Sarwanand
-
‘ఓకే ఒక జీవితం’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్
శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తీక్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 16న తెలుగు, తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అక్కినేని అమల శర్వానంద్ తల్లిగా కీలక పాత్రలో నటించారు. మదర్సెంటిమెంట్తో వచ్చిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళనంలో విశేష ప్రేక్షకులను ఆదరణ అందుకుంది. థియేటర్లో మంచి విజయం సాధించిన ఒకే ఒక జీవితం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసంది. చదవండి: ‘గాడ్‌ఫాదర్’పై సూపర్ స్టార్ రజనీ రివ్యూ.. ఏమన్నారంటే అక్టోబరు 20 నుంచి ఈ సినిమాను ఓటీటీలో అందుబాటులోకి తెస్తున్నట్లు సోనీ లీవ్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ‘జీవితం రెండో అవకాశం ఇస్తే విధిరాతను మార్చుకోగలమా? శర్వానంద్, రీతూవర్మ, అమల కలయికలో వచ్చిన ఒకేఒక జీవితం మూవీ ఈ నెల 20 నుంచి మీ సోనీలివ్ ఇంటర్నేషనల్‌లో రానుంది’ అంటూ అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. ముగ్గురు యువకుల జీవితాలను ఎమోషన్స్, కామెడీ మిక్స్ చేసి తీశారు. సైన్స్ గొప్పదే కానీ గతాన్ని మర్చగలిగే శక్తి దానికి లేదనే సందేశాన్ని ఈ సినిమాతో ఇచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలో కణం పేరుతో విడుదలైంది.ఈ సినిమాలో వెన్నెల కిశోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చదవండి: తల్లిదండ్రులైన మరుసటి రోజే నయన్ దంపతులకు షాక్! జీవితం రెండో అవకాశం ఇస్తే విధి రాతను మార్చుకోగలమా? శర్వానంద్, రీతు వర్మ, అమల కలయికలో వచ్చిన “ఒకే ఒక జీవితం” ఈ నెల 20 నుండి మీ సోనీ LIV International లో#OkeOkaJeevithamOnSonyLIV #SonyLIVInternational #OkeOkaJeevitham pic.twitter.com/QMQPpxiCJq — SonyLIV International (@SonyLIVIntl) October 10, 2022 -
క్రేజీ డైరెక్టర్‌తో శర్వానంద్ మహా సముద్రం!
ఆర్ ఎక్స్ 100 సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్ఎక్స్ 100 సినిమా తన మొదటి సినిమా అయినప్పటికీ డైరెక్టర్ అజయ్ భూపతి మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. అందరినీ ఆకట్టుకునేలా మంచి కాన్సెప్ట్‌తో వచ్చి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఇప్పుడు ఈ డైరెక్టర్ హీరో శర్వానంద్‌తో సినిమా చేయడానికి స్టోరీ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. రణరంగం, జాను సినిమాలు ప్లాప్ కావడంతో శర్వానంద్ కొద్దిగా వెనుకబడ్డారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది. ఈ సినిమాకు మహా సముద్రం అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ క్రేజీ డైరెక్టర్ శర్వానంద్ కోసం ఎలాంటి కథను తయారు చేశాడో తెలియాల్సివుంది. చదవండి: కన్నుమూసిన ‘లవకుశ’ నాగరాజు -
కోలీవుడ్‌కి మరోసారి శర్వానంద్!
ప్రముఖ నృత్యదర్శకుడు రాజుసుందరం మరోసారి మెగాఫోన్ పట్టాడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. పలు భాషా చిత్రాలకు నృత్యదర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్న రాజుసుందరం కొన్ని చిత్రాల్లోనూ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అంతే కాదు ఈయన దర్శకుడిగా అవతారమెత్తి అజిత్ హీరోగా ఏగన్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. నయనతార హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో రాజు సుందరం ఆ తరువాత దర్శకత్వం జోలికి పోలేదు. అలాంటిది మరోసారి మెగాఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. కాగా ఇందులో నటుడు శర్వానంద్ హీరోగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగులో మంచి పేరున్న నటుడు ఈయన, కాగా కోలీవుడ్‌లోనూ మూడు నాలుగు చిత్రాల్లో నటించారు. అందులో జయ్‌తో కలిసి నటించిన ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. కాగా చేరన్ దర్శకత్వంలో నటించిన జేకే ఎనుమ్ నన్భనిన్ వాళ్ ల్కై చిత్రం నిర్మాణం పూర్తి చేసుకున్నా తెరపైకి రాలేదు. ఆ చిత్రాన్ని ఆన్లైన్లో విడుదల చేయాల్సి వచ్చింది. కాగా చాలా గ్యాప్ తరువాత కోలీవుడ్‌లో మరోసారి తన అదృష్టాన్ని శర్వానంద్ పరిక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నారు. అదేవిధంగా నృత్యదర్శకుడు రాజుసుందరానికి దర్శకుడిగా ఈ చిత్రం కీలకం అవుతుంది. కాగా ఈ చిత్రం మేలో సెట్ పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన అధికార ప్రకటన వెలువడలేదదన్నది గమనార్హం. పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
సాయి పల్లవితో ఫెస్టివల్ స్టార్..
టాలీవుడ్లో మరో క్రేజీ ప్రాజెక్టు త్వరలో పట్టాలెక్కనుంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న యువ నటీనటులు ఇందుకోసం సన్నద్ధం అవుతున్నారు. ఫిదా బ్లాక్ బస్టర్‌తో టాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకున్న బ్యూటీ సాయి పల్లవి. తాజాగా నేచురల్ స్టార్ నాని సరసన నటించిన ఎంసీఏతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈఏడాది శతమానం భవతి సినిమాతో మెదలు పెట్టి మహానుభావుడు వంటి హిట్లతో 2017ను యువ హీరో శర్వానంద్ విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. రెండు సినిమాలు పండుగ సీజన్లో పెద్ద సినిమాలకు పోటీగా వచ్చి మంచి వసూల్లనే సాధించాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న శర్వానంద్, సాయి పల్లవిలు క్రేజీ కాంబినేషన్లో కలిసి నటించనున్నారని సమాచారం. ప్రేమకధా చిత్రాలు తీయడంలో పేరుపొందిన హను రాగపూడి కొత్త చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ‘మహానుభావుడు’ సినిమా తరువాత శర్వానంద్ నటించబోతున్న సినిమాపై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది. అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమగాధ వంటి ప్రేమకథా చిత్రాలతో అలరించిన రాగపూడి ఈ జోడితో రొమాంటిక్ సీన్స్ ని డైరెక్టర్ ఏ విధంగా చిత్రీకరిస్తాడో చూడాలి.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొత్త సంవత్సరంలో మొదలుకానుంది. -
సూపర్ హిట్ తీస్తా – హను రాఘవపూడి
శర్వానంద్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ సినిమాస్ పతాకంపై ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న చిత్రం ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. హీరో శర్వానంద్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. కొరియోగ్రాఫర్ రాజు సుందరం కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు సుకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. హను రాఘవపూడి మాట్లాడుతూ– ‘‘ప్రేమకథా చిత్రమిది. శర్వానంద్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. నా మిత్రులు ప్రసాద్, సుధాకర్ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. సూపర్‌హిట్ చిత్రాన్ని అందిస్తా’’ అన్నారు. ‘‘శర్వానంద్‌తో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెష్ సబ్జెక్ట్‌తో చాలా కొత్తగా హను రూపొందించనున్నారు. మా బ్యానర్లో నిర్మిస్తోన్న ఈ తొలి చిత్రం హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. త్వరలోనే రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేయనున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ వేడుకలో నిర్మాతలు వై. రవిశంకర్, ఎస్. రా«ధాకృష్ణ, అనీల్ సుంకర, రామ్ ఆచంట, గోపీ ఆచంట, బాపినీడు, నాగవంశీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ స్వరకర్త. -
మేకింగ్ ఆఫ్ మూవీ - శతమానం భవతి
-
క్షణికావేశంలో హత్యలు చేశా : శర్వానంద్
హైదరాబాద్: తన భార్య పద్మప్రియ, ఆమె తల్లి పరమేశ్వరిని క్షణికావేశంలో హత్య చేసినట్లు సాప్ట్వేర్ ఇంజనీర్ శర్వానంద్ చెప్పారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిదిలో తరచూ వేధిస్తున్న భార్యను, అత్తను శర్వానంద్ హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ జంట హత్యలను తాను పథకం ప్రకారం చేయలేదని శర్వానంద్ చెప్పాడు. పోలీసులు నిందితుడు శర్వానంద్ చెప్పిన ప్రకారం బెంగళూరుకు చెందిన పద్మప్రియకు, శర్వానంద్‌కు 2011లో వివాహం జరిగింది. ఇద్దరూ సాఫ్టవేర్ ఇంజనీర్లైన వారు బెంగళూరులోనే ఉండేవారు. అయితే పద్మప్రియకు ఇంతకు ముందే వివాహం అయింది. ఆ విషయం శర్వానంద్‌కు చెప్పకుండా మోసం చేసి పెళ్లి చేశారు. ఆ విషయం శర్వానంద్‌కు తెలిసిన తరువాత భార్యా- భర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. ఆ తరువాత అతను వేరుగా ఉంటున్నాడు. అయినా పద్మప్రియ, ఆమె తల్లి పరమేశ్వరి శర్వానంద్‌తో తరచూ గొడవపడుతుండేవారు. అంతే కాకుండా వారు శర్వానంద్ సోదరి, బావ, అతని బంధువులతో కూడా గొడవపడేవారు. శర్వానంద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫలితంలేదు. వారి గొడవ కోర్టు వరకు వెళ్లింది. దాంతో విసిగిపోయిన శర్వానంద్ కొద్ది కాలం క్రితం సికింద్రాబాద్ వచ్చి తన మేనమామ ముత్తు ఇంట్లో ఉంటున్నాడు. పద్మప్రియ, పరమేశ్వరిలు కూడా సికింద్రాబాద్ వచ్చి ఉంటున్నారు. రాత్రి పొద్దుపోయిన తరువాత వారు శర్వానంద్ వద్దకు వచ్చి గొడవపడుతుండేవారు. నిన్న రాత్రి 11.30 గంటల సమయంలో కూడా వారు ముత్తు ఇంటికి వచ్చి శర్వానంద్‌తో వాదనకు దిగారు. ఈ సందర్భంగా వారి మధ్య మాటామాటా పెరిగింది. ఆ తరువాత శర్వానంద్ క్షణికావేశంలో అత్త పరమేశ్వరిని గోడకు మోది హత్య చేశాడు. ఆ తరువాత భార్యకు ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. ఆ తరువాత శర్వానంద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. లొంగిపోయిన తరువాత శర్వానంద్ మాట్లాడుతూ అటువంటి ఆడవారు ఆడజాతికే మచ్చ అన్నారు. వారిని హత్య చేయడం వల్ల పది పదిహేను కుటుంబాలు ప్రశాంతంగా ఉంటాయని చెప్పాడు. పద్మప్రియకు బెంళగూరులో 19 ఎఫైర్లు వరకు ఉన్నాయని తెలిపాడు. తమ వివాహమే చెల్లదని చెప్పాడు. తన చెల్లెలిని, బావని, ఇతర బంధువులను వారు ఇద్దరూ కలిసి వేధించేవారని చెప్పాడు. ఎప్పటిలాగే రాత్రి కూడా తన మీద దాడి చేయడానికి వచ్చారని, రచ్చ చేశారని చెప్పాడు. ఈ హత్యలకు సంబంధించి శర్వానంద్ మేనమామ ముత్తు, మరో అయ్యప్పన్ అనే మరో వ్వక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేనమామ ముత్తు శర్వానంద్‌కు సహకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే అయ్యప్పన్కు ఈ హత్యలతో సంబంధం ఉన్నదీ లేనిదీ తెలియడంలేదు. ఈ విషయమై పోలీసులు విచారిస్తున్నారు.