
వ్యాపారి మురళీని కాల్చి చంపేశారు!
పార్వతీపురంలో కాల్పుల కలకలం
విజయనగరం: జిల్లాలోని పార్వతీపురంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండుగులు స్థానిక వ్యాపారి మురళీపై దాడి చేశారు. తుపాకీతో ఆయనను కాల్చిచంపి.. పరారయ్యారు.
ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీమ్స్‌తో సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. మురళీ వ్యాపార భాగస్వాములను ప్రశ్నిస్తున్నారు. మురళీని ఎవరు హత్య చేశారు? ఎందుకు ఈ హత్య జరిగింది? అన్న కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది.