
మీటు’ ఉద్యమం వెలుగులోకొచ్చాక ఇండస్ట్రీలో చాలా మంది తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి మాట్లాడి, ఈ సంస్కృతిని నివారించే ప్రయత్నం చేస్తున్నారు. హాలీవుడ్‌లో మొదలైన ఈ ఉద్యమం ఇండియన్ ఇండస్ట్రీ వరకూ విస్తరించింది. ఈ ఉద్యమం వచ్చాక వేదింపులు తగ్గినప్పటీకి ఇంకా బరితెగించి ప్రవర్తిస్తూనే ఉన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి కొంతవరకు బాగానే ఉందని అంటున్నారు బ్రిటిష్ నటి నవోమి హారీస్. తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న భయంకర పరిస్థితి గురించి నవోమి ఇప్పుడు బయట పెట్టింది.
ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నాకు 20 ఏళ్లు ఉన్నప్పుడు సినీ కెరీర్ ప్రారంభించాను. పలు చోట్ల ఆడిషన్స్‌కు వెళ్లాను. ఒక రోజు ఓ స్టార్ హీరో సినిమా కోసం ఆడిషన్స్‌కు వెళ్లాను. అక్కడ కాస్టింగ్ డైరెక్టర్, సినిమా దర్శకుడు, ఆ స్టార్ హీరో ఉన్నాడు. ఆడిషన్స్ కోసం నన్ను పిలిచి అసభ్యంగా ప్రవర్తించారు. ఆ హీరో నా స్కర్ట్ లోకి చేయి పెట్టి అసభ్యకరంగా టచ్ చేశాడు. అప్పుడు నేను భయంతో వణికి పోయాను. అతను అలా చేస్తుంటే అక్కడే ఉన్న దర్శకుడు, ప్రొడక్ష్లన్ వారు ఏమి అనలేదు. అలాగే చూస్తూ ఉండిపోపయారు. ఆ సంఘటన నేను జీవితంలో మర్చి పోలేను. అప్పుడు నా కెరీర్ ప్రారంభ స్టేజ్ లో ఉంది కనుక చెప్పదల్చుకోలేదు. ఇప్పుడు ఆయన పేరును బయట పెట్టాలని నేను అనుకోవడం లేదు. దీన్ని మరింత పెద్ద వివాదంగా మార్చే ఉద్దేశ్యం లేదు.. కేంబ్రిడ్జి వంటి ప్రపంచ ప్రసిద్ది యూనివర్శిటీలో ఉన్నత చదువు చదివిన నేను ఆ హీరో అలా చేయడంతో తట్టుకోలేక పోయాను. నటన అంటేనే ఆసక్తి పోయింది. కానీ మళ్లీ ప్రయత్నాలు చేసి అవకాశాలు దక్కించుకున్నాను’ నవోమీ చెప్పుకొచ్చింది. ఇలాంటి విషయాలు బయటపెట్టరని పురుషులు అనుకుంటారని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని నవోమి అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment