
సముద్రఖని
నటుడిగా, డైరెక్టర్‌గా సముద్రఖని గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘కాలా’ చిత్రంలో రజనీకాంత్ ఫ్రెండ్‌గా, ‘రఘవరన్ బీటెక్’ చిత్రంలో ధనుశ్ తండ్రిగా సముద్రఖనిని చూసే ఉంటారు. తెలుగులో వచ్చిన రవితేజ ‘శంభో శివ శంభో’, నాని ‘జెండాపై కపిరాజు’ సినిమాలకు ఆయనే దర్శకుడు. ఇప్పుడు ఓ కీలక పాత్రతో ఆయన తెలుగు తెరపై మరోసారి కనిపించబోతున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సముద్రఖని ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారన్నది తాజా ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాలో ఆయన రామ్‌చరణ్ పాత్రకు బాబాయ్‌గా కనిపిస్తారట. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ జనవరిలో స్టార్ట్ కానుంది. ఇందులో హీరోయిన్లుగా కీర్తీ సురేశ్, కియారా అద్వానీ పేర్లు వినిపిస్తున్నాయి.