మతతత్వ పార్టీలతో చేతులు కలపం: కేసీఆర్
కరీంనగర్: మతతత్వ పార్టీలతో చేతులు కలపమని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ స్సష్టం చేశారు. ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకోమని కేసీఆర్ అన్నారు. థర్ట్ ఫ్రంట్‌లో టీఆర్‌ఎస్ భాగస్వామ్యం అవుతుందని ఆయన అన్నారు. ఆదివారం కరీంనగర్‌లో జరిగిన సమర శంఖారావం సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. భవిష్యత్‌లో ఎన్డీఏలో భాగస్వామ్యం కాబోం అని ప్రకటించారు.
ఏన్డీఏలో చేరే ప్రశ్నేలేదని తేల్చిచెప్పారు. అవసరమైతే ఎన్నికల తర్వాత థర్డ్‌ఫ్రంట్‌లో చేరతామన్నారు. ఇప్పటికే తనతో తమిళనాడు సీఎం జయలలిత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. నూటికినూరు శాతం టీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రాంతీయ పార్టీలే రాజ్యమేలుతాయని కేసీఆర్ జోస్యం చెప్పారు. తెలంగాణ పునర్ నిర్మాణంలో టీఆర్ఎస్ కీలక పాత్ర వహిస్తుందన్నారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో టీఆర్ఎస్ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.