
‘రజనీకాంత్ విల్లాని రెండు రోజులకు బుక్ చేస్తాం. తలైవర్ స్పెషల్ టీ ఇవ్వాలి’ అని అడగాలట అలిట్టా హోటల్‌లో. ఏంటి చెన్నైలో రజనీకాంత్ అభిమానులెవరైనా ఆయన పేరుతో హోటల్ ఓపెన్ చేశారా? అంటే కాదు. ఇది వెస్ట్ బెంగాల్‌లోని స్టోరీ. రజనీకాంత్ ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో ఓ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వెస్ట్ బెంగాల్‌లో జరుగుతోంది. షూటింగ్‌లో భాగంగా రజనీకాంత్ ఓ విల్లాలో పది రోజులు ఉన్నారట. ఆయన గుర్తుగా ఆ రిసార్ట్‌లోని ఒక విల్లాకు రజనీకాంత్ పేరు పెట్టింది హోటల్ మేనేజ్‌మెంట్. అలాగే అక్కడ రజనీకాంత్‌కి నచ్చిన టీను ‘తలైవర్ స్పెషల్’గా ఇక మీదట సర్వ్ చేయనున్నారట. విల్లాలో బస చేసినందుకు గుర్తుగా రజనీకాంత్ ఆ రిసార్ట్‌లో ఒక మొక్కను నాటడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment