కొత్తగా ఏర్పడ్డ తెలంగాణను తమ ప్రభుత్వం అభివృద్ధి పథంలో తీసుకెళుతోందని, రాష్ట్రానికి మేలు చేసినంతకాలం ఎన్డీయేకు అంశాలవారీ మద్దతు కొనసాగుతుందని, అలా కాని పక్షంలో ఆ కూటమిపై కూడా పోరాటం చేస్తామని చెప్పారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న బీజేపీ లక్ష్యం గురించి ప్రశ్నించగా, రాష్ట్రంలో బీజేపీని గట్టి ప్రత్యర్థిగా భావించడం లేదన్నారు.
ఎన్డీయేలో చేరం: జితేందర్
Published Thu, Aug 17 2017 3:45 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
హైదరాబాద్: తమ పార్టీకి ఎన్డీయే కూటమిలో చేరే ఉద్దేశం లేదని టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నాయకుడు జితేందర్‌రెడ్డి స్పష్టంచేశారు. అయితే కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వానికి అంశాలవారీ మద్దతు కొనసాగుతుందని బుధవారం ఆయన తెలిపారు. అలాగే కాంగ్రెస్ నాయకత్వంలోని 16 విపక్ష పార్టీల కూటమిలో చేరే ఉద్దేశంకూడా లేదని పేర్కొన్నారు.

Advertisement