ఫేస్బుక్లో హేరీపోటర్ పుస్తకమే టాప్! | Harry Potter most loved book on Facebook | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్లో హేరీపోటర్ పుస్తకమే టాప్!

Published Wed, Sep 10 2014 10:40 AM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

ఫేస్బుక్లో హేరీపోటర్ పుస్తకమే టాప్! - Sakshi

ఫేస్బుక్లో హేరీపోటర్ పుస్తకమే టాప్!

ఫేస్బుక్ కమ్యూనిటీలో ఎక్కువమంది ఇష్టపడుతున్న పుస్తకం ఏంటో మీకు తెలుసా.. ఇంకేముంది.. హేరీపోటర్! ఎక్కువగా చదివి, దాచిపెట్టుకున్న పది టాప్ పుస్తకాల జాబితాలో హేరీపోటర్ సిరీస్ అగ్రస్థానంలో నిలిచింది. భారత సంతతికి చెందిన పింకేష్ పటేల్ రాసిన పుస్తకాలు కూడా ఫేస్బుక్ అభిమానులు మెచ్చిన పుస్తకాల్లో ఉన్నాయి. మొత్తం లక్షా 30 వేల పుస్తకాలను వీటిలో చూడగా, అగ్రస్థానంలో మాత్రం హేరీపోటర్ పుస్తకాలే నిలిచాయి.

జేకే రౌలింగ్ రాసిన ఈ పుస్తకాలను 21 శాతం మంది మెచ్చుకున్నారు. దీంతో 'ఫేస్బుక్లో అత్యంత ప్రభావవంతమైన పుస్తకం' టైటిల్ను ఈ సిరీస్ ఎగరేసుకుపోయింది. రెండో స్థానంలో పులిట్జర్ బహుమతి విజేత హార్పర్ లీ రాసిన 'టు కిల్ ఎ మాకింగ్ బర్డ్' నిలిచింది. అలాగే జేఆర్ఆర్ టోల్కీన్ రాసిన 'ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్' పుస్తకానికి మూడోస్థానం లభించింది. టాప్ 20 జాబితాలో పిల్లల కథల పుస్తకాలు కూడా చాలానే ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement