లాస్ ఎంజెల్స్: తనకు ఎలా నటించాలో తెలియదని అంటున్నాడు ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ థామస్ ప్యాటిన్సన్. ‘నిజంగా నాకు ఎలా నటించాలో రాదు. ఏదో ఒక విధంగా నటించి దాన్ని నిజమని ప్రేక్షకులు అనుకునేలా చేయాలనుకుంటాను. నా నటనతో ప్రేక్షకుల్ని కదిలించగలిగితే.. అప్పుడే దానిని నిజం చేయాగలిగానని నమ్ముతాను. అయితే ప్రేక్షకులు భిన్నమైన అనుభూతిని కలిగించే సన్నివేశాల కోసం ఎదురు చూడటం మానేయాలి’ అని ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చాడు ఈ హ్యరీ పోటర్ నటుడు. అదే విధంగా నటించేటప్పుడు తన చూట్టు కెమెరాలు ఉన్న విషయాన్ని కూడా మరిచిపోతానని, దాదాపుగా సీన్‌లు అన్నింటిని సింగిల్ టేక్‌లోనే చేస్తానని, ఇది చూసి డైరెక్టర్‌లు, నిర్మాతలు కొన్నిసార్లు ఆశ్చర్యపోతారంటూ ప్యాటిన్సన్ చెప్పాడు.
అయితే కొన్ని సందర్భాలలో తాను పరాభవాలు చూడాల్సి వస్తుందేమోనని అప్పుడప్పుడూ నిరాశకు గురవుతానని, నిరాశ దృక్పథం కూడా కొన్నిసార్లు ప్రయోజనకరంగా ఉంటుందని ప్యాటిన్సన్ చెప్పుకొచ్చాడు. ‘నేను నిరాశ వాదిని. ఏదో ఒక రోజు జీవితంలో నాకు చేదు అనుభవం ఎదురుపడొచ్చు అని అనుకుంటూ ఉంటాను. ఒకవేళ అది జరిగినా కూడా నాకు సంతోషమే.. దానిని ఎదుర్కొవడానికి నేను ఎప్పుడూ సిద్ధమే’. అని అన్నాడు. అలాగే ‘ఓ సాధారణ నటుడిలా ఎలా నటించాలో నాకు తెలియదు. అలా అని నేనో గొప్ప నటుడినని కూడా అనుకోను కానీ.. నేను కొన్ని పాత్రలను ఇష్టపడతాను, కొన్ని ప్రత్యేక పాత్రలకు ఆకర్షితుడిని అయ్యాను.’ అంటూ ప్యాటిన్సన్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment