లెజండరీ నటుడు ఇక లేరు! | Acclaimed British actor John Hurt dies at 77 | Sakshi
Sakshi News home page

లెజండరీ నటుడు ఇక లేరు!

Published Sat, Jan 28 2017 8:52 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

లెజండరీ నటుడు ఇక లేరు! - Sakshi

లెజండరీ నటుడు ఇక లేరు!

బ్రిటిష్ సీనియర్ నటుడు, ప్రపంచ గొప్ప నటుడిగా  పేరొందిన  సర్ జాన్ హర్ట్  (77)  కన్నుమూశారు. గతకొంతకాలంగా  క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. ఐకానిక్  పాత్రలతో  అనేక ప్రఖ్యాత సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకుని లెజండ్ గా నిలిచారు. 

ముఖ్యంగా   ది మిడ్ నైట్ ఎక్స్ ప్రెస్, ది లార్డ్ ఆఫ్ ద రింగ్స్,   ఎలిఫెంట్ మ్యాన్,  ఏలియన్, హ్యారీ పాటర్ సిరీస్ , హెర్య్కులస్, తదితర ప్రఖ్యాత సినిమాల ద్వారా ప్రపంచసినీ ప్రేక్షకులకు సుపరిచితం.  సుమారు ఆరు దశాబ్దాలపాటు ఆయన సినీరంగానికి ఎనలేని సేవలందించారు.  అనేక రివార్డులు, అవార్డులు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తోపాటు, 2015 లో బ్రిటిష్ రాణి  చేతుల మీదుగా  'సర్'   సత్కారాన్ని కూడా అందుకున్నారు.  ఆయా పాత్రలకు ప్రాణం పోసే జాన్ అనేకమంది విశిష్ట దర్శకులచేత ప్రపంచ మేటి నటుడిగా ప్రశంసంలు  పొందారు.  రెండుసార్లు ఆస్కార్ కు నామినేట్ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement