బాలనటిగా యువరాజ్‌సింగ్‌ భార్య | Yuvraj Wife Hazel Keech Acted In Harry Potter Films As Child Artist | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 25 2018 8:57 PM | Last Updated on Tue, Sep 25 2018 9:06 PM

Yuvraj Wife Hazel Keech Acted In Harry Potter Films As Child Artist - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : హాలీవుడ్‌ నటి, క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ భార్య హేజిల్‌ కీచ్‌ ప్రఖ్యాత హ్యారీపొటర్‌ సినిమాల్లో నటించిందట. హోగ్‌వార్ట్స్ యాక్టింగ్‌ స్కూల్‌లో ట్రెయినింగ్‌ తీసుకుంటున్నప్పుడు మూడు హ్యారీపొటర్‌ చిత్రాల్లో బాలనటిగా నటించినట్టు ఆమె తెలిపారు. మిస్‌ఫీల్డ్‌ అనే షోలో కీచ్‌ ఆనాటి సంగతుల్ని గుర్తు చేసుకుని మురిసిపోయారు. తన కెరీర్‌లో హ్యారీ పొటర్‌ చిత్రాల్లో నటించడం మరచిపోలేని అనుభూతి అని చెప్పారు.

రాడ్‌క్లిఫ్‌ (హ్యారీపొటర్‌), ఎమ్మా వాట్సన్‌ (హెర్మాయిన్‌), రూపర్ట్‌ గ్రింట్‌ (రోన్‌)లతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నానని చెప్పుకొచ్చారు. యాక్టింగ్‌ స్కూల్లో పిల్లలకు సంబంధించిన ప్రతివిషయంపై నిర్వాహకులు జాగ్రత్త వ్యవహరిస్తారని అన్నారు. పాత్రలు ధరించేటప్పుడు విద్యార్థుల హెయిర్‌ స్టయిల్‌, మేకప్‌ విషయాల్లో కొంచెం కూడా తేడా రానీయరనీ, పశ్చిమ దేశాల్లో పని సంస్కృతి చాలా గొప్పగా ఉంటుందని అన్నారు. అన్నట్టు సల్మాన్‌ఖాన్‌ సూపర్‌హిట్‌ సినిమా ‘బాడీగార్డ్‌’లో నటించిన కీచ్‌... హిందీ బిగ్‌బాస్‌ 7 కూడా కంటెస్ట్‌ చేశారు. కొన్నాళ్లపాటు డేటింగ్‌ చేసిన యువీ, కీచ్‌ జంట 2016లో పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement