ప్రేమ ‘కుల’ చిచ్చు
సేలం: సేలం, ధర్మపురి పరిసరాల్లో ప్రేమ వ్యవహారాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తూ వస్తున్నాయి. ఇప్పటికే కులాంతర ప్రేమ వ్యవహారాలకు ఇలవరసన్, గోకుల్ రాజ్‌లు బలి అయ్యారు. ఈ ఘటనలు పెను కలకలాన్ని సృష్టించాయి. తాజాగా, ఆ జాబితాలో సయ్య ద్ ఇంతియాజ్ చేరాడు. ఓమలూరు కోమలికి చెందిన సయ్యద్ ఇంతియాజ్(22) ఆటో డ్రైవర్. గురువారం ఉదయం ఇతడి మృతదేహం రైల్వే ట్రాక్ వద్ద బయట పడింది. మృత దేహానికి ఆగమేఘాలపై పోస్టుమార్టం పూర్తి అయింది. తమ వాడు మృతి సమాచారంతో సేలంకు ఉరకలు తీసిన కుటుం బీకులు, ఇది ముమ్మాటికి హత్యేనని ఆరోపించారు. సమాచారం అందుకున్న మైనారిటీ సంఘాలు, వీసీకే పార్టీ వర్గా లు జిహెచ్ వద్దకు చేరుకున్నాయి.
సయ్యద్ ఓమలూరులో ఓ కులానికి చెందిన యువతిని ప్రేమిస్తూ వచ్చినట్టుగా, గత వారం ఆ యువతి బంధువులు ఆటో స్టాండ్‌కు వచ్చి బెదిరించి వెళ్లినట్టు మైనారిటీ సంఘాలు పేర్కొంటున్నాయి. బుధవారం రాత్రి సయ్యద్‌ను హతమార్చి రైలు పట్టాలపై పడేసి ఉన్నారని, అతడి శరీరం మీదున్న గాయాలను చూస్తే అది హత్య అన్నది స్పష్టం కాక తప్పదని వాపోయారు. ఈ కేసును హ త్య కేసుగా నమోదు చేయాలని కోరు తూ, మైనారిటీ సంఘాలు, వీసీకే వర్గాలు శుక్రవారం ఉదయం కలెక్టరేట్‌లో నిరసన తెలియజేశారు.
కలెక్టర్‌ను కలవడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొని ఉన్నది. హత్య కేసు నమోదు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపు నిస్తామని మైనారిటీ సంఘాలు, వీసీకే వర్గాలు హెచ్చరికలు జారీ చేసి ఉన్నాయి. సయ్యద్ మృత దేహానికి రీ పోస్టుమార్టం సైతం జరపాలని డిమాండ్ చేస్తున్నాయి.