Taylor Swift Gifts $100K Bonus To Eras Tour Truck Drivers - Sakshi
Sakshi News home page

Taylor Swift: డ్రైవర్లకు కోట్ల కొద్దీ డబ్బిచ్చిన సింగర్.. కారణమేంటి?

Published Wed, Aug 2 2023 11:10 AM | Last Updated on Wed, Aug 2 2023 11:26 AM

Pop Singer Taylor Swift 100k Dollars Bonus Truck Drivers - Sakshi

చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి. కానీ దానం చేసేవాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు అయితే పలు విధాల లాభపడుతుంటారు కానీ ఖర్చు పెట్టడానికి, వర్కర్స్‌కి బోనస్‌లు ఇవ్వడానికి ముందు వెనకా అవుతుంటారు. కానీ ఓ స్టార్ సింగర్ మాత్రం తన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్లకు ఏకంగా రూ.50 కోట్ల వరకు ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారిపోయింది.

(ఇదీ చదవండి: సమంత ట్రీట్‌మెంట్ కోసం అన్ని కోట్ల ఖర్చు?)

ఇంగ్లీష్ సాంగ్స్ వినేవాళ్లకు, హాలీవుడ్ టచ్ ఉన్నవాళ్లకు అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. లైవ్ షోలు, ఆల్బమ్ సాంగ్స్ తో ఈమె చాలా పాపులర్. అలానే అమెరికాలోని ప్రతి సిటీలోనూ ఈవెంట్స్ చేస్తూ, జనాల్ని ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటుంది. అయితే ఈమెకు సంబంధించిన సామాను తిప్పడానికి ప్రత్యేకంగా 50 ట్రక్కులు ఉంటాయి. ఇప్పుడు ఆయా ట్రక్స్ డ్రైవర్లకు తలో లక్ష డాలర్స్ గిఫ్ట్‌గా ఇచ్చింది. భారతీయ కరెన్సీలో ఈ మొత‍్తం రూ.82 లక్షలు.

ఇలా కేవలం తన సామాగ్రిని చాలా జాగ్రత్తగా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తీసుకొస్తున్న డ్రైవర్ల విషయంలో టేలర్ స్విఫ్ట్ గొప్ప మనసు చాటకుంది. వాళ్లందరికీ కలిపి రూ.50 కోట్ల వరకు బోనస్ ఇచ్చింది. శాంటాక్లాజ్‌లో శనివారం.. ఈ డబ్బులు ఇచ్చే కార్యక్రమం జరిగింది. ఇకపోతే ఈ సింగర్.. నైట్‌లో జరిగే ఒక్కో ఈవెంట్‌కి రూ.100 కోట్ల వరకు సంపాదిస్తుందని టాక్. దీని ద‍్వారా ఆమె ఇప్పటివరకు 1.4 బిలియన్ డాలర్స్(రూ.94 వేల కోట్లకు పైగా) సంపాదించిందని తెలుస్తోంది. ఏదేమైనా ఇన్నిన్ని లక్షలు బోనస్ లేదా బహుమతిగా డ్రైవర్లకు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.

(ఇదీ చదవండి: సీఎం బయోపిక్‌లో సేతుపతి ఫిక్స్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement