రోడ్డు ప్రమాదంలో హ్యారీపోటర్‌ నటుడికి గాయాలు! | 'Harry Potter' Actor Breaks Neck In Horrific Head-On Car Crash | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో హ్యారీపోటర్‌ నటుడికి గాయాలు!

Published Thu, Mar 9 2017 10:57 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

రోడ్డు ప్రమాదంలో హ్యారీపోటర్‌ నటుడికి గాయాలు! - Sakshi

రోడ్డు ప్రమాదంలో హ్యారీపోటర్‌ నటుడికి గాయాలు!

న్యూయార్క్‌: ప్రముఖ హాలీవుడ్‌ నటుడు జిమ్‌ తవారే ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. ప్రతిష్టాత్మక హ్యారీపోటర్‌ చిత్రంలో నటించిన తవారే రోడ్డు ప్రమాదం గురించి ఆయన భార్య ఫేస్‌బుక్‌లో తెలిపింది. అయితే, ప్రమాదం ఎప్పుడు? ఎక్కడ? ఎలా? జరిగిందనే వివరాలు మాత్రం తెలియజేయలేదు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో క్రిటికల్‌ పొజిషన్‌లో ఉన్నాడని తెలిపింది.

ఈ ప్రమాదంలో అతడి మెడ విరిగిపోవడమే కాకుండా ఊపరితిత్తులకు కూడా గాయాలయ్యాయి. అలాగే, 15 పక్కటెముకలు విరిగిపోయాయి. కుడికాలుతోపాటు బ్రెస్ట్‌బోన్‌ కూడా విరిగిపోయిందని ఆమె ఫేస్‌బుక్‌లో పేర్కొంది. ఇప్పటికే అతడికి తొలి శస్త్ర చికిత్స పూర్తి చేశారని, రెండుసార్లు రక్త మార్పిడి చేశారని, ప్రమాదం చాలా తీవ్రంగా జరిగిందని ఆమె అందులో విచారం వ్యక్తం చేసింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొనడం వల్లే ఈ విషమ పరిస్థితి తలెత్తిందని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement