్రంతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 16న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అక్కినేని అమల శర్వానంద్ తల్లి పాత్రలో కీలక పాత్రలో నటించారు. మదర్సెంటిమెంట్తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ డేట్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లీవ్‌లో ఈనెల 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలోనూ 'కణం' పేరుతో విడుదలైంది. ఈ సినిమాలో వెన్నెల కిశోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీవితం రెండో అవకాశం ఇస్తే విధి రాతను మార్చుకోగలమా? శర్వానంద్, రీతు వర్మ, అమల కలయికలో వచ్చిన “ఒకే ఒక జీవితం” ఈ నెల 20 నుండి మీ సోనీ LIV International లో#OkeOkaJeevithamOnSonyLIV #SonyLIVInternational #OkeOkaJeevitham pic.twitter.com/QMQPpxiCJq — SonyLIV International (@SonyLIVIntl) October 10, 2022 -
ఓటీటీలోకి 'ఒకే ఒక జీవితం' మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తీక్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 16న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అక్కినేని అమల శర్వానంద్ తల్లి పాత్రలో కీలక పాత్రలో నటించారు. మదర్సెంటిమెంట్తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లీవ్ సుమారు 15 కోట్లకు సొంతం చేసుకుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అక్టోబర్ రెండో వారంలో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలో కణం పేరుతో విడుదలైంది.ఈ సినిమాలో వెన్నెల కిశోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. -
చాన్స్ వస్తే ఆ రోజులకి వెళ్లిపోతా!
‘‘ఆడని ఓ సినిమాను హిట్ అని ప్రేక్షకులను, విమర్శకులను మభ్య పెట్టలేం. ఫెయిల్యూర్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే అది నిజం కాబట్టి. ఇది నేను నా గురించి మాత్రమే చెబుతున్నాను’’ అన్నారు శర్వానంద్. శ్రీ కార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. రీతూ వర్మ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజైంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో శర్వానంద్ చెప్పిన విశేషాలు... ► టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ‘ఒకే ఒక జీవితం’ అన్నప్పుడు రిస్క్, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసు కుంటారు? అనేకన్నా కూడా విమర్శకులు ఎలా స్పందిస్తారోననే భయం ఉండేది. విమర్శకులు కూడా మా సినిమాను యాక్సెప్ట్ చేసినందుకు హ్యాపీగా ఉంది. మేము ఊహించినట్లే ఈ సినిమాకు అందరూ కనెక్ట్ అవుతుండటంతో ఓ బరువు దిగిపోయిందనే ఫీలింగ్ కలిగింది. ఇక టైమ్ మిషన్‌తో నాకు అవకాశం వస్తే నా ఇంటర్ కాలేజ్ డేస్‌కి వెళతా. కాలేజ్ లైఫ్ బెస్ట్. ఎందుకంటే రేపటి గురించి ఆలోచన, నిన్నటి గురించిన బాధ అంతగా ఉండదు. హార్ట్‌బ్రేక్ అందరికీ ఉంటుంది.. నాకూ ఉంటుంది (నవ్వుతూ). ► ‘ఒకే ఒక జీవితం’లో ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్ చేశాను. ఎంత లేదనుకున్నా సబ్కాన్షియస్లోనైనా ప్రెజర్ ఉంటుంది. ఇలాంటి సినిమాలు చేయొద్దని మా డాక్టర్ సలహా ఇచ్చారు. ఈ సినిమాతో నాగార్జున, అమలగార్లతో బాగా దగ్గర కాగలిగాను. నాగార్జునగారు నన్ను మూడో కొడుకుగా భావించాననడం హ్యాపీగా ఉంది. ► శ్రీ కార్తీక్ మొదటి రోజే దాదాపు 200 షాట్స్ తీశాడు. ఏంటి ఇంత స్పీడ్‌గా తీస్తున్నాడు? అనే భయం కలిగింది. అయితే అమలగారి సీక్వెన్సెస్ స్టార్ట్ అయ్యాక ఎంత క్లారిటీగా తీస్తున్నాడో అర్థం చేసుకున్నాను. ► ఈ మధ్య పద్నాలుగు కేజీల బరువు తగ్గా. నా తర్వాతి సినిమా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఉంటుంది. ► ఇండస్ట్రీలో నాకు గైడింగ్ ఫోర్స్ లేదు. ఒక ఫ్లాప్ రాగానే కొందరు హీరోలకు పెద్ద డైరెక్టర్‌తో సినిమాలు సెట్ అవుతుంటాయి. మాకలా చేసేవారు లేరు. మమ్మల్ని మేమే కాపాడుకోవాలి. నా కెరీర్‌లోని ఒప్పులకు, తప్పులకు నేనే బాధ్యుణ్ణి. ఎందుకంటే ఇలా వెళితే బాగుంటుంది అని చెప్పేవాళ్లు లేరు. -
అవకాశం వస్తే పదేళ్ల భవిష్యత్‌లోకి వెళ్తాను
‘‘ఒకే ఒక జీవితం’ చూసి, నాగార్జునగారు ‘మా అమ్మ అన్నపూర్ణమ్మగారు గుర్తుకు వచ్చారు.. చాలా గర్వంగా ఉంది’’ అని చెప్పడం గొప్ప అనుభూతినిచ్చింది’’ అని అమల అక్కినేని అన్నారు. శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించారు. ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలైంది. ఈ చిత్రంలో హీరో శర్వానంద్ తల్లి పాత్ర చేసిన అమల మాట్లాడుతూ– ‘‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తర్వాత మలయాళంలో రెండు, హిందీలో మూడు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ చేశాను. కానీ తెలుగులో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తర్వాత నేను చేసిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఐదేళ్లుగా ‘అన్నపూర్ణ ఫిల్మ్ అండ్ మీడియా’ని నేనే చూసుకుంటున్నాను. వందల మంది విద్యార్థుల భవిష్యత్ బాధ్యత నాపై ఉండటంతో నటిగా బిజీగా ఉంటే కష్టం. అందుకే నా మనసుకు హత్తుకునే కథ, ఆ పాత్రకి నేను కరెక్ట్ అనిపిస్తే చేస్తాను. అలాంటి కథే ‘ఒకే ఒక జీవితం’. నిజాయితీతో తీసిన సినిమా ప్రేక్షకులకు ఎప్పుడూ నచ్చుతుందని ఈ మూవీ మరోసారి రుజువు చేసింది. అయితే ‘ఒకే ఒక జీవితం’ లాంటి పాత్రలు చేయడం సవాల్‌తో కూడుకున్నది. ఈ సినిమా చూసిన మా అమ్మగారు నన్ను హత్తుకుని ‘చాలా గర్వంగా ఉంది’ అనడం మర్చిపోలేను. నాగార్జునతో పాటు, మా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ చిత్రానికి డీప్‌గా కనెక్ట్ అయ్యారు. నన్ను చూడకుండా కేవలం కథ, పాత్రలతో ప్రయాణం చేశారు. నాకు గొప్ప తృప్తిని, హాయిని ఇచ్చిన సినిమా ఇది. ఈ చిత్రంలోలా టైమ్ మిషన్‌లో వెళ్లే అవకాశం వస్తే పదేళ్ల భవిష్యత్‌లోకి వెళ్తాను (నవ్వుతూ). నాగార్జునగారు, నేను ఇంట్లో ఎప్పుడూ కలిసే ఉంటాం.. మళ్లీ స్క్రీన్‌పై వద్దు (నవ్వుతూ)’’ అన్నారు. ‘బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్’కి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. మంచి వైద్యులు, మేనేజ్మెంట్, వాలంటీర్లు ఉన్నారు. నేను ఉన్నా లేకపోయినా అద్భుతమైన సేవలు అందిస్తుంది. ప్రతి శనివారం నేను కూడా స్వచ్ఛందంగా వెళ్లి పని చేస్తున్నాను. -
ఆ ఆలోచనతో ‘ఒకే ఒక జీవితం’ కథ రాసుకున్నాను: శ్రీకార్తీక్
‘‘మనం ఏదైనా పనిని నిజాయితీగా చేస్తుంటే ఈ విశ్వమే తోడై మనల్ని ముందుకు నడిపిస్తుంటుందని నా నమ్మకం. ‘ఒకే ఒక జీవితం’ సినిమా షూటింగ్ సమయంలో ఈ విషయం నాకు చాలా సందర్భాల్లో అనుభవంలోకి వచ్చింది. అలాగే అన్ని వేళలా సహనంతో ఉండాలని ఈ సినిమాతో నేర్చుకున్నాను’’ అన్నారు దర్శకుడు శ్రీ కార్తీక్. శర్వానంద్, రీతూ వర్మ జంటగా అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్ర యూనిట్ పేర్కొంది (చదవండి: ఇంతకంటే గొప్ప విజయం ఏముంటుంది) ఈ సందర్భంగా ఈ చిత్రదర్శకుడు శ్రీకార్తీక్ మాట్లాడుతూ – ‘‘నటుడిగా ట్రై చేసి, అవకాశాలు రాకపోవడంతో ఆ ఫ్రస్ట్రేషన్లో నేనే రాయాలి, నేనే తీయాలనుకుని కొన్ని షార్ట్ ఫిల్మ్స్, యాడ్ ఫల్మ్స్ చేశాను. నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు మా అమ్మగారు అపస్మారక స్థితిలో ఉన్నారు. నేను ఫిల్మ్‌మేకర్‌ను అవుతానని కూడా ఆమెకు తెలియదు. ఈ విషయంలో నాకు పశ్చాత్తాపం ఉండేది. దాంతో కాలాన్ని వెనక్కి తీసుకుని వెళ్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో ‘ఒకే ఒక జీవితం’ కథ రాసుకున్నాను. ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని టైమ్ మిషన్ బ్యాక్‌డ్రాప్ పెట్టాను. ఈ సినిమాకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. శర్వానంద్ లాంటి హీరో ఇలాంటి సినిమాను యాక్సెప్ట్ చేయడమే పెద్ద సక్సెస్. కథ విన్న వెంటనే అమలగారు ఒప్పుకున్నారు. ఇక అల్లు అర్జున్ గారి కోసం నా దగ్గర ఓ రియల్ ఫ్యాంటసీ కథ ఉంది’’ అన్నారు. -
ఇంతకంటే గొప్ప విజయం ఏముంటుంది
‘‘థియేటర్స్‌లో ‘ఒకే ఒక జీవితం’ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఇంతకంటే గొప్ప విజయం ఏముంటుంది. ఈ సినిమా ఇంకెంత విజయం సాధిస్తుంది, ఎంత కలెక్ట్ చేస్తుంది? అనే అంశాలను అటుంచితే థియేటర్స్‌లో ప్రేక్షకుల చప్పట్లను వినాలనిపించింది. ప్రేక్షకులు నేను కోరుకున్న ప్రేమను ఇచ్చారు’’ అన్నారు శర్వానంద్. శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతూ శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’). రీతూ వర్మ హీరోయిన్గా కీలక పాత్రల్లో అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి నటించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజైంది. ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో శర్వానంద్ మాట్లాడుతూ – ‘‘గొప్ప కథ రాసి, విజయానికి కారణమైన దర్శకుడు శ్రీ కార్తీక్‌కు ధన్యవాదాలు. థియేటర్స్ స్క్రీన్‌పై అమలగారు కనిపించినప్పుడు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అమలగారు ఇంకా మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను. ఎస్ఆర్ ప్రభుగారు అభిరుచిగల నిర్మాత. మౌత్ టాక్‌తో ప్రేక్షకులు మా సినిమాను ముందుకు తీసుకుని వెళ్లాలని కోరుతున్నాను’’ అన్నారు. ‘‘యువత ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కొని విజయం సాధించేందుకు మార్గం చూపే చిత్రం ఇది. ఈ సినిమాకు అందరూ కనెక్ట్ అవుతారు. శర్వానంద్ పరిపూర్ణ నటుడు’’ అన్నారు అమల. ‘‘శర్వానంద్–అమలగార్లు స్క్రీన్‌పై తల్లీకొడుకు లుగా ప్రేక్షకుల మనసును హత్తుకున్నారు. ఈ సినిమా అందరికీ ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడాన్ని గొప్ప విజయంగా భావిస్తున్నా’’ అన్నారు శ్రీ కార్తీక్. ‘‘ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు ఎస్ఆర్ ప్రభు. నటుడు ‘వెన్నెల’ కిశోర్, ఈ చిత్రం కెమెరామేన్ సుజిత్ పాల్గొన్నారు. -
‘ఒకే ఒక జీవితం’ మూవీ రివ్యూ
టైటిల్: ఒకే ఒక జీవితం నటీనటులు: శర్వానంద్, రీతూవర్మ, అమల అక్కినేని, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు నిర్మాతలు : ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు డైలాగ్స్: తరుణ్ భాస్కర్ సంగీతం : జేక్స్ బిజోయ్ సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్ విడుదల తేది: సెప్టెంబర్ 9, 2022 కథేంటంటే.. ఆది(శర్వానంద్), శ్రీను(వెన్నెల కిశోర్), చైతూ(ప్రియదర్శి) ముగ్గురు స్నేహితులు. ఈ ముగ్గురికి ఒక్కో సమస్య ఉంటుంది. ఆది మంచి గిటారిస్ట్ కానీ స్టేజ్‌పై పాడాలంటే భయం. ప్రియురాలు వైష్ణవి(రీతూ వర్మ) ఎంత ఎంకరేజ్ చేసినా.. ఆది సక్సెస్ కాలేకపోతాడు. కళ్ల ముందు అమ్మ (అమల) ఉంటే బాగుండేది అనుకుంటారు. ఇరవేళ్ల క్రితం(మార్చి 28,1998) రోడ్డు ప్రమాదంలో తల్లి చనిపోతుంది. అప్పటి నుంచి ఆదికి స్టేజ్ ఫిగర్ ఇంకా ఎక్కువతుంది. ఇక శ్రీను చిన్నప్పుడు సరిగ్గా చదువుకోలేక హౌస్ బ్రోకర్‌గా మారుతాడు. ఇంగ్లీష్ అస్సలు రాదు. చిన్నప్పుడు మంచిగా చదువుకొని ఉంటే బాగుండేది కదా అని బాధ పడుతుంటాడు. ఇక మూడో వ్యక్తి చైతూకి పెళ్లి సమస్య. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలకుంటాడు. కానీ ఏ అమ్మాయి నచ్చదు. చిన్నప్పుడు తనను ఇష్టపడిన సీతను ఎందుకు ప్రేమించలేదని ప్రతి క్షణం బాధపడుతుంటాడు. ఇలా బాధపడుతున్న ఈ ముగ్గురు స్నేహితుల జీవితంలోకి సైంటిస్ట్ రంగీ కుట్టా పాల్ అలియాస్ పాల్ (నాజర్) ప్రవేశిస్తాడు. అతను టైమ్ మిషన్ కనిపెట్టడానికి 20 ఏళ్లుగా ట్రై చేస్తూనే ఉంటాడు. చివరకు తను టైమ్ మిషన్‌ని కనిపెడతాడు. ఆ మిషన్‌తో ఆది,శ్రీను, చైతూలను భూత కాలంలోకి పంపుతానని చెబుతాడు. వారు కూడా తాము చేసిన తప్పులను సవరించుకోవాలని భావించి గత కాలంలోకి వెళ్లేందుకు రెడీ అవుతారు. మరి ఆది వెనక్కి వెళ్లి రోడ్డు ప్రమాదం బారిన పడకుండా తన తల్లిని కాపాడుకున్నాడా? శ్రీను, చైతూలు పాత తప్పుల్ని సరిదిద్దుకున్నారా? లేదా? భూతకాలంలో ఈ ముగ్గురికి ఎదురైన వింత సమస్యలు ఏంటి? అనేదే మిగతా కథ ఎవరెలా చేశారంటే.. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అనగానే మనకు గుర్తుకొచ్చే సినిమా ఆదిత్య 369. ఆ మధ్య వచ్చిన ‘24’తో పాటు రీసెంట్గా విడుదలైన ‘బింబిసార’కూడా టైమ్ ట్రావెల్ నేపథ్యంతో తెరకెక్కిన చిత్రాలే. అలాంటి కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమే ‘ఒకే ఒక జీవితం’. అయితే ఆ సినిమాలతో దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. ఇది టైమ్ ట్రావెల్ చిత్రమే అయినప్పటికీ..ఇందులో ‘అమ్మ’ కథ దాగి ఉంది. 20 ఏళ్ల క్రితం తల్లిని కోల్పోయిన ఓ బిడ్డకి.. తిరిగి అమ్మను చూసే అవకాశం వస్తే..? గతంలో చేసిన తప్పుల్ని సవరించుకునే చాన్స్ లభిస్తే..? ఇది వినడానికే ఆశ్చర్యంగా, ఆసక్తికరంగా ఉంది. అంతే ఆసక్తికరంగా తెరపై చూపించాడు దర్శకుడు శ్రీకార్తీక్. టైమ్ మిషన్ కథని అమ్మ ఎమోషన్ తో ముడి పెట్టి ‘ఒకే ఒక జీవితం’చిత్రాన్ని తెరకెక్కించాడు. జీవితం ఎవరికీ రెండో అవకాశం ఇవ్వదు. ఒకవేళ ఇస్తే... విధి రాతని మార్చగలమా? అనే పాయింట్‌ని ఆసక్తికరంగా చూపించాడు. టైమ్ మిషన్‌లోకి వెళ్లేంత వరకు కథ నెమ్మదిగా సాగుతుంది..కానీ ఒక్కసారి భవిష్యత్తులోకి వెళ్లాక వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముగ్గురు యువకులు.. చిన్నప్పుడు తామెలా ఉన్నామో చూసుకునేందుకు వెళ్లడం..తాము చేసిన తప్పిదాలను సరిదిద్దుకునేందుకు ప్రయత్నించడం..ఇలా ప్రతి సీన్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా శర్వానంద్, అమల మధ్య వచ్చే ప్రతి సన్నివేశం ఎమోషనల్‌గా ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సెకండాఫ్‌పై క్యూరియాసిటీని పెంచుతుంది. వెన్నెల కిశోర్ పాత్ర సినిమాకు మరో ప్రధాన బలం. ఆ పాత్ర పండించిన కామెడీ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుంది. ప్రియదర్శి పాత్రను ఇంకాస్త బలంగా తీర్చి దిద్దితే బాగుండేది. భూతకాలంలోకి వెళ్లిన శ్రీను, చైతూలను కూడా తమ ఫ్యామిలీలతో కలిసేలా చూపిస్తే.. కథ ఇంకాస్త ఎమోషనల్‌గా సాగేదేమో. క్లైమాక్స్ కూడా ఊహకి అందేలా ఉంటుంది. టైమ్ ట్రావెల్ సీన్స్ ఇంకాస్త ఆసక్తికరంగా రాసుకోవాల్సింది. స్లో నెరేషన్ కూడా సినిమాకు కాస్త మైనస్. సైన్స్ గొప్పదని చెప్తూనే.. విధిని ఎవరు మార్చలేరనే విషయాన్ని బలంగా చూపించిన దర్శకుడి ప్రయత్నాన్ని మాత్రం అభినందించాల్సిందే. ఎవరెలా చేశారంటే.. శర్వానంద్‌ని నటుడిగా ఇంకో మెట్టు ఎక్కించిన సినిమా ఇది. ఆది పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా చక్కగా నటించాడు. రొటీన్ కమర్షియల్ హీరో పాత్రలకు భిన్నమైన పాత్ర తనది. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం వెన్నెల కిశోర్ పాత్ర. బ్రోకర్ శ్రీనుగా వెన్నెల కిశోర్ తనదైన కామెడీతో నవ్వించాడు. అదే సమయంలో కొన్ని చోట్ల అతను చెప్పే డైలాగ్స్ ఎమోషనల్‌కు గురిచేస్తాయి. చైతూ పాత్రకి ప్రియదర్శి న్యాయం చేశాడు. తన పాత్రని ఇంకాస్త బలంగా డిజైన్ చేస్తే బాగుండేది. ఇక ఈ సినిమాకు అమల పాత్ర మరో ప్లస్ పాయింట్. అమ్మ పాత్రకు చాలా బాగా సూట్ అయ్యారు. శర్వానంద్, అమల మధ్య వచ్చే సన్నివేశాలు హృదయాలను హత్తుకుంటాయి. ఇక ఆది లవర్ వైష్ణవిగా రీతూ వర్మ మెప్పించింది. అయితే సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. ఉన్నంతలో తన పాత్రకు న్యాయం చేసింది. సైంటిస్ట్ పాల్గా నాజర్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. ఇలాంటి సీరియస్ పాత్రలు చేయడం నాజర్‌కి కొత్తేమి కాదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం బాగుంది. ఈ చిత్రంలో హీరో గిటారిస్ట్. కాబట్టి సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కానీ అందుకు తగ్గట్టుగా గుర్తిండిపోయే పాటలు లేకపోవడం మైనస్. ‘అమ్మ’పాట మాత్రం హృదయాలను హత్తుకుంటుంది. కానీ థియేటర్ నుంచి బయటకు రాగానే ఆ పాటని మర్చిపోతాం. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'ఒకే ఒక జీవితం' చూసి ఎమోషనల్ అయిన నాగార్జున, అఖిల్!
శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతూ, శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’). అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో సెలబ్రిటీ ప్రీమియర్ షో వేసింది చిత్రబృందం. ఈ షోకి అక్కినేని నాగార్జున, అఖిల్, దర్శకులు దేవ కట్టా, హను రాఘవపూడి, చందూ మొండేటి, మేర్లపాక గాంధీ, వశిష్ఠ్, వెంకీ కుడుముల, వెంకీ అట్లూరి తదితరులు హాజరయ్యారు. సినిమా చూసి నాగార్జున, అఖిల్ ఎమోషనల్‌కు గురయ్యారు. ముఖ్యంగా తల్లికొడుకుల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ నాగ్ని కంటతడి పెట్టించాయట. ఇంత గొప్ప కథను తెరకెక్కించిన దర్శకుడి కార్తీక్‌ని, అద్భుతంగా నటించిన శర్వానంద్‌ని అక్కినేని హీరోలు అభినందించారు. ఓకే ఒక జీవితం అద్భుతమైన సినిమా అని, ఇప్పటి వరకు వచ్చిన టైమ్ ట్రావెల్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉందని దర్శకులు హనురాఘవ పూడి, చందూ మొండేటి అన్నారు. గతంలోకి వెళ్లి మనల్ని మనం సరిచేసుకునే అవకాశం వస్తే ఎలా ఉంటుందన్న పాయింట్‌ని కార్తీక్ తెరపై చక్కగా చూపించారని ప్రశంసించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ సంగీతం అందించగా... సిరివెన్నెల సీతారామశాస్త్రి, కృష్ణకాంత్, కృష్ణచైతన్య సాహిత్యం అందించారు. తెలుగులో తరుణ్ భాస్కర్ డైలాగులు రాశారు. (చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే) -
ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే
టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న సినిమాల హవా నడుస్తోంది. గతవారం కోబ్రా మినహా అన్ని చిన్న చిత్రాలే విడుదలయ్యాయి. వాటిలో ఒకటి రెండు చిత్రాలు మంచి టాక్ని సంపాదించుకోగా..