జగన్ విజయంలోనే ప్రజా సంక్షేమం: వైఎస్ విజయమ్మ
గుంటూరు: వైఎస్ జగన్మోహనరెడ్డి విజయంలోనే ప్రజాసంక్షేమం ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. నాదెండ్ల సభలో వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన పథకాలు ప్రజలకు జగనన్న ద్వారానే తిరిగి అందుతాయని విజయమ్మ అన్నారు.
తన పాలనలో ప్రజలకు ఏం చేశాడో చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని విజయమ్మ ప్రశ్నించారు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడని విజయమ్మ అన్నారు. మీ జగనన్నను మీరే గెలిపించుకోండని ప్రజలకు వైఎస్ విజయమ్మ విజ్క్షప్తి చేశారు.