
కొన్నేళ్లుగా గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వెల్లడించారు నటి–దర్శకురాలు రేణూ దేశాయ్. తన అనారోగ్యం గురించి రేణు ఓ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘నా అనారోగ్య సమస్యల గురించి నా సన్నిహితులకు తెలుసు. కానీ ఇప్పుడు నేనే అందరికీ చెప్పాలనుకున్నాను.
ఎందుకంటే నాలాగే వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న వారు ధైర్యంగా ఉండాలని చెప్పడం కోసం... వారిలో జీవితం పట్ల సానుకూలమైన ఆలోచనలను రేకెత్తించడం కోసం. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనలోని ధైర్యాన్ని, జీవితం పట్ల ఆశను కోల్పోకూడదు. ఎందుకంటే మన కోసం ఎన్నో స్వీట్ సర్‌ప్రైజెస్‌ను కాలంప్లా న్ చేసి ఉండొచ్చు’’ అన్నారు రేణు. ప్రస్తుతం చికిత్స చేయించుకుంటున్నానని, త్వరలోనే కోలుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతూ, సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటాననే నమ్మకం ఉందని రేణుదేశాయ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment