Is Rekha In Live-In Relationship With Female Secretary Farzana, Book Claims Reason Behind Her Husband Death - Sakshi
Sakshi News home page

Rekha Relationship With Secretary: మహిళా సెక్రటరీ లేకుండా క్షణం కూడా బతకలేని హీరోయిన్‌! పెళ్లైన 7 నెలలకే ఆమె చున్నీతో ఉరేసుకున్న భర్త!

Published Fri, Jul 21 2023 3:50 PM | Last Updated on Fri, Jul 21 2023 4:34 PM

Is Rekha In Live In Relationship With Female Secretary Farzana, Shocking Revelations In Biography Book - Sakshi

అందాల అభినయానికి నిలువెత్తు నిదర్శనం రేఖ. దక్షిణాది నుంచి వెళ్లి బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందిన రేఖ జీవితంలో ప్రేమకథలెన్నో ఉన్నాయి. పెళ్లైందని తెలిసి కూడా అమితాబ్‌ బచ్చన్‌ను ప్రేమించింది రేఖ. కానీ జయాబచ్చన్‌ కఠినంగా వ్యవహరించడంతో వీరి ప్రేమకు ఫుల్‌స్టాప్‌ పడింది. క్రికెటర్‌, పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో కూడా ఆమె ప్రేమలో పడిందంటూ ఆ మధ్య ఓ పేపర్‌ క్లిప్‌ బాగా వైరలయింది. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారని, పెళ్లి చేసుకుంటారనుకునేలోపే విడిపోయారని అందులో రాసుకొచ్చారు.

ఏడాది తిరగకముందే ఆత్మహత్య
పెళ్లి కాకముందే రేఖ నుదుటన సింధూరం ధరించేది. వినోద్‌ మెహ్రాను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందని, కానీ అతడితో సెట్‌ అవ్వకపోవడంతో తనకు దూరంగా వచ్చేసిందని కూడా ప్రచారం నడిచింది. సెలబ్రిటీలతో నడిపిన ఏ లవ్‌ స్టోరీకి మంచి క్లైమాక్స్‌ పడకపోవడంతో అవుట్‌సైడర్‌ను పెళ్లాడింది. నాలుగు పార్టీల్లో కలిసిన వ్యాపారవేత్త ముఖేశ్‌ అగర్వాల్‌ ‘మనం పెళ్లి చేసుకుందామా’ అని అడగడం, రేఖ సరేనని తలూపడంతో ఆగమేఘాల మీద పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన ఏడు నెలలకే రేఖ చున్నీతో ముఖేశ్‌ ఉరేసుకుని మరణించాడు.

మహిళా సెక్రటరీతో ఎఫైర్‌
ఆ సమయంలో రేఖ నటించిన ‘శేష్‌నాగ్‌’ విడుదలైతే జనం పోస్టర్ల మీద పేడ కొట్టారు. రేఖ భర్త మరణానికి ఆమె తన సెక్రటరీయే ప్రపంచంగా బతకడమనే పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. ఇకపోతే రేఖ జీవిత కథను రచయిత యాజీర్‌ ఉస్మాన్‌ ఓ పుస్తకంగా తీసుకొచ్చాడు. ఇందులో రేఖకు తన మహిళా సెక్రటరీతో ఉన్న సంబంధాన్ని బట్టబయలు చేశాడు. ఎవరితో ఎంత చనువుగా ఉన్నా సరే రేఖ బెడ్‌రూమ్‌లోకి అడుగుపెట్టే స్వేచ్ఛ, అధికారం ఒక్క ఫర్జానాకు మాత్రమే ఉండేదట. ఈవిడ రేఖ దగ్గర వ్యక్తిగత సెక్రటరీగా పని చేసేది. ఫర్జానా ఏది చెప్తే అదే చేసేది రేఖ. వీరిద్దరూ మూడు దశాబ్దాలపాటు కలిసి పని చేశారు.

ఆమె లేకుండా రేఖ బతకలేదా?
రేఖ ఎంత పెద్ద హీరోయిన్‌ అయినా సరే, తన సెక్రటరీ అనుమతి లేనిదే ఒక్క అడుగు కూడా ముందుకు వేసేది కాదు. రేఖ భర్త ముఖేశ్‌ మరణానికి ఫర్జానాయే కారణమని సదరు పుస్తకంలో పరోక్షంగా ప్రస్తావించారు. 'రేఖకు ఫర్జానా సరైన జోడి. ఆమె తన స్నేహితురాలు, మద్దతురాలు.. తన ప్రపంచం. సింపుల్‌గా చెప్పాలంటే ఆమె లేకుండా రేఖ బతకలేదు' అని పుస్తకంలో పొందుపరిచారు. రేఖ ఆమెతో సహజీవనం చేసిందని అందరూ అంటుంటే.. తను మాత్రం ఆమెను సొంత సోదరిలా భావిస్తానని ఎప్పుడూ చెప్పుకొచ్చేది.

చదవండి: నో అంటే నో అంతే.. ఇంక ఎక్కువ వాగద్దు.. విశ్వక్‌ ట్వీట్‌ బేబి డైరెక్టర్‌నుద్దేశించేనా?
తమన్నాతో పెళ్లి.. ఇంట్లో ఒత్తిడి ఎక్కువైందన్న విజయ్‌ వర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement