హైదరాబాద్ ఏ ఒక్కరిదీ కాదు:కేటీఆర్
హైదరాబాద్: నగర అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని టీఆర్ఎస్ ఎమ్మెల్మే కేటీఆర్ స్పష్టం చేశారు. అభివృద్ధిలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డుతో రీజనల్ రింగ్ రోడ్డులను ఏర్పాటు శాటిలైట్ టౌన్ షిప్ లను కూడా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.మంగళవారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. హైదరాబాద్ అభివృద్ధికి ఒక ప్రత్యేకమైన ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. హైదరాబాద్ ఏ ఒక్కరిదీ కాదని.. అంతర్జాతీయ నగరంగా అభివృద్ధే తమ ముందున్న లక్ష్యమన్నారు.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉన్నా.. తెలంగాణకు వచ్చిన ఇబ్బందేమీ లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మెట్రో రైలు విస్తరణను 70నుంచి 200కి.మీ వరకు పెంచుతామన్నారు.