కరోనా వైరస్ నియంత్రణకు 21రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో సామాన్య జనం నుంచి ప్రముఖులు వరకూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో హాస్యనటుడు అలీ... ఇంటి పనులతో బిజీ బిజీగా ఉన్నారు. షూటింగ్‌లతో ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఖాళీ దొరకని ఆయన ఇప్పుడు ఇంట్లో వాళ్లు చెప్పిన పనులు చేస్తున్నారు. ’రోజూ కార్లు కడుగుతున్నా.. ఇంట్లో పని చేస్తున్నా. కాయగూరలు కట్ చేస్తున్నా. ఇల్లంతా శుభ్రపరుస్తున్నా. (కిచెన్ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్)
అప్పుడప్పుడు ఓ గంటో, గంటన్నరో టీవీ చూస్తున్నా. ఇంకా మా ఆవిడ ఏ పని చెబితే అది చేస్తున్నా.. వంట పని లాంటివి. నాకు కొన్ని వంటలు వచ్చు. బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు రూమ్‌లో వంట చేసేవాణ్ణి.. అందుకని నన్ను బాడుగ (అద్దె) కట్టమనేవాళ్లు కాదు. అప్పుడు నా బట్టలు నేనే ఉతుక్కునేవాణ్ణి. ఇస్త్రీ మాత్రం బయట చేయించుకునేవాణ్ణి. అప్పుడు షర్ట్‌కి యాభై పైసలు, ప్యాంటుకి యాభై పైసలు ఉండేది. ఇంటిలో మన పని మనం చేసుకోవడంలో తప్పేమీ లేదు. ఏం మనం స్నానం చేయడం లేదా? వేరే వాళ్లు చేయిస్తున్నారా? చిన్నప్పుడంటే తల్లిదండ్రుల చేయించేవాళ్లు.’ అని తెలిపారు. (బుల్లితెర కార్మికులకు యాంకర్ ప్రదీప్ చేయూత)
Comments
Please login to add a commentAdd a comment