మరికొన్ని బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడ్డాయి. ఇక ఈ వారం కూడా పలు చిన్న చిత్రాలు అటు థియేటర్స్‌లో ఇటు ఓటీటీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. కెప్టెన్ తమిళ హీరో ఆర్య హీరోగా తాజాగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కెప్టెన్. శక్తి సౌందన్ రాజన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 8న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. తెలుగులో శ్రేష్ట్ మూవీస్ సమర్ఫిస్తున్న ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ఆర్యకు జోడిగా ఐశ్వర్య లక్ష్మి నటించింది. బ్రహ్మాస్త్రం రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలవుతోంది. దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దక్షిణాదిలో ఈసినిమాని సమర్పిస్తున్నారు. తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో విడుదలవుతోంది. ఒకే ఒక జీవితం శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతూ, శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’). అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. శ్రీరంగాపురం వినాయక్ దేశాయ్, పాయల్ ముఖర్జీ, వైష్ణవీ సింగ్, చిందనూరు నాగరాజు, సత్యప్రకాశ్ ముఖ్య తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘శ్రీరంగాపురం’.ఎమ్ఎస్. వాసు దర్శకత్వంలో చిందనూరు నాగరాజు నిర్మించిన ఈ సినిమా సెస్టెంబర్ 9న విడుదల కానుంది. కొత్తకొత్తగా అజయ్, వీర్తి వఘాని హీరో హీరోయిన్లుగా హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కొత్త కొత్తగా’. బిజి గోవిందరాజు సమర్పణలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం(సెప్టెంబర్9) విడుదల కానుంది. ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు డిస్నీ+హాట్‌స్టార్ థోర్ లవ్ అండ్ థండ్(తెలుగు), సెప్టెంబర్ 8 గ్రోయింగ్ అప్(వెబ్ సిరీస్) సెప్టెంబర్ 8 హైడోస్.. సెప్టెంబర్ 8 పినాచో.. సెప్టెంబర్ 8 కార్స్ ఆన్ ది రోడ్(హాలీవుడ్).. సెప్టెబర్ 8 వెడ్డింగ్ సీజన్(హాలీవుడ్) సెప్టెంబర్ 8 నెట్‌ఫ్లిక్స్ వన్స్ అపాన్ ఏ స్మాల్ టౌన్(సిరీస్), సెప్టెంబర్ 5 రిక్ అండ్ మార్టీ:సీజన్-6: ఎపిసోడ్-1(వెబ్ సిరీస్).. సెప్టెంబర్ 5 అన్‌టోల్డ్: ది రేస్ ఆఫ్ సెంచరీ(హాలీవుడ్) సెప్టెంబర్6 ఇండియన్ ప్రేడేటర్: ది డైరీ ఆఫ్ ఏ సీరియల్ కిల్లర్(డాక్యమెంటరీ) సెప్టెంబర్ 7 చెప్స్ టేబుల్: పిజ్జా ఏ క్వైట్ ప్లేస్(డాక్యుమెంటరీ) సెప్టెంబర్ 7 ది అంత్రాక్స్ అటాక్స్(హాలీవుడ్) సెప్టెంబర్ 8 ఏక్ విలన్ రిటర్న్స్ (బాలీవుడ్) సెప్టెంబర్ 9 కోబ్రా కాయ్: సీజన్-5(వెబ్ సిరీస్) సెప్టెంబర్ 9 మోర్టల్ కాంబ్యాట్(హాలీవుడ్) సెప్టెంబర్ 11 అమెజాన్ ప్రైమ్ స్టూడియో 666.. సెప్టెంబర్ 5 హీ ఈజ్ సైకోమెట్రిక్- సెప్టెంబర్ 7 రిప్లై 1994- సెప్టెంబర్ 7 ప్రిజన్ ప్లే బుక్- సెప్టెంబర్ 7 ఎలీన్(Aline)-సెప్టెంబర్ 9 (వీటితో పాటు మరికొన్ని వెబ్ సిరీస్, టాక్ షోలు ఈ వారంలో స్ట్రీమింగ్ కానున్నాయి) ఆహా డ్యాన్స్ ఐకాన్(రియాల్టీ షో) సెప్టెంబర్ 11 జీ5 పాపన్(మూవీ) సెప్టెంబర్ 7 ఎంఎక్స్ ప్లేయర్ యునికి యారీ(బాలీవుడ్), సెప్టెంబర్ 9