శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తీక్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 16న తెలుగు, తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అక్కినేని అమల శర్వానంద్ తల్లిగా కీలక పాత్రలో నటించారు. మదర్‌సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళనంలో విశేష ప్రేక్షకులను ఆదరణ అందుకుంది. థియేటర్లో మంచి విజయం సాధించిన ఒకే ఒక జీవితం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసంది.
చదవండి: ‘గాడ్‌ఫాదర్’పై సూపర్ స్టార్ రజనీ రివ్యూ.. ఏమన్నారంటే
అక్టోబరు 20 నుంచి ఈ సినిమాను ఓటీటీలో అందుబాటులోకి తెస్తున్నట్లు సోనీ లీవ్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ‘జీవితం రెండో అవకాశం ఇస్తే విధిరాతను మార్చుకోగలమా? శర్వానంద్, రీతూవర్మ, అమల కలయికలో వచ్చిన ఒకేఒక జీవితం మూవీ ఈ నెల 20 నుంచి మీ సోనీలివ్ ఇంటర్నేషనల్‌లో రానుంది’ అంటూ అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. ముగ్గురు యువకుల జీవితాలను ఎమోషన్స్, కామెడీ మిక్స్ చేసి తీశారు. సైన్స్ గొప్పదే కానీ గతాన్ని మర్చగలిగే శక్తి దానికి లేదనే సందేశాన్ని ఈ సినిమాతో ఇచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలో కణం పేరుతో విడుదలైంది.ఈ సినిమాలో వెన్నెల కిశోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
చదవండి: తల్లిదండ్రులైన మరుసటి రోజే నయన్ దంపతులకు షాక్!
జీవితం రెండో అవకాశం ఇస్తే విధి రాతను మార్చుకోగలమా?
— SonyLIV International (@SonyLIVIntl) October 10, 2022
శర్వానంద్, రీతు వర్మ, అమల కలయికలో వచ్చిన “ఒకే ఒక జీవితం” ఈ నెల 20 నుండి మీ సోనీ LIV International లో#OkeOkaJeevithamOnSonyLIV #SonyLIVInternational #OkeOkaJeevitham pic.twitter.com/QMQPpxiCJq
Comments
Please login to add a commentAdd a comment