సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఏడువిడతలుగా జరిగిన లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. లోక్‌సభ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ దిగ్విజయంగా ముగిసింది. దీంతో లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పలు మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెలువరిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ ఇవి..
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి వీడీపీ అసోసియేట్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలోనూ వైఎస్సార్‌సీపీకి విస్పష్టమైన మెజారిటీ లభించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 44శాతం ఓట్లతో వైఎస్సార్‌సీపీ 111 నుంచి 121 సీట్లు సాధిస్తుందని, అధికార టీడీపీ 39.10 ఓట్లతో 54 నుంచి 60 స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించింది. 10. 6 శాతం ఓట్లతో జనసేన సున్నా నుంచి నాలుగు స్థానాలకు పరిమితం అవుతుందని ఈ సర్వే స్పష్టంచేసింది.
ఉత్తరాదిలో తిరుగులేని మోదీ
- వివిధ సర్వే సంస్థలు ఇప్పటివరకు ప్రకటించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూసుకుంటే.. పశ్చిమ బెంగాల్‌లో మరోసారి దీదీ కొనసాగనుందని స్పష్టమైంది. ఇక, ఉత్తరాది రాష్ట్రాల్లో నరేంద్రమోదీ ఛరిష్మాకు తిరుగులేదని స్పష్టమైంది. రాష్ట్రాల వారీగా చూసుకుంటే వివిధ మీడియా సంస్థలు ఇప్పటివరకు ప్రకటించిన సర్వే ఫలితాలివి..
- టైమ్స్ నౌ- వీఎమ్మార్ సర్వే ప్రకారం..
ఉత్తరప్రదేశ్.. మొత్తం 80 సీట్లు : బీజేపీ - 56, ఎస్పీ-బీఎస్పీ-ఆరెల్డీ - 20 సీట్లు, కాంగ్రెస్- 2
రాజస్థాన్.. మొత్తం 25 సీట్లు: బీజేపీ - 21, కాంగ్రెస్ - 4 - న్యూస్-18 - ఐపీఎస్ ఓఎస్ సర్వే ప్రకారం..
పశ్చిమ బెంగాల్.. మొత్తం సీట్లు 42: తృణమూల్ కాంగ్రెస్ 25 - 28, బీజేపీ 3 -7, ఇతరులు 5 -7
కర్ణాటక.. మొత్తం సీట్లు 28: బీజేపీ 21-23, కాంగ్రెస్-జేడీఎస్ 5-3 - ఇండియా టుడే యాక్సిస్ సర్వే ప్రకారం..
మహారాష్ట్ర.. మొత్తం సీట్లు 48: బీజేపీ 38 - 42, కాంగ్రెస్-ఎన్సీపీ 6 - 10
గుజరాత్.. మొత్తం సీట్లు 26 : బీజేపీ 20 - 26, కాంగ్రెస్ 0-6 - ఇండియా టీవీ సర్వే ప్రకారం.. ఢిల్లీలోని ఏడు సీట్లను బీజేపీ క్లీన్‌స్వీప్
(చదవండి: కేంద్రంలో మళ్లీ ఎన్డీయే)
- న్యూస్-18 - ఐపీఎస్ ఓఎస్ ఎగ్జిట్ పోల్ సర్వే : తెలంగాణలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌దే పైచేయి అని ఈ సర్వే పేర్కొంది. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌కు 12-14 సీట్లు వస్తాయని, కాంగ్రెస్‌కు 1 నుంచి 2 సీట్లు, బీజేపీకి 1 నుంచి 2 సీట్లు, ఎంఐఎంకు ఒక సీటు వస్తుందని ఈ సర్వే అంచనా వేసింది.
- ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వేలోనూ వైఎస్సార్‌సీపీ తిరుగులేనిరీతిలో సత్తా చాటింది. ఏపీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తిరుగులేని జనాదరణను చాటుతూ.. ఆయన నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీకి 132 నుంచి 135 సీట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. ఇక అధికార టీడీపీకి 37 నుంచి 40 సీట్లు వస్తాయని తెలిపింది. జనసేన సున్నా నుంచి ఒక స్థానం సాధిస్తుందని పేర్కొంది.
- రిపబ్లిక్ టీవీ - సీ ఓటర్ : కేంద్రంలో నరేంద్రమోదీ సర్కార్‌కు మరోసారి అవకాశం దక్కనుందని రిపబ్లిక్ టీవీ - సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ సర్వే అంచనా వేసింది. ఈ సర్వే అంచనాల ప్రకారం ఎన్డీయేకు 287, యూపీఏకు 128, ఇతరులకు 127 సీట్లు వస్తాయని పేర్కొంది.
- న్యూస్ నేషన్ ఎగ్జిట్ పోల్ సర్వే: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి సాధారణ మెజారిటీ వస్తుందని ఈ సర్వే అంచనా వేసింది. ఈ సర్వేలో ఎన్డీయేకు 282 నుంచి 290 సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు 118 నుంచి 120 సీట్లు, ఇతర ప్రాంతీయ, జాతీయ పార్టీలకు 130 నుంచి 138 సీట్లు వస్తాయని పేర్కొంది.
- ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా నిర్వహించిన ఎగ్జిట్ సర్వేలో వైఎస్సార్‌సీపీ తిరుగులేని మెజారిటీ సాధించింది. ఈ సర్వేలో వైఎస్సార్సీపీకి 18 నుంచి 20 లోక్‌సభ స్థానాలు వస్తాయని, టీడీపీకి నాలుగు నుంచి ఆరు స్థానాలు మాత్రమే వస్తాయని, ఇతరులకు సీట్లేమీ రావని అంచనా వేసింది.
- టైమ్స్‌నౌ - వీఎమ్మార్ ఎగ్జిట్ పోల్ సర్వేలో ఎన్డీయే కూటమి ఆధిక్యాన్ని సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 272 కాగా, ఎన్డీయేకు 306 సీట్లు, యూపీఏకు 132 సీట్లు, ఇతరులకు 104 సీట్లు వస్తాయని పేర్కొంది.
- న్యూస్-18 చానెల్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో వైఎస్సార్సీపీకి 13 నుంచి 14 సీట్లు రాగా, టీడీపీకి 10 నుంచి 12 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇతరులు సున్నా నుంచి ఒక సీటు గెలుస్తారని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment