British actress
-
'హ్యారీ పోటర్' నటి- ఆస్కార్ విజేత కన్నమూత
'హ్యారీ పోటర్' పేరు చెప్పగానే అద్భుతమైన సినిమాలు గుర్తొస్తాయి. దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే అదిరిపోయే గ్రాఫిక్స్‌తో తీసిన చిత్రాలు చాలామందికి ఫేవరెట్. ఇందులో పాత్రధారులకు కోట్లాది మంది అభిమానులున్నారు. గత కొన్నాళ్లుగా 'హ్యారీ పోటర్' నటీనటులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. గతేడాది మైఖేల్ గ్యాంబెన్ అలియాస్ ప్రొఫెసర్ డంబెల్ డోర్ చనిపోయారు. ఇప్పుడు ఆయన మృతి చెందిన సరిగ్గా ఏడాదికి మరో నటి చనిపోయారు.(ఇదీ చదవండి: 'దేవర' పార్ట్ 2లో స్టోరీ ఏం ఉండొచ్చు?)'హ్యారీ పోటర్' సిరీస్‌లో ప్రొఫెసర్ మెక్ గొనగల్ పాత్రలో అలరించిన మ్యాగీ స్మిత్ (89) అనారోగ్య కారణాలతో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కెరీర్లో మంచి మంచి సినిమాలు చేసిన ఈమె.. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుని కూడా రెండు సార్లు అందుకున్నారు. అలానే 'డౌన్ టౌన్ అబే' అనే టీవీ సిరీస్‌తోనూ ఈమె పాపులారిటీ సొంతం చేసుకున్నారు.(ఇదీ చదవండి: కేసు పెట్టిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్)One year ago today: Michael Gambon passed away.Today: Maggie Smith passed away.Two legendary people who played two of our favorite Harry Potter characters. 😢#RIPMichaelGambon#RIPMaggieSmith pic.twitter.com/TE8nmaVSqS— Harry Potter Universe (@HPotterUniverse) September 27, 2024All four of them have passed away 💔💔💔💔 pic.twitter.com/4B2D7bNBnP— Harry Potter Universe (@HPotterUniverse) September 27, 2024 -
ప్రియాంకకు చేదు అనుభవం: జమీలా, నిక్ విడాకులు?
బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా రాణిస్తూనే హాలీవుడ్లో అడుగుపెట్టి గ్లోబల్ స్టార్‌గా ఎదిగింది ప్రియాంక చొప్రా. ఈ క్రమంలో అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకుని హాలీవుడ్‌కే మాకాం మార్చింది. ఈ క్రమంలో ప్రియాంక హాలీవుడ్ ఆరంగేట్రం చేసిన కొత్తలో తరచూ ఆమెకు చేదు అనుభవాలను ఎదురయ్యాయి. ఎన్నో సందర్భాల్లో ఇతర నటీనటులను చూసి ప్రియాంక అనుకుని అక్కడి వారు పప్పులో కాలేసిన సంగతి తెలిసిందే. దీంతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ఆమెకు ఈ సంఘటనలు చేదు అనుభవాలుగా మిగిలిపోతున్నాయి. తాజాగా మరోసారి ప్రియాంక అలాంటి సంఘటనే ఎదురైంది. బ్రిటిష్ నటి జమీలా జమిల్ను చూసి ఓ ట్విటర్ యూజర్ ప్రియాంక అనుకొని పప్పులో కాలేశాడు. అంతటితో ఊరుకోకుండా ‘ఒకవేళ నిక్ జోనస్, జమీలా జమిల్లకు విడాకులు అయితే’ అంటూ ట్వీట్ చేశాడు. అది చూసిన జమీలా తనదైన శైలిలో అతడికి సమాధానం ఇచ్చింది. ‘భిన్నమైన భారత మహిళ, ఏ మాత్రం నాలా కనిపించని ప్రియాంక చొప్రా, ఆమె భర్త ఇద్దరూ హ్యాపీ ఉన్నారని నమ్ముతున్నా’ అంటూ తను ప్రియాంక కాదని అతడికి స్పష్టం చేసింది. అది చూసి ప్రియాంక స్పందిస్తూ.. ‘లాల్’ అంటూ హర్ట్, పంచ్ ఎమోజీలను జత చేసింది. కాగా జమీల బ్రిటిష్ నటి, మోడల్. అంతేగాక గుడ్ ప్లేస్ వంటి కామెడీ షోలకు ఆమె వ్యాఖ్యాతగా వ్యహరించింది. లండన్ త్వరలో రాబోయే మరిన్ని షోలకు కూడా ఆమె జడ్జీగా, వ్యాఖ్యాతగా వ్యవహరించనుంది. A different Indian woman who doesn’t look anything like me. @priyankachopra 😬 I believe they are very happy together still. https://t.co/UoDS5PgXIl — Jameela Jamil 🌈 (@jameelajamil) February 26, 2021 కాగా కొన్నేళ్ల క్రితం ఏబీసీ విడుదల చేసిన ఎయిర్ క్వాంటికోలో ప్రియాంక బదులు నటి, మోడల్ యుక్తా ముఖే చిత్రాన్ని ప్రచురించారు. అలాగే 2019లో వచ్చిన ఓ మ్యాగజేన్లో మోడల్, రచయిత పద్మ లక్ష్మిని స్టోరికి ప్రియాంక ఫొటోలను ఉపయోగించారు. ఇక 2017లో అమెరికాలోని ఓ ఈవెంట్లోన పాల్గోన్న దీపికాను చూసి ప్రియాంక చొప్రాగా పొరబడ్డారు. దీంతో ప్రియాంక ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ఇది అన్యాయం, అజ్ఞానం. ఇది సరైనది కాదు. గోధుమ వర్ణంలో ఉండే ప్రతి అమ్మాయి ఒకేలా ఉండదు. ప్రపంచ జనాభాలో అయిదవ వంతు భారతీయులు ప్రపంచ సినిమాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అది మా బాధ్యత కూడా. మమ్మల్ని అలాగే చూడండి’ అంటూ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చదవండి: ప్రియాంక డ్రెస్సింగ్‌పై విపరీతమైన ట్రోలింగ్ భజ్జీ సినిమా టీజర్ విడుదల, విషెస్ చెప్పిన రైనా ‘భీష్మ’ డైరెక్టర్ వెంకీ కుడుములకు టోకరా.. -
నటికి కరోనా: రంగంలోకి దిగిన పోలీసులు
కోల్‌కతా: షూటింగ్ కోసం భారత్‌కు వచ్చిన బ్రిటీష్ నటి బనితా సంధు కరోనా బారిన పడ్డారు. దీంతో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా రానంటూ మొండికేశారు. అంతేకాక అక్కడ నుంచి పరారయ్యేందుకు సైతం యత్నించడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆమె పారిపోకుండా రక్షణ కల్పించారు. వివరాల్లోకి వెళితే.. కవితా తెరెసా సినిమా షూటింగ్ కోసం హీరోయిన్ బనితా సంధు డిసెంబర్ 20న కోల్‌కతాకు వచ్చారు. అయితే ఆ విమానంలోని ఓ ప్రయాణికుడికి కరోనా కొత్త స్ట్రెయిన్ సోకినట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులతో పాటు సదరు నటికి సైతం పరీక్షలు నిర్వహించారు. (చదవండి: సినిమా చూసి సంతోషంగా ఇంటికి వెళతారు) ఈ క్రమంలో సోమవారం నాడు బనితాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే అది కొత్త స్ట్రెయినా, లేదా సాధారణ కరోనానా అన్న విషయం తేలాల్సి ఉంది. ఇక యూకే నుంచి వస్తున్నవారిలో పాజిటివ్ అని తేలిన వారిని బెలియాఘట ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఆస్పత్రికి తరలిస్తుండగా... బబితాను కూడా అక్కడికే పంపించారు. కానీ ఆమె ఆ ఆస్పత్రికి వెళ్లనని మొండికేస్తూ అంబులెన్స్ దిగడానికి నిరాకరించింది. ఓవైపు సిబ్బంది నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తుంటే ఆమె అక్కడి నుంచి తప్పించుకునేందుకు యత్నించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అంబులెన్స్ చుట్టూ కవచంలా నిలబడి ఆమె పారిపోకుండా అడ్డుకున్నారు. అనంతరం ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా బనితా సంధు.. వరుణ్ ధావన్ హీరోగా నటించిన 'అక్టోబర్' చిత్రంతో వెండితెరపై తెరంగ్రేటం చేశారు. ఆదిత్య వర్మ సినిమాతో తమిళ ఇండస్ట్రీలో లక్ పరీక్షించుకున్నారు. సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఈ చిత్రం తెలుగు అర్జున్ రెడ్డికి రీమేక్. (చదవండి: మీ పేషెంట్లను చూస్తుంటే జాలేస్తోంది..: మాధవన్) -
కరోనాతో హాలీవుడ్ నటి మృతి
కరోనా లక్షణాలతో హాలీవుడ్ నటి హిల్లరీ హీత్ (74) మరణించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ‘విచ్ ఫైండర్ జనరల్’ అనే హారర్ మూవీ ద్వారా పాపులారిటీ సంపాదించారు హిల్లరీ హీత్. ఆ తర్వాత ‘నిల్ బై మౌత్’, ‘యాన్ ఆఫుల్లీ బిగ్ అడ్వెంచర్’ వంటి సినిమాలను నిర్మించారు. హీత్ మృతి పట్ల పలువురు హాలీవుడ్ సినీ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
కామసూత్ర నటికి కరోనా పాజిటివ్
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. భారత్‌లోనూ కరోనా ప్రవేశించడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పటికే అన్ని విద్యాసంస్థలు, పార్క్‌లు, సినిమా థియేటర్లు, దేవాలయాలు మూసి వేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఇక సెలబ్రిటీలు కూడా సినిమా షూటింగ్‌లకు బ్రేక్ చెప్పి ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సెలబ్రిటీ కరోనా బారిన పడ్డారు. హాలీవుడ్లో 'కామసూత్ర', 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సినిమాల్లో నాయికగా నటించిన, భారత సంతతికి చెందిన ఇందిరా వర్మకు కరోనా సోకింది. ఇటీవల ఆమె తీవ్ర అనారోగ్యానికి గురై కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా కరోనా వైరస్ (కోవిడ్-19) పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఇందిరా వర్మ వైద్యుల పర్యవేక్షణలో ఉంది. కాగా, ఇండియాలో ఇప్పటికే బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. హాలీవుడ్లో కూడా ప్రముఖ నటుడు టామ్ హ్యాంక్స్, ఆయన భార్య రీటా విల్సన్, జేమ్స్ బాండ్ నటి ఓల్గా కురిలెంకోతో పాటు మరికొందరు తారలు కరోనా వైరస్ బారిన పడ్డారు. చదవండి: కరోనా: బాలీవుడ్ సెలబ్రిటీలు ఏమన్నారంటే కాగా.. ఇందిరా వర్మ తండ్రి భారతీయుడు కాగా తల్లిది బ్రిటన్. హాలీవుడ్లో ముఖ్యంగా ఈమె నటించిన 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక 'కామసూత్ర: ఏ టేల్ ఆఫ్ లవ్'తో వెండితెరకు పరిచయమైన ఇందిరా ఆ సినిమాతో చాలా పాపులర్ అయింది. 'బ్రైడ్ అండ్ ప్రిజ్యుడిస్', 'బేసిక్ ఇన్స్టింక్ట్ 2' లాంటి చిత్రాలతో పాటు పలు టీవీ సిరీసుల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చదవండి: ప్రముఖ బాలీవుడ్ సింగర్‌కు కరోనా పాజిటివ్ View this post on Instagram So sad our and so many other shows around the world have gone dark affected by the Covid-19 pandemic. We hope to be back soon and urge you all (and the govt) to support us when we do. Phoenix/ Seagull rising from the ashes. I’m in bed with it and it’s not nice. Stay safe and healthy and be kind to your fellow people.❤️💜❤️ A post shared by Indira (@indypindy9) on Mar 17, 2020 at 11:42pm PDT -
బీచ్‌లో బికినీ వేసుకుందని..
-
బికినీ వేసుకున్నందుకు పోలీసులు ఆమెను..
