Oke Oka Jeevitham Movie OTT Release Date And Streaming Partner Details - Sakshi
Sakshi News home page

Oke Oka Jeevitham OTT : ఓటీటీలోకి 'ఒకే ఒక జీవితం'మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడో తెలుసా?

Published Sun, Sep 25 2022 11:14 AM | Last Updated on Sun, Sep 25 2022 2:50 PM

Oke Oka Jeevitham Movie OTT Release Date And Streaming Partner Details - Sakshi

శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తీక్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా  సెప్టెంబర్‌ 16న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అక్కినేని అమల శర్వానంద్‌ తల్లి పాత్రలో కీలక పాత్రలో నటించారు. మదర్‌సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లీవ్‌ సుమారు 15 కోట్లకు సొంతం చేసుకుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అక్టోబర్‌ రెండో వారంలో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్ పిక్చర్స్ తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలో కణం పేరుతో విడుదలైంది.ఈ సినిమాలో వెన్నెల కిశోర్‌, ప్రియదర్శి, నాజర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement