
సెయింట్ లూయిస్ : ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తూ 151 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్ సీపీ అఖండ విజయంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లువిరిశాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న వైఎస్సార్ సీపీ అభిమానులు పార్టీ ఘనవిజయం సాధించటంతో సంబరాలు చేసుకున్నారు. మిస్సోరిలోని సెయింట్ లూయిస్ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సైతం ఆటలు, పాటలతో తమ ఆనందాన్ని వ్యక్త పరిచారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వేషధారణ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Comments
Please login to add a commentAdd a comment