మాల్దీవులు పర్యటనకు వచ్చిన బ్రిటీష్ నటికి చేదు అనుభవం ఎదురైంది. బికినీ ధరించినందుకుగానూ ఆమెకు సంకెళ్లు వేయడానికి ప్రయత్నిస్తూ పోలీసులు భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. పోలీసుల తీరుతో బెంబేలెత్తిన యువతి ‘మీరు నన్ను లైంగికంగా వేధిస్తున్నారు’ అంటూ కేకలు పెట్టినా వారు పట్టించుకున్న పాపాన పోలేదు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్ కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కెసీలియా జస్ట్రెంబ్స్‌కా అనే బ్రిటీష్ యువతి మఫూసిలోని బీచ్‌లో బికినీ ధరించి సముద్రం ఒడ్డున సేద తీరుతోంది. ఇది గమనించిన ముగ్గురు పోలీసులు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టి యువతి పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఆమె ఎంత గింజుకుంటున్నా వదలకుండా చేతికి బేడీలు వేసేందుకు ప్రయత్నించారు. ఈ హఠాత్పరిణామంతో ఖంగుతిన్న నటి వారి చర్యను తీవ్రంగా ప్రతిఘటించింది. (అయ్యో! వాలెంటైన్స్ రోజు.. ఫీల్ పోయింది..) మరోవైపు ఓ పోలీసు ఆమె శరీరాన్ని కప్పేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనపై యువతి స్పందిస్తూ తనకు ఇది అవమానకరమని వాపోయింది. ‘వారి ప్రవర్తన చూసి.. నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చారనుకున్నాను. పైగా వాళ్లు నాపై దాడి చేసినపుడు నాకు శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది. వారి ప్రవర్తనతో నేను హడలెత్తిపోయా. నా జీవితం ప్రమాదంలో పడుతోందని విపరీతంగా భయపడిపోయాను’ అని చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. బాధిత యువతికి క్షమాపణలు చెప్పారు. యువతి పట్ల పోలీసుల తీరు అవమానకరంగా ఉందన్నారు. ఇంతకీ పోలీసులు ఆమెను అరెస్టు చేయడానికి ప్రధాన కారణం.. అక్కడి బీచ్‌లో బికినీ వేసుకోడానికి వీల్లేదన్న నిబంధన ఉండటమే. (సీక్రెట్‌ను చెప్పేసిన కురు వృద్దుడు) -
అవును 30... అయితే ఏంటి?
‘‘పెళ్లెప్పుడు?!’’ అని అడిగే వాళ్లకు సరదాగా ఉంటుంది. చెప్పేవాళ్లకే చిర్రెత్తుకొస్తుంటుంది. ‘‘ముప్పయ్ ఏళ్లు వచ్చాయి, ఇక పెళ్లి చేసుకో’’ అని ఎమ్మా వాట్సన్‌కు హితులు, సన్నిహితుల నుంచి పోరు ఎక్కువైంది. ‘‘నాకు 29 దాటాయి, సంతోషంగా ఉన్నాను. సింగిల్‌గా ఉండడంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను. నాకు పార్టనర్ లేరని ఎవరన్నారు! నాకు నేనే పార్టనర్‌ని. సెల్ఫ్ పార్టనర్డ్ పర్సన్’’ అని ఒక పోస్ట్‌లో అందరికీ కలిపి ఒకే సమాధానమిచ్చింది ఎమ్మా. ఎమ్మా వాట్సన్ బ్రిటిష్ నటి. ప్యారిస్‌లో పుట్టింది. హ్యారీ పోటర్ సినిమాలు చూసిన వాళ్లకు హర్మియోన్ గ్రేంజర్ పాత్రలో ఆమె తెలిసే ఉంటుంది. హ్యారీ పోటర్ సీరీస్‌తో ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా నేమ్ అండ్ ఫేమ్ వచ్చి పడింది. డబ్బు కూడా ఇబ్బడిముబ్బడిగా వచ్చింది. ఆమె కష్టాలూ అప్పటి నుంచే మొదలయ్యాయి. ఆమె పెళ్లెప్పుడు చేసుకుంటుందో? ఎవరిని పెళ్లి చేసుకుంటుందోనని ఒక చూపు ఆమె మీద పెట్టేసింది అక్కడి మీడియా. ఆమెను వెంబడిస్తూ, రహస్యంగా ఆమె కదలికలను ఫొటో తీసే పాపరాజ్జిలు కూడా ఎక్కువైపోయారు. ఆమె ఏ వేడుకలో కనిపించినా సరే... ఆమెతో మరెవరైనా వచ్చారా అని అందరి కళ్లూ వెతకడమూ ఎక్కువైంది. ఇంత గందరగోళాన్ని భరించలేక ఇప్పుడామె సోషల్ మీడియాలో ఈ ‘పెళ్లి పోస్ట్’ పెట్టారు. అమ్మాయి విషయంలో ఇంగ్లండ్ అయినా ఇండియా అయినా ఒక్కటే కాబోలు. ఆమె పెళ్లి బాధ్యత తమ భుజాల మీదనే ఉన్నట్లు సమాజం ఒత్తిడి తెస్తుంటుంది. అందుకే అంత సున్నితంగా, కొంచెం ఘాటుగా బదులిచ్చింది ఎమ్మా. అందుకు కారణం తన కెరీర్‌ని ఆమె గాఢంగా ప్రేమిస్తుండటం. తనపై తాను కాన్ఫిడెంట్‌గా ఉండటం. -
ఆ హీరో నా స్కర్ట్ లో చేయి పెట్టాడు
మీటు’ ఉద్యమం వెలుగులోకొచ్చాక ఇండస్ట్రీలో చాలా మంది తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి మాట్లాడి, ఈ సంస్కృతిని నివారించే ప్రయత్నం చేస్తున్నారు. హాలీవుడ్లో మొదలైన ఈ ఉద్యమం ఇండియన్ ఇండస్ట్రీ వరకూ విస్తరించింది. ఈ ఉద్యమం వచ్చాక వేదింపులు తగ్గినప్పటీకి ఇంకా బరితెగించి ప్రవర్తిస్తూనే ఉన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి కొంతవరకు బాగానే ఉందని అంటున్నారు బ్రిటిష్ నటి నవోమి హారీస్. తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న భయంకర పరిస్థితి గురించి నవోమి ఇప్పుడు బయట పెట్టింది. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నాకు 20 ఏళ్లు ఉన్నప్పుడు సినీ కెరీర్ ప్రారంభించాను. పలు చోట్ల ఆడిషన్స్‌కు వెళ్లాను. ఒక రోజు ఓ స్టార్ హీరో సినిమా కోసం ఆడిషన్స్‌కు వెళ్లాను. అక్కడ కాస్టింగ్ డైరెక్టర్, సినిమా దర్శకుడు, ఆ స్టార్ హీరో ఉన్నాడు. ఆడిషన్స్ కోసం నన్ను పిలిచి అసభ్యంగా ప్రవర్తించారు. ఆ హీరో నా స్కర్ట్ లోకి చేయి పెట్టి అసభ్యకరంగా టచ్ చేశాడు. అప్పుడు నేను భయంతో వణికి పోయాను. అతను అలా చేస్తుంటే అక్కడే ఉన్న దర్శకుడు, ప్రొడక్ష్లన్ వారు ఏమి అనలేదు. అలాగే చూస్తూ ఉండిపోపయారు. ఆ సంఘటన నేను జీవితంలో మర్చి పోలేను. అప్పుడు నా కెరీర్ ప్రారంభ స్టేజ్ లో ఉంది కనుక చెప్పదల్చుకోలేదు. ఇప్పుడు ఆయన పేరును బయట పెట్టాలని నేను అనుకోవడం లేదు. దీన్ని మరింత పెద్ద వివాదంగా మార్చే ఉద్దేశ్యం లేదు.. కేంబ్రిడ్జి వంటి ప్రపంచ ప్రసిద్ది యూనివర్శిటీలో ఉన్నత చదువు చదివిన నేను ఆ హీరో అలా చేయడంతో తట్టుకోలేక పోయాను. నటన అంటేనే ఆసక్తి పోయింది. కానీ మళ్లీ ప్రయత్నాలు చేసి అవకాశాలు దక్కించుకున్నాను’ నవోమీ చెప్పుకొచ్చింది. ఇలాంటి విషయాలు బయటపెట్టరని పురుషులు అనుకుంటారని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని నవోమి అభిప్రాయపడ్డారు. -
భారత హీరోయిన్‌కు మరో హాలీవుడ్ చాన్స్!
లాస్ ఏంజిల్స్: భారత సంతతికి చెందిన బ్రిటిషన్ నటి ఆర్చీ పంజాబీ మరో హాలీవుడ్ సినిమాలో మెరువనుంది. ఇప్పటికే 'ద గుడ్ వైఫ్' సినిమాతో హాలీవుడ్ ప్రేక్షకులను పలుకరించిన ఈ అమ్మడు.. తాజాగా ఏబీసీ అంతాలజీ 'జ్యూరీ'లో నటించనుంది. ఈ సినిమాలో కిమ్ డింప్సేగా ప్రధాన పాత్రలో నటించనుంది. ఓ హత్య ఘటన విచారణ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. వ్యక్తిగత అనుభవాలు, పక్షపాతాలు న్యాయమూర్తుల తీర్పులను ఎలా ప్రభావితం చేస్తాయి.. కాలక్రమంలో అభిప్రాయాలు ఎలా మారుతాయా? అన్న అంశాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. వృత్తిరీత్యా ఎవరితో స్నేహంగా ఉండకుండా సత్యాన్వేషణలో నిమగ్నమయ్యే గంభీరమైన పాత్రను పంజాబీ పోషిస్తున్నారని సినీ వర్గాలు తెలిపాయి. వీజే బొయ్డ్ స్క్రిప్ట్ అందిస్తున్న ఈ సినిమాను ఏబీసీ స్టూడియో, సోని పిక్చర్స్ టెలివిజన్ సహ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కించనున్నాయి.