భార్య కోసం షూటింగులన్నీ రద్దు | Anupam Kher cancels shootings for wife campaign | Sakshi
Sakshi News home page

భార్య కోసం షూటింగులన్నీ రద్దు

Published Mon, Mar 31 2014 2:12 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

భార్య కోసం షూటింగులన్నీ రద్దు - Sakshi

భార్య కోసం షూటింగులన్నీ రద్దు

లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న తన భార్య కిరణ్ ఖేర్ తరఫున ప్రచారం చేయడానికి ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ మొత్తం షూటింగులన్నింటికీ తాత్కాలికంగా విరామం పలికారు. చండీగఢ్ నుంచి కిరణ్ పోటీచేస్తున్నారు. ఆమెకోసం ఏప్రిల్ నెలలో తనకున్న షూటింగులన్నింటినీ అనుపమ్ ఖేర్ రద్దుచేసుకున్నారు. ఈనెల ఆరంభంలో కిరణ్ తన నామినేషన్ పత్రాలు దాఖలు చేసినప్పుడు ఆమె వెంట అనుపమ్ ఖేర్ కూడా ఉన్నారు. కిరణ్ ఖేర్కు చండీగఢ్లో పరిస్థితి చాలా బాగుందని, ఆమెకు సాయం చేయడానికి అద్భుతమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని అనుపమ్ చెప్పారు.

ఆమెకు కొంతకాలం పాటు సాయం ఉంటానని, ఇదంతా తన సంతృప్తి కోసమే తప్ప ఆమెకు నిజానికి తన అవసరం ప్రస్తుతానికి లేదని తెలిపారు. కిరణ్ వయస్సు గురించి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిని గుల్ పనగ్ చేసిన వ్యాఖ్యలపై అనుపమ్ మండిపడ్డారు. రాజకీయాల్లో ఒత్తిడి తట్టుకోడానికి కిరణ్ వయసు సహకరించదని చెప్పేవాళ్లు ఆమె ప్రచార ఉధృతిని చూడాలని అన్నారు. ''మా తాతగారు ఒకటే చెప్పేవారు. అప్పటికే తడిసి ఉన్నప్పుడు మళ్లీ వర్షం గురించి భయపడటం అనవసరమన్నారు. కిరణ్, నేను ఇద్దరమూ యోధులమే. దేనికీ భయపడేది లేదు" అని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement