యువతిని గర్భవతిని చేసి.. కానిస్టేబుల్‌ నిర్వాకం | Woman Complaints against Constable on Love Affair | Sakshi
Sakshi News home page

యువతిని గర్భవతిని చేసి.. కానిస్టేబుల్‌ నిర్వాకం

Apr 18 2019 9:03 PM | Updated on Apr 18 2019 9:13 PM

Woman Complaints against Constable on Love Affair - Sakshi

సాక్షి, నెల్లూరు : యువతిని ప్రేమించి.. పెళ్లి పేరుతో మోసగించి గర్భవతిని చేసి.. మరో పెళ్లికి సిద్ధమైన ఓ కానిస్టేబుల్‌ బాగోతం ఇది. ప్రేమించిన వాడే తనతో పెళ్లికి నిరాకరిస్తుండటంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. మహిళా సంఘాలు ఆమెకు అండగా నిలిచాయి. ఈ ఘటన నెల్లూరు జిల్లా కావలిలో చోటుచేసుకుంది. వివరాలివి.. నెల్లూరు ఐదో నగర పోలీసు స్టేషన్‌లో సాయి కిరణ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతను-అనూష అనే యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని సాయికిరణ్‌ తనను నమ్మించి.. తనను గర్భవతిని చేశాడని బాధిత యువతి తెలిపారు. పెళ్లి విషయంలో ముఖం చాటేస్తూ వచ్చిన సాయికిరణ్‌ ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమయ్యాడని, ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో బాధిత యువతికి అండగా నిలిచిన మహిళా సంఘాలు.. పోలీస్‌శాఖలో పనిచేస్తున్న సాయికిరణ్‌పై సత్వరమే చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement