
శివప్రసాద్, ప్రసాద్, రాఘవేంద్రరావు
‘విమానం’ ట్రైలర్ చూస్తుంటే మంచి భావోద్వేగాలతో సినిమా ఉంటుందని తెలుస్తోంది. తండ్రీ కొడుకుల మధ్య ఉండే ఎమోషన్‌ని దర్శకుడు శివ ప్రసాద్ ట్రైలర్‌లో అద్భుతంగా చూపించాడు. ట్రైలర్ నా మనసును కదిలించింది.. నాకు కన్నీళ్లొచ్చాయి’’ అని డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు అన్నారు. సముద్ర ఖని, అనసూయ భరద్వాజ్, మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ, మాస్టర్ ధ్రువన్ కీలక పాత్రల్లో శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహించిన చిత్రం ‘విమానం’.
జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసిన కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ–‘‘తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ‘విమానం’ సినిమా చూడాలి.. అప్పుడే పిల్లల కోసం తల్లిదండ్రులు పడే తపన ఎలా ఉంటుందో తెలుస్తుంది’’ అన్నారు. జీ స్టూడియో సౌత్ వైస్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ప్రసాద్, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వివేక్ కాలేపు.
Comments
Please login to add a commentAdd a comment