ఏమిటీ వింత..గద్ద పొదగని గుడ్డు .. అనాథ పిల్లకు తండ్రి కూడా! | Meet Bald eagle who protected rock is now foster father to orphaned chick | Sakshi
Sakshi News home page

వీడియో: ఏమిటీ వింత.. గద్ద పొదగని గుడ్డు.. అనాథ పిల్లకు తండ్రి కూడా!

Published Thu, Apr 20 2023 9:30 PM | Last Updated on Thu, Apr 20 2023 9:31 PM

Meet Bald eagle who protected rock is now foster father to orphaned chick - Sakshi

మనుషులే కాదు.. ఒక్కోసారి మూగజీవాల ప్రవర్తన కూడా విపరీతమైన చర్చకు దారి తీస్తుంటుంది. మనిషికి మించిన మానవత్వం, ప్రేమను కనబర్చినప్పుడు అది తప్పకుండా ఆకట్టుకుంటుంది కూడా. అలా అమెరికా దృష్టిని ఆకట్టుకున్న ఓ గద్ద.. నెల తిరగకుండానే మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. మొదటిసారి పొదగని ఓ గుడ్డుతో.. ఇప్పుడు ఓ అనాథ పిల్లతో.. 

మర్ఫీ.. మిస్సోరి వ్యాలీ పార్క్‌లో ఉంటున్న ఓ బాల్డ్‌ ఈగల్‌. వయసు సుమారుగా 31 ఏళ్లు ఉంటుంది. రెక్కకు గాయం కావడంతో ఎగరలేని స్థితి దానిది పాపం. మార్చి చివర్లో.. ఈ పక్షి ప్రవర్తన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం.. ఈ మగ పక్షి ఓ రాయిని పొదగడానికి ప్రయత్నించడం. గుడ్డు ఆకారంలోని ఆ రాయిని తనకింద ఉంచుకోవడం మాత్రమే కాదు.. దాని దగ్గరికి వచ్చిన తోటి గద్దలను తరిమి తరిమి కొట్టాడు మర్ఫీ. అలా మొదటిసారి వార్తల్లో నిలిచాడు. ఆ సమయంలో దాని ప్రవర్తన పక్షులపై అధ్యయనం చేసే వాళ్లను సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. 

ఇక ఇప్పుడు రెండోసారి.. మళ్లీ అది మీడియా సెన్సేషన్‌ అయ్యింది. ఈసారి ఓ నిజం పక్షికి తండ్రిగా మారింది మర్ఫీ. అక్కడికి అరవై మైళ్ల దూరం నుంచి కొట్టుకొచ్చిన ఓ పక్షి గూడులోని పిల్లను జాగ్రత్తగా చూసుకుంటోంది ఈ మగ గద్ద. ఆహారం అందించడం మాత్రమే కాదు.. ఎప్పుడూ వెంట ఉంటూ తోటి గద్దల నుంచి దానిని సంరక్షిస్తోంది. అయితే ఈ క్రమంలో తన ‘రాకీబేబీ’ని మాత్రం నిర్లక్ష్యం చేయట్లేదండోయ్‌. ఒకవైపు ఆ రాయిని.. మరోవైపు అనాథ పక్షిని ఇద్దరి సంరక్షణను చూసుకుంటూ తన మంచి గుణం చాటుకుంటోంది మర్ఫీ. ఇదేం విచిత్రమో మరి.. !

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement