Election 2019 Exit Polls
-
ఎగ్జిట్ పోల్‌నిజమెంత?
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ఎగ్జిట్ పోల్స్ చాలావరకు ఎన్డీయే విజయాన్ని, నరేంద్ర మోదీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడతారనే అంచనా వేశాయి. ఇప్పుడు ఫలితాలు దాదాపుగా వెల్లడి అయ్యాయి. దీంతో ఎవరి ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమయ్యాయి, ఎంత ఖచ్చితత్వంతో వాస్తవ రూపం దాల్చాయని పరిశీలించేందుకు అవకాశం ఏర్పడింది. 2019 ఎన్నికల్లో ఆధిక్యాలను పరిశీలిస్తే.. ఎన్డీయే 347, యూపీఏ 90, ఇతరులు 105 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. దీనిని బట్టి చూస్తే ఇండియా టుడే–మై ఆక్సిస్, చాణక్య–న్యూస్24 అంచనాలు చాలావరకు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి. ఎన్డీయేకి 339 నుంచి 365 సీట్లు వచ్చే అవకాశం ఉందని, అలాగే యూపీఏకి 77–108, ఇతరులకు 69–95 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఇండియా టుడే పేర్కొంది. కానీ చాణక్య సరిగ్గా అంచనా వేసింది. ఎన్డీయేకి 350, యూపీఏకి 95, ఇతరులకు 97 వస్తాయని స్పష్టమైన అంకెలు ఇచ్చింది. ఒకవేళ ఆధిక్యతలే కనుక య«థాతథంగా ఫలితాలుగా మారినట్టయితే చాణక్యకి, ఎన్డీయే సంఖ్య (350)కి మధ్య కేవలం మూడు సీట్ల తేడాయే ఉంటుంది. అలాగే యూపీఏ సంఖ్య (95)కు 5, ఇతరుల సంఖ్య (97)కు 8 సీట్ల తేడా మాత్రమే ఉంటుంది. అయితే ఎన్డీయే, యూపీఏ ట్యాలీలు రెండూ కూడా ఇండియా టుడే అంచనా వేసిన సీట్ల పరిధిలోనే ఉండటం గమనార్హం. గత ఎన్నికలను పరిశీలిస్తే.. ► 2004లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ పూర్తిగా తల్లకిందులయ్యాయి. వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తే కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ విజయం సాధించింది. ► 2009లో అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేపై యూపీఏకి స్వల్ప మెజారిటీ వస్తుందని అంచనా వేశాయి. కానీ ఆయా సంస్థల అంచనాలు మరోసారి తప్పయ్యాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 100కు పైగా సీట్ల మెజారిటీ సాధించింది. ► 2014లో అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే విజయాన్ని ఊహించాయి. అయితే టుడేస్ చాణక్య మినహా ఏదీ కూడా నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ సొంతంగా స్పష్టమైన మెజారిటీతో అధికారం చేపడుతుందని చెప్పలేకపోయాయి. అసలు ఫలితాలు వచ్చేశాయి.. మరి వివిధ చానళ్లలో ప్రసారమైన ఎగ్జిట్ పోల్స్‌లో ఏది నిజమయ్యాయి? ఏది తప్పాయి? జనం మూడ్‌ను అవి పసికట్టగలిగాయా. -
మోదీకి ఇమ్రాన్ ఖాన్ అభినందనలు
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో మరోసారి గెలుపొందడంతో ప్రధాని నరేంద్ర మోదీని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభినందించారు. దక్షిణాసియాలో శాంతి, పురోగతి కోసం తాను మోదీ ప్రభుత్వంతో పనిచేసేందుకు సిద్ధమని ఈ సందర్భంగా ఇమ్రాన్ ట్వీట్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే అత్యధిక మెజారిటీతో దూసుకువెళ్లిన సంగతి తెలిసిందే. బీజేపీ సొంతంగా మేజిక్ మార్క్ 272 స్ధానాలు దాటి 300 స్ధానాలు గెలుపొందే దిశగా ఫలితాలు సాధిస్తోంది. ఏడు దశల్లో పోలింగ్ జరిగిన 542 లోక్‌సభ స్ధానాలకు గాను బీజేపీ ఇప్పటికే 14 స్ధానాల్లో గెలుపొంది మరో 288 స్ధానాల్లో ఆధిక్యత కొనసాగిస్తోంది. -
‘సర్వే అనకుండా.. లగడపాటిని లోపలేయాలి’
సాక్షి, అమరావతి : కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్ సర్వే పేరుతో బయటపెట్టిన వివరాలకు ఆధారాలు చూపాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ట్విటర్ వేదికగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, లగడపాటిపై ధ్వజమెత్తారు. లగడపాటి ఎవరెవరిని ఇంటర్వ్యూ చేశారు.. ఎన్ని శాంపిల్స్ తీసారు? శాస్త్రీయంగా విశ్లేషించడానికి చేపట్టిన పద్ధతేమిటో వెల్లడించాలన్నారు. లేక పోతే చీటింగ్ కేసు నమోదు చేసి లోపలేయాలన్నారు. ఇంకో సారి సర్వే అనకుండా గుణపాఠం నేర్పాలని ట్వీట్ చేశారు. వీవీప్యాట్లు లెక్కించాలని చంద్రబాబు చేస్తున్న హడావుడి ఆయననో జోకర్ స్థాయికి తీసుకెళ్లిందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. గత డిసెంబరులో కాంగ్రెస్ 3 హిందీ రాష్ట్రాల్లో గెలిచినపుడు ఈవీఎంలు, వీవీప్యాట్ల గురించి మాట్లాడని వ్యక్తి ఇప్పుడు క్షణం తీరిక లేకుండా కోర్టుల చుట్టూ, నేతల చుట్టూ ప్రదక్షిణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఏపీ ఫలితంపై ఆసక్తి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఎగ్జిట్ పోల్స్ ద్వారా ప్రజాతీర్పుపై స్పష్టత వచ్చిన సంగతి తెలిసిందే. ఒకట్రెండు తప్ప అన్ని సర్వేలూ జగన్‌కే పట్టంగట్టాయి. లగడపాటి చిలక జోస్యాన్ని నమ్ముకున్న టీడీపీ ఊహలకు నేటి మధ్యాహ్నంతో తెరపడనుంది. ఏప్రిల్ 11న తొలి దశలో ఎన్నికలు జరిగినప్పటికీ.. దేశవ్యాప్తంగా వివిధ దశల్లో ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఫలితాల కోసం వేచిచూడాల్సి వచ్చింది. దీంతో ఈ 41రోజులపాటు నెలకొన్న టెన్షన్‌కు మరికొద్దిగంటల్లో తెరపడనుం ది. 175 అసెంబ్లీ స్థానాలకు 2,118 మంది బరిలో ఉండగా.. 25 ఎంపీ స్థానాలకు 319 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. టీడీపీ, కాంగ్రెస్, జనసేన పార్టీలు లోపాయకారి ఒప్పందం తో పోటీ చేయగా..వైఎస్సార్సీపీ ఒంటరిగానే బరి లో దిగింది. మధ్యాహ్నం 12 కల్లా ఫలితాలపై దాదాపు స్పష్టమైన అంచనా వెలువడనుంది. దీంతో తెలంగాణతోపాటు ఏపీ పరిణామాలపైనా తెలుగుప్రజల్లో ఉత్సుకత నెలకొంది. ఓట్ల లెక్కింపులో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గాల అభ్య ర్థుల భవితవ్యం అందరికంటే ముందుగా తేలి పోనుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో 13 రౌండ్ల లోనే ఓట్లలెక్కింపు పూర్తి కానుంది. కర్నూలు నియో జకవర్గంలో అత్యధికంగా 33 రౌండు పూర్తి చేయా ల్సి ఉన్నందున ఫలితం చివరన వెలువడే అవకాశ ముంది. పులివెందుల, నందిగామ, ఆళ్లగడ్డ, పెనమ లూరు, గన్నవరం, నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 30 రైండ్లకు పైగా పట్టే అవకాశం కనిపిస్తోంది. -
హస్తినలో హల్చల్
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు ఇచ్చిన తీర్పు వెల్లడి కావడానికి ఇంకా 24 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఓవైపు ఈవీఎంలలో నిక్షిప్తమైన తీర్పు ఏమై ఉంటుందా అంటూ దేశవ్యాప్తంగా అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా.. మరో వైపు హస్తినలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మంగళవారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఉత్సాహంతో విందు సమావేశం జరపగా.. విపక్షాల కూటమి ఈవీఎంల అం శంపై ఆందోళన భేటీలు నిర్వహించింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనుకూలంగా ఉండటంతో ఎన్డీయేలో జోష్ కనిపిస్తుండగా.. విపక్షాల్లో మాత్రం నైరాశ్యం అలముకుంది. 2014 కంటే కూడా ఎక్కువ సీట్లు వస్తాయంటూ ఎగ్జిట్ పోల్ ఫలితాలు అంచనా వేయడంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం రాత్రి ఇక్కడి అశోకా హోటల్లో ఎన్డీయేలోని కేంద్ర మంత్రి మండలి సభ్యులకు, ఎన్డీయే పక్షాల నేతలకు విందు ఏర్పాటు చేశారు. తాము తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ పనితీరుకు ఈ ఫలితాలు అద్దం పడు తున్నాయని ఈ సందర్భంగా విశ్లేషించుకున్నారు. అలాగే, ఫలి తాల వెల్లడి తర్వాత అనుసరించాల్సిన వ్యూహాల్ని చర్చించేం దుకు ఈ విందు సమావేశాన్ని వేదికగా చేసుకున్నారు. ఒకవేళ వాస్తవ ఫలితాల్లో తమకు సంఖ్యాబలం తగ్గిన పక్షంలో విపక్ష కూటమిలోని పార్టీలను గానీ.. ఎన్డీయేతర, యూపీయేతర పార్టీలను గానీ ఆహ్వానించేందుకు బీజేపీ సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతకుముందు ప్రధాని మోదీ తన కేబినెట్ సహచరులతో భేటీ అయ్యారు. ఈ రెండు సమావేశాల్లోనూ ఆయన చాలా ఉత్సాహంగా కనిపించినట్టు సమాచారం. ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజం అవుతాయని ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్టు సమాచారం. డీలాపడిన విపక్షాల కూటమి... యూపీయే కూటమి 130 స్థానాలకు మాత్రమే పరిమితమవు తుందని, ఈ కూటమితో భావసారూప్యం ఉన్న పార్టీల బలం కూడా 40 సీట్లకు మించదని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించ డంతో కేంద్రంలో ఎన్డీయేతర ప్రభుత్వం రావడం అసాధ్యమన్న వాదనలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో 22 పార్టీల విపక్ష కూటమి నైరాశ్యంలో మునిగిపోయింది. ఈవీఎంల అంశంపై మంగళవారం ఢిల్లీలో జరిగిన విపక్షాల సమావేశానికి ప్రధాన పార్టీల అధినేతల నుంచి స్పందన కరువు కావడమే ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతోపాటు డీఎంకే అధినేత స్టాలిన్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వంటి ప్రధాన నేతలు ఈ భేటీకి హాజరు కాలేదు. ఎన్నికల సంఘంతో భేటీ అనంతరం మరోసారి కాన్స్టిట్యూషన్ క్లబ్లో విపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. ఎన్నికల ఫలితాల అనంతరం అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సందర్భంగా చర్చించాయి. అయితే, ఇంతటి కీలక సమావేశానికి ప్రధాన పార్టీల అధినేతలు రాకపోవడంతో విపక్షాల శిబిరం డీలాపడినట్టు స్పష్టంగా కనిపించింది. కలిసొస్తారా.. ‘చే’జారుతారా? ఎన్డీయేకి అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు విపక్ష కూటమిలోని పలు పార్టీల నేతలను పునరాలోచనలతో పడేశాయి. ముఖ్యంగా వ్యక్తిగత రాజకీయ ఆకాంక్షలు ఉన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌లు విపక్ష కూటమితో కలిసొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్డీయేతర ప్రభుత్వానికి సారథ్యం వహించాలన్న ఆకాంక్షతో ఉన్న మాయావతి.. ఎగ్జిట్ పోల్ ఫలితాలతో తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. వాస్తవానికి ఫలితాలు విపక్షాల వైపు మొగ్గు చూపినా మాయావతి సారథ్యాన్ని కాంగ్రెస్ అంగీకరించే పరిస్థితి లేదని ఢిల్లీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మాయావతి సారథ్యానికి మద్దతు ఇస్తున్నట్టు సమాజ్‌వాదీ పార్టీ కనిపిస్తున్నా.. లోపల మాత్రం వారి ఆలోచన వేరుగా ఉందని అంటున్నారు. బీఎస్పీ గానీ మాయావతి గానీ బలోపేతమయ్యే పరిస్థితి వస్తే తమ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని ఎస్పీ నేతలు భావిస్తున్నారు. అందువల్ల వారి మొగ్గు విపక్ష కూటమి వైపు కంటే ఎన్డీయే వైపే ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే కేసులో ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్‌లకు సీబీఐ క్లీన్చిట్ ఇచ్చిందన్న వార్తలతో సమాజ్‌వాదీ పార్టీ కూడా విపక్ష కూటమితోపాటు ఉండే అవకాశం కష్టమనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఎస్పీ, బీఎస్పీల్లో ఏదో ఒక పార్టీ విపక్ష కూటమితో కొనసాగే పరిస్థితి లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు ఏ కూటమి చేరువలో ఉంటే ఆ కూటమివైపే ఇతర పార్టీలు చేరువ కావడానికి మొగ్గు చూపిస్తాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలన్నీ తమ రాష్ట్రాల ప్రయోజనాల మేరకు షరతులతో కూడిన మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ములాయం, అఖిలేష్‌కు క్లీన్‌చిట్‌పై అనుమానాలు... ములాయంసింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ క్లీన్చిట్ ఇచ్చిందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం కలిగించాయి. ఫలితాల తర్వాత వారి అవసరం ఉంటుందేమోనని భావించే ఎన్డీయే తెరవెనక రాజకీయం నడిపి ఉంటుందని ఆయా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంలో వివిధ పార్టీల బలబలాలను ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఒక్కో సంస్థ ఒక్కో రకంగా చూపడాన్ని కూడా విపక్షాలు ప్రస్తావిస్తున్నాయి. దీనివెనుక ఏదో మతలబు ఉందని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే విపక్ష కూటమి ఆశలను సజీవంగా ఉంచేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ఈవీఎం ఓట్లకు, వీవీప్యాట్ స్లిప్పులకు మధ్య వ్యత్యాసం ఉన్నప్పుడు సంబంధిత నియోజకవర్గంలో మొత్తం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చాలని డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్‌ను మంగళవారం ఈసీ ముందుంచింది. తమ డిమాండ్‌ను ఈసీ పరిష్కరించని పక్షంలో బుధవారం ఈసీ కార్యాలయం ముందు ధర్నా చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. గురువారం ఓట్ల లెక్కింపు కావడంతో ఈ పరిణామాలన్నీ ఉత్కంఠ రేపుతున్నాయి. త్యాగానికి కాంగ్రెస్ సిద్ధం? ఫలితాల్లో ఎన్డీయేకి కొన్ని సీట్లు తక్కువైతే ఎస్పీ, బీఎస్పీల్లో ఒక పార్టీ ఎన్డీయేవైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు విశ్లే షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ మళ్లీ అధికారంలోకి రాకూడ దని కాంగ్రెస్ భావిస్తే ఎలాంటి త్యాగానికైనా ఆ పార్టీ సిద్ధపడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కర్ణాటకలో తక్కువ సంఖ్యలో సీట్లు సాధించినప్పటికీ, జేడీఎస్‌కు ప్రభుత్వ సారథ్య బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది. కేంద్రంలో కూడా అదే పరిస్థితి వస్తే మాయావతి లేదా మమత రేసులో ముందుండే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఎన్డీయే అధికారంలోకి రాకుండా చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. కాంగ్రెస్ రాజ్యసభ పక్ష నేత ఆజాద్ పలు పార్టీల నేతలతో సంప్ర దింపులు జరుపుతున్నట్టు సమాచారం. కేసీఆర్ సహా ఫెడరల్ ఫ్రంట్ నేతలతోనూ ఆయన చర్చలు జరుపుతున్నారని తెలిసింది. -
మోదీ భారీ విజయానికి ఐదు కారణాలు!
సాక్షి, న్యూఢిల్లీ : 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ అనుకూల పవనాలు వీచినప్పుడు బీజేపీకి 282 లోక్‌సభ సీట్లురాగా, ఈసారి అనుకూల పవనాలు లేనప్పటికీ, పలు రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేకత ఉన్నప్పటికీ వచ్చే సీట్లు 287 దాటుతాయని అన్ని సర్వేలు సూచించడానికి కారణాలు ఏమిటీ ? అన్న ప్రశ్నకు అందుకు ఐదు సమాధానాలు ఉన్నాయని సామాజిక, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 1. నరేంద్ర మోదీకున్న వ్యక్తిగత ప్రతిష్ట. నేడు నరేంద్ర మోదీ పేరు తెలియని వారు దేశంలో లేరంటే అతిశయోక్తి కాదు. టీవీల ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు పరిచయం. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికి ఓటేస్తారని ఎన్నికల ముందు ప్రశ్నించగా, మోదీకని సమాధానం ఇచ్చారట. ఏ పార్టీకి ఓటేస్తారంటే మోదీ పార్టీకి అని సమాధానం ఇచ్చారట. అంటే పార్టీకన్నా ఆయనకే ప్రజలు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. అందుకనే ఈసారి కూడా బీజేపీ మోదీ కేంద్రంగానే ఎన్నికల ప్రచారాన్ని సాగించింది. ఆయన పట్ల ప్రజలు ఆకర్షితులవడానికి ప్రధాన కారణం ఆయన మాటలే. ప్రసంగంలో ఆయన నొక్కి నొక్కి చెప్పే మాటలు ముక్కుసూటిగా మాట్లాడుతున్నట్లు ఉంటాయట. ఆయన చెప్పే మాట నోటి నుంచి కాకుండా హదయం నుంచి వచ్చినట్లు ఉంటుందట. దేశం కోసం, దేశ ప్రజల కోసం ఎంతటి కఠినమైన నిర్ణయమైన తీసుకునే మనస్తత్వం కూడా ఆయన పట్ల ప్రజాదరణ పెంచిందట. పెద్ద నోట్ల రద్దే అందుకు ఉదాహరణగా చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలకు నష్టమే జరిగినప్పటికీ దేశం కోసం నిర్ణయం తీసుకున్నందున దాన్ని పట్టించుకోవడం లేదట. మరో అవకాశం ఇచ్చి చూద్దాం అంటున్నారట. 2. పాకిస్థాన్‌పై భారత వైమానిక దాడులు: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళాలు పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి బాలకోట్‌లోని ఉగ్రవాదుల స్థావరాన్ని ధ్వంసం చేయడం మోదీకి ఓటు వేయడానికి రెండో కారణం అట. కాంగ్రెస్ పార్టీకి కూడా అలాంటి దాడులు ఇంతకుముందు జరిపిందనే విషయాన్ని ప్రజల దష్టికి తీసుకెళ్లినప్పుడు ‘కాంగ్రెస్ వారు ఆ విషయాన్ని అప్పుడే ప్రకటించి ఉండాల్సింది. అయినా వారు చిన్న చిన్న దాడులు జరిపి ఉంటారు. మోదీ తరహాలో ‘గుస్ గుస్ కే మారా’ జరిపి ఉండరు’ అని వారన్నారట. మోదీ నోటి నుంచి వచ్చిందంటే అది నూటికి నూరుపాళ్లు నిజమై ఉంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారట. 3. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు పక్కా ఇళ్లు నిర్మించడం, స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద వెనకబడిన రాష్ట్రాల్లో మరుగుదొడ్లు నిర్మించడం, ఉజ్వల యోజన కింద పేద మహిళలకు వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం వల్ల కూడా మోదీ ప్రతిష్టను గణనీయంగా పెంచాయట. 4. మెజారిటీ జాతీయ వాదం. దేశంలోని ముస్లింలకు వ్యతిరేకంగా జాతీయవాదం పేరిట హిందువులు ఒక్కటయ్యారట. బీజేపీయే కాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హిందూత్వను ప్రచారం చేయడం, ఆయన దేశంలోని హిందూ పుణ్య క్షేత్రాలు తిరిగి రావడం హిందువులను ఎంతో ఆకర్షించిందట. 5. సరైన ప్రత్యామయ నాయకుడు లేకపోవడం. ప్రతిపక్షంలో మోదీకి సరితూగే ప్రత్యామ్నాయ నాయకుడు కనిపించక పోవడం. మోదీ ముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంకా చిన్న కుమారిడిగానే కనిపించారట. పైగా ఆయన ప్రచారంలోగానీ ఆయన ఆలోచనల్లోగానీ కొత్తదనమేదీ కనిపించలేదట. అదే బీహార్‌లోని బేగుసరాయ్ నుంచి సీబీఐ అభ్యర్థిగా పోటీ చేసిన కన్హయ్య కుమార్ తాను ‘నేత నహీ బేటా’ అంటూ ప్రచారం చేయడం ప్రజలకు ఎక్కువ నచ్చినదట. అలాంటి ఆకర్షణీయమైన ప్రచారం రాహుల్ గాంధీ చేయక పోవడమూ ఆ పార్టీ ఓటమికి ఓ కారణమే అని సామాజిక, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఐదు కారణాల వల్ల గతంకంటే బీజేపీకి ఈసారి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందన్నది వారి వాదన. -
ఎగ్జిట్ పోల్ ఫలితాలను బాబు జీర్ణించుకోలేక పోతున్నారు
-
ఎగ్జిట్‌పోల్స్‌తో ఫుల్ జోష్‌లో ఎన్డీఏ
-
విపక్షాల సమావేశానికి రాహుల్ డుమ్మా
సాక్షి, న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత విపక్షపార్టీలు ఢీలా పడినట్టు కనిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి గెలుస్తుందని ఎగ్జిట్స్ పోల్స్ ఫలితాలు ప్రకటించడంతో హస్తినలో రాజకీయా సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. విపక్షపార్టీల మధ్య దూరం పెరిగిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విపక్షాల సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రవర్తించిన తీరు, 50 శాతం వీవీప్యాట్ల లెక్కింపుపై చర్చించేందుకు మంగళవారం స్థానిక కాన్స్టిట్యూషన్ క్లబ్లో విపక్షాల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అనంతరం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని నేతలు అభిప్రాయపడ్డారు. అయితే రాహుల్, పశ్చిమబెంగాల్, కర్ణాటక సీఎంలు మమతా బెనర్జీ, కుమారస్వామి, యూపీ ఆగ్రనాయకులు అఖిలేష్ యాదవ్, మాయావతి ఎన్సీపీ అధ్యక్షుడు శరదపవార్‌లు సమావేశానికి హాజరుకాకపోవడం గమనార్హం. కాగా, ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల అధినేతలు తమ పార్టీల ప్రతినిధులను పంపించారు. ఈ సమావేశానికి అజాద్, అహ్మద్ పటేల్(కాంగ్రెస్), సీతారం ఏచూరి(సీపీఎం), కనిమొళి(డీఎంకే), సుధాకర్ రెడ్డి, డి. రాజా(సీపీఐ), రాంగోపాల్ యాదవ్(ఎస్పీ), కేజ్రీవాల్(ఆప్)లు హాజరయ్యారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ముగిసిన విపక్షాల భేటీ వివిధ పార్టీల అధినేతలు డూమ్మ -
ప్రజల నాడి తెలియకుండా ఏం సర్వేలు చేస్తారు..
-
లగడపాటి సర్వేపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వేపై మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లగడపాటి సర్వేతో ఎంతో మంది వీధినపడ్డారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో ఆయన చేసిన సర్వే ఆధారంగా పందేలు కాసి కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారని తెలిపారు. లగడపాటి మాట నమ్మి సర్వనాశనమైపోయామని తనతో చాలా మంది చెప్పారన్నారు. ప్రజల నాడీ లగడపాటికి ఏం తెలుసు అని ప్రశ్నించారు. ‘ప్రజల నాడీ తెలిసినోడు ఎగ్జిట్ పోల్ చేయాల. ప్రతి ఒక్కరూ సర్వేలు చేసేస్తే ప్రమాదం ఉంది. తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్‌తో ప్రజలు కొన్ని కోట్ల రూపాయాలు నష్టపోయారు. వెయ్యి కోట్ల రూపాయల వరకు పందేలు కాశారు. వాళ్లంతా సర్వనాశనమైపోయార’ని అయ్యన్నపాత్రుడు అన్నారు. లగడపాటి రాజగోపాల్ సర్వేతో తెలుగుదేశం పార్టీ సంబరాలు చేస్తుంటే మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ విధంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. టీడీపీ ఓటమిని ఆయన చెప్పకనే చెప్పారని ప్రత్యర్థులు అంటున్నారు. (చదవండి: ఆంధ్రాలో జగన్ అద్భుత విజయం) సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
చంద్రబాబు ప్రవర్తన చిత్రవిచిత్రంగా ఉంది
-
‘టీడీపీ నేతలు పందికొక్కుల్లా తిన్నారు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే టీడీపీ నేతల అవినీతి స్కాంలను బయటపెడతామని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఐదేళ్ల పాలనలో వ్యవస్థల్నీ చంద్రబాబు భ్రష్టు పట్టించారని ఆరోపించారు. గత కొంతకాలంగా ఆయన ప్రవర్తన విచిత్రంగా ఉందని, అధికారులు, ఈవీఎం, వీవీప్యాట్ల అంశాలపై తగాదా పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దుర్మార్గమైన పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని, ఎగ్జిట్ పోల్స్‌ను చూసే చంద్రబాబుకు వణుకుపుట్టిందని అంబటి అభిప్రాయపడ్డారు. మే 23న ఫలితాలు చూస్తే తట్టుకోలేరన్నారు. కేంద్రంలో తమ పాత్ర ఏంటో మే 23 తరువాత వెల్లడిస్తామని స్పష్టంచేశారు. ఎన్నికల్లో ఓటమి సహజమేనని, ఓడినప్పుడు కూడా హుందాగా ఉండాలని హితవుపలికారు. తుంటరి ఆటగాళ్ల స్థాయికి చంద్రబాబు దిగజారిపోయారని విమర్శించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో అంబటి మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబుకి నూటికి వెయ్యి శాతం గెలుస్తామని చెప్పుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది. పోలింగ్ తర్వాత బాబు చిత్రవిచిత్రంగా ప్రవరిస్తున్నాడు. ప్రతీ అంశంపై నానా యాగీ చెస్తున్నారు. వీవీప్యాట్ అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అయినా కూడా చంద్రబాబు ఎందుకింత ఫ్రస్టేషన్‌కి గురవుతున్నారు. చంద్రబాబుకు ఏ వ్యవస్థపై నమ్మకం లేదు. 23న వచ్చే ఫలితాలును కూడా చంద్రబాబు నమ్మేలా లేరు. ఈసీపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంచి వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గెలిచినప్పుడు ఇవే ఈవీఎంలుకదా. ఓటమి అంగీకరించలేక ఈవీఎంలపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి కౌంటింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేతలు అల్లర్లు సృష్టిస్తే ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ధర్నా చేయడం ఏంటి?. కోర్ట్ స్పష్టంగా చెప్పినా ధర్నా చేస్తారా. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా మారరా?. బుద్దా వెంకన్న తొడ కొట్టి సవాలు చేస్తున్నారు. తొడలు కొట్టినోళ్లు రాజకీయాల్లో ఎక్కువ కాలం ఉన్న చరిత్ర లేదు. టీడీపీ నేతలు పందికొక్కుల్లా తిన్నారు.. అదంతా కక్కిస్తాం. శరద్ పవార్ ఫోన్ ఊహాగానాలే. జాతీయ రాజకీయాల్లో మా పాత్ర 23 సాయంత్రం క్లారిటీ వస్తుంది. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం’’ అని వ్యాఖ్యానించారు. -
రాహుల్, ప్రియాంక చాలా కష్టపడ్డారు : శివసేన
ముంబై : నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని పీఠం అలంకరిస్తారని బీజేపీ మిత్రపక్షం శివసేన ధీమా వ్యక్తం చేసింది. మంగళవారం తన అధికార పత్రిక సామ్నాలో ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంకల మీద కూడా ప్రశంసలు కురిపించింది. ‘ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయనే విషయం మాకు అనవసరం. ప్రజల ఉత్సాహం చూస్తూంటే నరేంద్ర మోదీనే మరోసారి ప్రధాని అవుతారనే నమ్మకం కల్గుతుంది. ఇక పోతే ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక చాలా కష్ట పడ్డారు. వారి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఈ సారి పార్లమెంట్లో కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేద’ని శివసేన పేర్కొంది. అంతేకాక ‘2014లో కాంగ్రెస్‌కు సరిపడా సీట్లు లభించకపోవడంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఈసారి తప్పకుండా ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ నుంచే ఉండబోతున్నారు. దీన్ని రాహుల్ విజయంగానే చెప్పుకోవాలి’ అని శివసేన అభిప్రాయపడింది. ఏడో దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేకు స్పష్టమైన ఆధిక్యతను కట్టబెట్టాయి. తరువాతి స్థానం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు దక్కనున్నట్లు సర్వేలు అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో బీజేపీతో జట్టుకట్టిన శివసేన పరోక్షంగా కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని చెబుతూనే ఆ పార్టీ బలమైన ప్రతిపక్షంగా నిలవబోతోందని అభిప్రాయపడింది. -
‘2 రోజుల్లో అధికారంలోకి వైఎస్సార్సీపీ’
సాక్షి, కర్నూలు: రాష్ట్రంలో రెండు రోజుల్లో తమ పార్టీ అధికారంలోకి రాబోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీ 130 సీట్లు గెలుస్తుందని ఆయన చెప్పారు. కర్నూలు జిల్లాలో రెండు పార్లమెంట్, 14 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఓడిపోతామన్న భయంతో చంద్రబాబు నాయుడు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తెలుగు దేశం పార్టీ కార్యాలయానికి టులెట్ బోర్డు తగిలించాల్సిందేనని ఎద్దేవా చేశారు. కౌంటింగ్ రోజున వైఎస్సార్సీపీ ఏజెంట్లు జాగ్రత్తగా ఉండాలని, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు కౌంటింగ్ హాల్లోనే ఉండాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియకు అడ్డంకులు కల్పించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. లగడపాటి రాజగోపాల్ తెలుగు దేశం పార్టీకి బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాట మార్చిన చంద్రబాబు: కాటసాని చంద్రబాబు ఓటమి భయంతో దేశంలో వివిధ నాయకులను కలిసేందుకు వెళ్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆరోపించారు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు నరేంద్ర మోదీని పొడిగిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చి ఆయనను విమర్శిస్తున్నారని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు ప్రజలను ఆకర్షించాయని తెలిపారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత చంద్రబాబుని లోకేష్ బాబు జాగ్రత్తగా చూసుకోవాలని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సూచించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని దొంగ సర్వేలను ప్రకటిస్తూ ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో పార్టీకి సేవలందించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలకు కర్నూలు లోక్‌సభ అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. -
నేడు ఢిల్లీలో యూపీఏ పక్షాల భేటీ
-
కౌంటింగ్ ప్రశాంతంగా జరిగెలా అన్ని చర్యలు చేపట్టాం
-
చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్ధలను నిర్వీర్యం చేస్తున్నారు
-
టిక్.. టిక్.. టిక్.. ఇక 48 గంటలే
సాక్షి, అమరావతి: ఓటరు దేవుడి నిర్ణయం వెల్లడయ్యేం దుకు ఇక 48 గంటలే మిగిలింది. ఆదివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ద్వారా ఇప్పటికే ప్రజాతీర్పు ఎలా ఉండనుందో తెలిసినా అధికారికంగా ఫలితాలు ప్రకటించే దాకా నిరీక్షణ తప్పదు. పోలింగ్ పూర్తయిన తరువాత ఓట్లు లెక్కించేందుకు గతంలో ఎప్పుడూ ఇన్ని రోజుల సమయం లేదు. రాష్ట్రంలో గత నెల 11వ తేదీన అసెంబ్లీకి, లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించినా చివరి దశ ఆదివారం ముగియడంతో ఓటర్ల తీర్పు కోసం ఈసారి ఏకంగా 43 రోజులు ఉత్కంఠగా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,118 మంది అభ్యర్ధులు ఎన్నికల్లో తలపడ్డారు. 25 ఎంపీ స్థానాలకు 319 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. వైఎస్సార్సీపీ ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే అన్ని స్థానాల్లో పోటీ చేసింది. టీడీపీ లోపాయికారీ పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగింది. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన పరస్పరం సహకరించుకున్నాయి. జగన్‌కు జైకొట్టిన ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌కే జనామోదం లభించినట్లు తేల్చి చెప్పాయి, దీంతో ఫలితాలపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. టీడీపీ మాత్రం లగడపాటి చిలక జోస్యాన్ని నమ్ముకుని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ ఊహలకు గురువారం మధ్యాహ్నాం తెరపడనుంది. ఈ నెల 23వతేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఓటింగ్ సరళి ద్వారా ఎవరి జాతకాలు ఏమిటో మధ్యాహ్నం కల్లా తేలనున్నాయి. వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాకే.. గురువారం ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. 8.30 గంటల నుంచి ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది. ఒక నియోజకవర్గంలో ఈవీఎంల లెక్కింపు అన్ని రౌండ్లు పూర్తయిన తరువాత ఐదు వీవీప్యాట్ యంత్రాలను లాటరీ విధానంలో ఎంపిక చేస్తారు. ఆ వీవీ ప్యాట్‌ల్లోని స్లిప్‌లను లెక్కించడం పూర్తయ్యాక నియోజకవర్గ ఫలితాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు తెలియజేసిన తరువాత అధికారికంగా వెల్లడిస్తారు. వీవీప్యాట్ యంత్రాల్లో స్లిప్‌లు లెక్కించడానికి సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో ఫలితాల వెల్లడికి ఆలస్యమైనా ఈవీఎంలు లెక్కించిన తరువాత అనధికారికంగా ఫలితం తెలుస్తుంది. -
ఆంధ్రాలో జగన్ అద్భుత విజయం
సాక్షి, అమరావతి, సాక్షి హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టించనుందని జాతీయ మీడియా చానళ్లు పునరుద్ఘాటించాయి. రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్ నిజాయితీ, నిబద్ధతకు పట్టంగట్టారని, మూడింట రెండు వంతులకుపైగా మెజార్టీతో ఆయన అత్యధిక స్థానాలను సాధిస్తారని పేర్కొన్నాయి. ఎగ్జిట్‌పోల్స్ విడుదలైన నేపథ్యంలో ‘ఇండియా టుడే’ సోమవారం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై చర్చావేదిక నిర్వహించింది. పలు టీవీ చానళ్లలోనూ ఈ అంశంపై చర్చ జరిగింది. ప్రముఖ సెఫాలజిస్టులు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు తదితరులు వైఎస్సార్సీపీని రాష్ట్ర ప్రజలు ఆదరించటానికి కారణాలను విశ్లేషించారు. ఏపీలో జగన్‌ను ఎదుర్కొనే ధైర్యంలేకే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలంటూ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని శివసేన పార్టీ పత్రిక ‘సామ్నా’ తాజా సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. చంద్రబాబు సర్కారు వైఫల్యాలు, అవినీతి, శాంతి భద్రతల వైఫల్యంపై జగన్ గట్టిగా పోరాడారని, నవరత్నాల ద్వారా అన్ని వర్గాలకు జగన్ చేరువయ్యారని హిందూస్తాన్ టైమ్స్ విశ్లేషించింది. వైఎస్సార్సీపీ విజయం సాధించనున్నట్లు ఎగ్జిట్ పోల్స్‌లో తేలడంపై రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది. టీడీపీ ద్వంద్వ వైఖరిపై విస్మయం వ్యక్తమవుతోంది. ఒకపక్క లగడపాటి సర్వేను విశ్వసిస్తున్నట్లు చెబుతూ మరోవైపు ఇతర సంస్థలు నిర్వహించిన సర్వేలను నమ్మబోమనడం ఏం సంకేతాలనిస్తోందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. తమకు అనుకూలంగా ఉంటే సర్వేలను నమ్ముతామని లేదంటే వాటికి విశ్వసనీయత లేదనే ధోరణితో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు. క్లీన్‌స్వీప్ పార్టీల్లో అగ్రస్థానంలో వైఎస్సార్సీపీ ఈ ఎన్నికల్లో క్వీన్‌స్వీప్ చేసే పార్టీల్లో వైఎస్సార్సీపీ మొదటి స్థానంలో ఉంటుందని స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు యోగీంద్ర యాదవ్∙ పేర్కొన్నారు. వైఎస్ జగన్ నిజాయితీ, నిబద్ధతలకు తగిన ప్రతిఫలం లభించనుందని ‘యాక్సిస్ మై ఇండియా’ ఎండీ ప్రదీప్ గుప్తా చెప్పారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందు నుంచి జగన్ ప్రణాళికాబద్ధంగా గ్రౌండ్ వర్క్ చేయడం, పాదయాత్ర ద్వారా క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరువ కావడం వైఎస్సార్సీపీ పట్ల ఆదరణ పెరగటానికి కారణాలని చెప్పారు. చంద్రబాబు కప్పదాటు వైఖరి కూడా మరో కారణమన్నారు. జగన్ అవిశ్రాంత కృషి, పార్టీ పునర్నిర్మాణంతో క్షేత్ర స్థాయిలో బలపడిందని రాజకీయ విశ్లేషకుడు సందీప్ శాస్త్రి అన్నారు. 2014 ఎన్నికల్లో జగన్ పార్టీ ఉత్తర కోస్తాలో కేవలం ఒక శాతం ఓట్ల తేడాతో సీట్లు కోల్పోయిందన్నారు.ఈసారి ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 45 శాతం, టీడీపీకి 38 శాతం ఓట్లు పడ్డాయన్నారు. ఓట్లలో 8 శాతం మార్పు వచ్చినా 70 సీట్ల వరకు తేడా వస్తుందన్నారు. రాజకీయ అభద్రతతోనే చంద్రబాబు ఢిల్లీ వైపు చూస్తున్నారని సీనియర్ జర్నలిస్టు టీఎం వీరరాఘవన్ పేర్కొన్నారు. డబ్బు ప్రామాణికం కాదు.. ఇమేజ్ పోతే మళ్లీ రాదు: సెఫాలజిస్ట్ భమిడిపాటి రామ్మూర్తి ‘ఎన్నికల సర్వేలకు డబ్బు ప్రామాణికం కాదు. వాస్తవ విరుద్ధమైన ఫలితాలు ప్రకటిస్తే సంస్థ ప్రతిష్ట దెబ్బ తింటుంది. ఒకసారి ఇమేజ్ పోతే మళ్లీ రాదు. సర్వేల్లో నిబద్దత ఉండాలి. ప్రజల్లో విశ్వసనీయ పెంచుకునేలా ఉండాలి. సర్వే నిర్వహణలో వ్యయప్రయాసలు ఉంటాయి కాబట్టి డబ్బు అవసరమే. అయితే డబ్బు ఒక్కటే ప్రామాణికం కాకూడదు. కొందరు ఒపీనియన్ పోల్‌ను కూడా ఎగ్జిట్ పోల్స్ అంటూ వైరల్ చేస్తున్నారు. ఇది సరికాదు. రాజకీయ పార్టీలు ఎ, బి, సి, డి పేరుతో ఇచ్చే ప్రశ్నలతో చేసే సర్వేల్లో కచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశంలేదు. సైంటిఫిక్‌గా సర్వే చేయాలి. సర్వే ఎవరు చేశారు? ఎప్పుడు చేశారు? ఎలా చేశారు? అనే వివరాలు ప్రజలకు నిష్పక్షపాతంగా అందించాలి. నేను ఐ న్యూస్ ఛానల్‌కు ఐ పల్స్ సర్వే చేశా. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో పనిచేసే ఒక యాప్ క్రియేట్ చేసి ఫ్రాక్సీ బ్యాలెట్ మెథడ్‌లో ఓటర్ల అభిప్రాయాలు సేకరించాం. రాష్ట్రవ్యాప్తంగా 1,100 మంది ప్రతినిధులు 50 వేల మంది ఓటర్ల(శాంపిల్స్) పోలింగ్ ఒక్క రోజులోనే సర్వే చేశాం. ఓటేసి వచ్చిన ఓటర్లను కలిసి ఏ పార్టీకి ఓటు వేశారో? ఆ మొబైల్ యాప్‌లో నొక్కమని చెప్పాం. మేం కూడా చూడకుండా నేరుగా ఓటరుతోనే యాప్‌లో ఓటు వేయించేలా చేశాం. మా సర్వే ఫలితాలను విశ్లేషిస్తే ఈ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజార్టీతో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తారని తేలింది. ఎన్నికల ప్రచారం నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకు అన్ని దశల్లోను వైఎస్సార్సీపీ అద్బుతంగా చేసింది. ప్రజల నమ్మకాన్ని పొందిన జగన్మోహన్రెడ్డి ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుంటారని మా సర్వేలో అంచనాకు వచ్చాం’ వైఎస్సార్ సీపీకి 110 సీట్లు: ఫ్రొఫెసర్ వెంకటేష్, సీఎస్డీఎస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో 110 స్థానాలు వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల శాంపిల్స్ సర్వేలో తీసుకున్నాం. 2014లో తెలుగుదేశం పార్టీకి 42 శాతం ఓట్లు ఉంటే 2019లో 36 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అభివృద్ధిపై చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మలేదు. అన్ని జిల్లాలను సమానంగా చూడటం లేదని గుర్తించారు. టీడీపీ మొదటి నుంచి పొత్తులతో మాత్రమే గెలుస్తూ వస్తోంది. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్, వైఎస్సార్సీపీలు పెట్టిన పథకాలను కాపీ కొట్టింది. నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో వైఎస్సార్సీపీ స్వీప్ చేస్తుంది. మా సర్వేను ఆంధ్రజ్యోతి పత్రిక వక్రీకరించి ప్రచురించింది. దీనిపై కేసు పెట్టాం. మా వద్ద నుంచి వారికి కాపీలు ఎలా వెళ్లాయి? పైగా తప్పుడు రాతలు రాశారు. అవి ఫ్యాషన్ సర్వేలు: ‘ఆరా’ మస్తాన్‌వలి ‘ఫ్యాషన్‌గా చేసే సర్వేల్లో శాస్త్రీయత ఉండదు. తెలంగాణ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ‘ఆరా’ సర్వే నిజమైంది. ఆంధ్రప్రదేశ్‌లో మా సర్వే పూర్తి శాస్త్రీయంగా సాగింది. నియోజకవర్గానికి 50 మంది అభిప్రాయాలతో కచ్చితమైన ఫలితం నిర్ణయించవచ్చు. అయినా సరే ఆరా ప్రతి నియోజకవర్గంలో 1,000 మంది అభిప్రాయాలు సేకరించింది. ఎన్నికల నోటిఫికేషన్ తరువాత వైఎస్సార్సీపీకి ప్రజాదరణ బాగా పెరిగింది. మేం పలు రాష్ట్రాల్లో సర్వేలు చేసినా కొద్ది కాలంలోనే ఇంత గణనీయమైన మార్పు ఎక్కడా చూడలేదు. 2014 ఎన్నికలతో పోల్చితే ఈసారి 0.67 శాతం మాత్రమే ఓటింగ్ శాతం పెరిగింది. పురుషుల ఓటింగ్ శాతం అంతే స్థాయిలో పెరిగింది. మా సర్వేలో వైఎస్సార్ కాంగెŠస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతంలో 47 శాతం మహిళల ఓట్లున్నాయి. అదే సమయంలో టీడీపీకి వచ్చిన మొత్తం ఓట్ల శాతంలో కేవలం 43 శాతం ఓట్లే మహిళలవి. నెల్లూరు జిల్లాలోనే మహిళల ఓట్లు అత్యధికంగా పోల్ అయ్యాయి. అక్కడ టీడీపీ ఒక్క సీటు కూడా గెలవదు. ఈసారి టీడీపీకి బీసీలు దూరమై 65–70 శాతం మంది వైఎస్సార్సీపీకి దగ్గరయ్యారు. కాపులు అత్యధికులు పవన్‌కల్యాణ్‌కు రాజ్యాధికారం దక్కదని వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపారు. అయోమయంలో చంద్రబాబు: ప్రొఫెసర్ వేణుగోపాల్ (సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ (సీపీఎస్) చంద్రబాబు ఒక్కోసారి ఒక్కో విధంగా పొంతనలేకుండా మాట్లాడుతున్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని ఒకసారి, ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించిందని మరోసారి, 150 సీట్లలో విజయం సాధిస్తామని ఇంకోసారి అంటున్నారు. ఓట్ల లెక్కింపు వరకూ పార్టీ కార్యకర్తలను, ఏజెంట్లను నిలుపుకోవడం కోసం, వారిలో ఆత్మస్థయిర్యం కల్పించడానికే బాబు ఇలా అంటున్నారు. ఢిల్లీ, ఇతర రాష్ట్రాలు వెళ్లి నాయకులను కలుస్తూ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని బాబుకు తెలిసినట్లు లేదు. అయితే బాబు ఇంట (రాష్ట్రంలో) గెలిచే పరిస్థితి లేదు. రాష్ట్రంలో టీడీపీకి 2– 3 ఎంపీ సీట్లు కూడా వస్తాయనే నమ్మకం లేదు. సర్వేలకు చంద్రబాబే ఆద్యుడు. ఏపీలో ప్రతినెలా వైఎస్సార్సీపీ పుంజుకుంటూ వచ్చినట్లు మేం శాస్త్రీయంగా నిర్వహించిన సర్వేల్లో తేలింది. మహిళలు, డ్వాక్రా మహిళలు టీడీపీకే ఓట్లేశారనుకోవడం తప్పు. ఈ విషయాన్ని పక్కా డేటాతోనే చెబుతున్నా. ఫిబ్రవరి మధ్యలో ఒకసారి, మార్చిలో మరోసారి మేం సర్వే చేశాం. డ్వాక్రా మహిళల్లో 45 శాతం మంది టీడీపీకి, 46 శాతం మంది వైఎస్సార్సీపీకి, మొత్తమ్మీద మహిళలను తీసుకుంటే 8 శాతం మంది అధికంగా బైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపారు. పసుపు – కుంకుమ కింద రూ. 10 వేలు ఇస్తే డ్వాక్రా మహిళలు తీసుకుని ఉండవచ్చు. వారు జగన్ ఇచ్చిన రుణమాఫీ, ఇతర హామీల ద్వారా కూడా ప్రయోజనం పొందాలని ఆశించారు. జగన్ – ఫ్యాన్’ అనే అంశం జనంలోకి రిథమిక్‌గా వెళ్లింది. పొలిటికల్ మేనేజిమెంట్, పబ్లిక్ మేనేజిమెంట్ ఇలా ఏ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకున్నా వైఎస్సార్సీపీ ముందు వరుసలో నిలిచింది. ఎన్నికలకు పది రోజుల ముందు నాటికి టీడీపీ కంటే వైఎస్సార్సీపీని బలపరిచిన ఓటర్ల సంఖ్య 5 శాతానికి పెరిగింది. ఎన్నికల నాటికి వైఎస్సార్సీపీ ఓటు షేర్ టీడీపీ కంటే 9 శాతం ఎక్కువైంది. ఇవన్నీ శాస్త్రీయంగా చేసిన సర్వే గణాంకాలు. ఫోన్లలో చేసే సర్వేలు వాస్తవాలను ఏమాత్రం ప్రతిఫలించవు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎన్డీయేకి అనుకూలంగా ఉండటంతో సోమవారం సెన్సెస్ 1400 పాయింట్లుపైగ పెరిగింది. నిన్న ఎగ్జిట్‌పోల్ ఫలితాలు రాగానే ఒకరు నాతో రేపు సెన్సెస్ పరుగులు తీస్తుందన్నారు. అదే జరిగింది. ఎగ్జిట్ పోల్స్ కూడా సెన్సెస్‌ను ప్రభావితం చేసింది.టీడీపీకి 92 ప్లస్ ఆర్ మైనస్ 10 వస్తాయని లగడపాటి సర్వే పేర్కొంది. ఆ పది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలవు. ఇలా సర్వే ఫలితాలు ఉండరాదు. జగన్ అభ్యర్థులను బాగా ఎంపిక చేశారు జగన్ పార్టీ సీట్లు ఆశిస్తున్న వారి పేర్లు దగ్గర పెట్టుకుని ఎవరికి సీట్లు ఇస్తే బాగుంటుందనే అంశాన్ని చాలా చక్కగా అంచనా వేశారు. మంచి అభ్యర్థులను ఎంపిక చేశారు. స్వల్ప మెజార్టీలు ఉన్న చోట్ల గొడవలు జరుగుతాయి. అందువల్ల బాబు చివరివరకూ పార్టీ క్యాడర్‌ను నిలుపుకోవడం కోసం విజయం టీడీపీదే అంటున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఈవీఎంల పంచాయతీ ఎజెండాగా చంద్రబాబు పది రోజులు రాజకీయాలు నడిపిస్తారు. కొందరు డబ్బులకోసం, సొంత ప్రయోజనాల కోసం సర్వేలు చేయిస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఏమాత్రం శాస్త్రీయత, నెట్ వర్క్ లేని సంస్థలు సర్వేలు చేసినట్లు ఫలితాలు ప్రకటించడం ఇందుకు నిదర్శనం. బెట్టింగుల కోసం కూడా సర్వేలను వాడుకుంటున్నారు. ఊరూపేరూలేని వారు సర్వేలు చేస్తూ మమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి. 2006 నుంచి మేం శాస్త్రీయంగా సర్వేలు చేస్తున్నాం. శాస్త్రీయ సర్వేలు ఎప్పుడూ ఫెయిల్ కావు. ఎన్నికల కమిషన్ కోడ్ విధించినట్లే ఎగ్జిట్‌పోల్ సర్వే సంస్థలకూ కోడ్ ఉండాలి. మోడల్ కోడ్ లేకపోతే మైండ్ గేమ్ సర్వేలు నడుస్తాయి. -
అమేథీలో రాహుల్‌కు ఎదురుగాలి!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఈసారి ఎదురుగాలి వీయనుందని ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్‌పోల్ తెలిపింది. కాంగ్రెస్ కంచుకోటగా పేరుగాంచిన అమేథీలో రాహుల్‌కు బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతీఇరానీ నుంచి గట్టి పోటీ ఎదురుకానుందని వెల్లడించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌కు 4,08,651 ఓట్లు రాగా, ఆయనపై పోటీచేసిన స్మృతి ఏకంగా 3,00,748 ఓట్లను దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్–బీజేపీల మధ్య హోరాహోరీ పోరు తప్పకపోవచ్చని సర్వే తేల్చింది. కాగా, రాహుల్ పోటీచేస్తున్న మరో నియోజకవర్గం వయనాడ్(కేరళ)లో ఆయన విజయం నల్లేరుపై నడకేనని సర్వే స్పష్టం చేసింది. వయనాడ్‌లో యూడీఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాహుల్ 7.30 లక్షల ఓట్ల మెజారిటీ(70 శాతం ఓట్ల)తో విజయం సాధించబోతున్నారని తెలిపింది. ఎల్డీఎఫ్ అభ్యర్థి, సీపీఐ నేత పి.పి.సునీర్ 23 శాతం ఓట్లతో 2.50 లక్షల ఓట్లను దక్కించుకుంటారని వెల్లడించింది. బీజేపీ–భారత్ ధర్మజనసేన(బీడీజేఎస్) అభ్యర్థి తుషార్ వెల్లప్పల్లె 7 శాతం ఓట్లను దక్కించుకుంటారని పేర్కొంది. రాయ్‌బరేలీ సోనియాదే: యూపీలోని కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీలో సోనియాగాంధీ ఘనవిజయం సాధిస్తారని తెలిపింది. 1999 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న సోనియా మరోసారి ఈ స్థానాన్ని నిలుపుకుంటారని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చిన దినేశ్ ప్రతాప్‌సింగ్‌ను బీజేపీ సోనియాపై పోటీకి నిలిపింది. కాగా, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)లు ఇక్కడ తమ అభ్యర్థులను నిలబెట్టలేదు. జయప్రదకు షాక్.. ఎస్పీ నేత ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఈ నియోజకవర్గం ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేత, నటి జయప్రదకు రాంపూర్‌లో ఓటమి తప్పకపోవచ్చని సర్వేలో తేలింది. రాంపూర్ ప్రజలు ఆజంఖాన్‌కు పట్టం కట్టబోతున్నారని వెల్లడించింది. జయప్రదతో పోల్చుకుంటే ఆజంఖాన్ రాంపూర్‌లో అందరికీ తెలిసిన వ్యక్తికావడం ఆయనకు లాభించిందని అభిప్రాయపడింది. భోపాల్ ప్రజ్ఞా సింగ్‌దే: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌కు షాక్ తగలనుందని సర్వే తెలిపింది. భోపాల్‌లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ దిగ్విజయ్ సింగ్‌ను ఓడించబోతున్నారని ఎగ్జిట్‌పోల్ పేర్కొంది. మాండ్యలో సుమలత జయభేరి.. కర్ణాటకలోని మాండ్యలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నటి సుమలత విజయదుందుభి మోగించబోతున్నారని సర్వే తెలిపింది. సీఎం కుమారస్వామి కొడుకు జేడీఎస్–కాంగ్రెస్ అభ్యర్థి నిఖిల్ గౌడకు పరాజయం తప్పదని స్పష్టం చేసింది. మాండ్యలో బీజేపీ సుమలతకు మద్దతు పలికింది. బెగుసరాయ్‌లో కన్హయ్య ఓటమి.. బిహార్‌లోని బెగుసరాయ్ లోక్‌సభ స్థానంలో కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్ ఘనవిజయం సాధిస్తారని తేలింది. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తన్వీర్ హసన్ రెండో స్థానంలో, జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత, సీపీఐ అభ్యర్థి కన్హయ్యకుమార్ మూడో స్థానంలో నిలుస్తారని పేర్కొంది తిరుగులేని ‘షా’ గాంధీనగర్‌లో బీజేపీ చీఫ్ అమిత్ షా భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారని ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్‌పోల్ తెలిపింది. ఈ ఎన్నికల్లో షా 8,92,775 ఓట్లు(67 శాతం) దక్కించుకోనుండగా, కాంగ్రెస్ అభ్యర్థి సీహెచ్ ఛవ్దా 3,31,602 ఓట్లు(26 శాతం), ఇతరులు నాలుగు శాతం ఓట్లను దక్కించుకుంటారని అంచనా వేసింది. సర్వే ప్రకారం.. ► యూపీలోని మైన్‌పురిలో ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం, బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్ మధ్య హోరాహోరీ పోరు. ► కేరళలోని తిరువనంతపురంలో కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ ఎల్డీఎఫ్ అభ్యర్థి దివాకరణ్పై ఘనవిజయం సాధిస్తారు. ► బిహార్‌లోని పట్నాసాహిబ్‌లో బీజేపీ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, కాంగ్రెస్ అభ్యర్థి శత్రుఘ్నసిన్హాపై గెలుస్తారు. ► ఈశాన్యఢిల్లీలో కాంగ్రెస్ నేత షీలాదీక్షిత్‌పై బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ స్వల్ప మెజారిటీతో విజయం సాధిస్తారు. ► తూర్పుఢిల్లీలో బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ కాంగ్రెస్ నేత అర్విందర్ లవ్లీపై గెలుస్తారు. ► తమిళనాడులోని శివగంగ నుంచి కాంగ్రెస్ నేత పి.కార్తి చిదంబరం, బీజేపీ నేత హెచ్.రాజాపై విజయం సాధిస్తారు. ► యూపీలోని సుల్తాన్‌పూర్‌లో కేంద్ర మంత్రి మేనకాగాంధీ, బీఎస్పీ అభ్యర్థి చంద్రభద్ర సింగ్ మధ్య హోరాహోరీ పోరు. స్వల్ప మెజారిటీతో మేనక గట్టెక్కే అవకాశం. ► తమిళనాడులోని తూత్తికుడిలో బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్‌పై డీఎంకే నేత కనిమొళి విజయం. ► పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో బీజేపీ నేత సన్నీడియోల్ చేతిలో కాంగ్రెస్ నేత సునీల్ కుమార్ జాఖర్ ఓటమి. ► పిలిభిత్‌లో ఎస్పీ అభ్యర్థి హేమరాజ్ వర్మపై బీజేపీ నేత వరుణ్‌గాంధీ విజయం. ► ఛింద్వారాలో మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ కుమారుడు, కాంగ్రెస్ అభ్యర్థి నకుల్‌నాథ్, ఆనంద్‌పూర్ సాహిబ్‌లో కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ ఘనవిజయం. ► న్యూఢిల్లీలో బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్‌ను మట్టికరిపిస్తారు. ► కేంద్రమంత్రి రామ్‌కృపాల్ యాదవ్ పాటలీపుత్ర నుంచి మరోసారి మిసాభారతి(ఆర్జేడీ)ని ఓడిస్తారు. ► ఉత్తర ముంబై కాంగ్రెస్ అభ్యర్థి ఊర్మిళ మతోండ్కర్, దక్షిణ ముంబై కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ దేవ్రాకు ఓటమి తప్పదు. ► పూరీ నుంచి బీజేపీ అభ్యర్థి సంబిత్ పాత్ర, నాగ్‌పూర్ నుంచి కేంద్రమంత్రి గడ్కారీ, బారామతి నుంచి ఎన్సీపీ నేత సుప్రియా సూలే విజయం సాధిస్తారు. ► మధ్యప్రదేశ్‌లోని గుణాలో జ్యోతిరాదిత్య సింధియా (కాంగ్రెస్), కేపీ యాదవ్ (బీజేపీ)మధ్య హోరాహోరీ పోరు. -
‘ఎగ్జిట్’ కలవరం
సాక్షి, హైదరాబాద్ : ఎగ్జిట్‌పోల్ ఫలితాలు రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నాయకత్వాలను కలవరపెడుతున్నాయి. తాము ఆశించిన దానికి ఎగ్జిట్‌పోల్ ఫలితాలకు తేడా ఉండటం, అధికార టీఆర్ఎస్కు లోక్‌సభ ఎన్నికల్లోనూ తిరుగులేదని తేలడంతో ఆ రెండు పార్టీల నేతలకు గుబులు పట్టుకుంది. కనీసం ఐదారు స్థానాల్లోనైనా విజయం సాధిస్తామని కాంగ్రెస్, మూడు స్థానాలు తమ ఖాతాలో చేరుతాయని కమలనాథులు గంపెడంత ఆశలు పెట్టుకోగా, ఎగ్జిట్ ఫలితాలు ఏకపక్షంగా టీఆర్ఎస్కు 14–16 స్థానాలను కట్టబెడుతుండటం వారికి రుచించడం లేదు. అటు అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన టీఆర్ఎస్, లోక్‌సభ ఫలితాల్లోనూ జోరు కొనసాగిస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్ సర్వేలు తేల్చడంతో తమ భవిష్యత్తు ఏంటనే దానిపై ఆ రెండు పార్టీల నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. నల్లగొండపై కాంగ్రెస్.. కరీంనగర్‌పై బీజేపీ తాము ఆశించిన మేర ఫలితాలు రావన్న అంచనాల నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ నేతలు రెండో స్థానం కోసం లెక్కలు కట్టుకుంటున్నారు. వాస్తవానికి నల్లగొండ, భువనగిరి, చేవెళ్ల, ఖమ్మం, మల్కాజ్గిరి స్థానాల్లో తాము విజయం సాధిస్తామని కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. పార్టీలోని కీలక నేతలు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రేణుకాచౌదరి, రేవంత్‌రెడ్డిలు ఈ నియోజకవర్గాల్లో బరిలో దిగడంతో వారి వ్యక్తిగత ఇమేజ్‌కు తోడు జాతీయపార్టీ ఇమేజ్ కూడా తోడవుతుందని భావించారు. బీజేపీ విషయానికి వస్తే సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ, కరీంనగర్లో బండి సంజయ్‌లు అధికార టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇచ్చారని పోలింగ్ సరళిని బట్టి అంచనా వేశారు. కానీ, కాంగ్రెస్, బీజేపీలకు ఒక్కో స్థానానికి మించి రావడం లేదని, కొన్ని చోట్ల గట్టిపోటీ ఇచ్చిందని ఎగ్జిట్ లెక్కలు చెపుతున్నాయి. ఈ నేపథ్యంలో తాము ఎక్కడెక్కడ గెలిచే అవకాశాలున్నాయనే దానిపై ఆ రెండు పార్టీల నేతలు మళ్లీ కుస్తీ పడుతున్నారు. ఎగ్జిట్ ఫలితాలు ఒకటి, రెండు స్థానాలకే పరిమితం చేయడంతో నల్లగొండలో ఖచ్చితంగా గెలుస్తామని, భువనగిరి, మల్కాజ్గిరి, ఖమ్మం, మహబూబాబాద్, చేవెళ్లలో రెండింట గెలుస్తామని కాంగ్రెస్ ఆశిస్తోంది. బీజేపీ మాత్రం కరీంనగర్ తమదేనని, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్‌లలో ఒకటి గెలుస్తామని ఆశిస్తోంది. ఇందుకోసం పోలింగ్స్టేషన్లు, మండలాలు, నియోజకవర్గాల వారీగా తమకున్న సానుకూలతలు, పోలింగ్ జరిగిన తీరును విశ్లేషిస్తూ రెండు పార్టీల నేతలు లెక్కలు కట్టుకుంటున్నారు. రెండో స్థానమైనా..! పోలింగ్ సరళిని బట్టి ఐదారు చోట్ల టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇచ్చి రెండోస్థానంలో నిలబడతామని, భవిష్యత్తులో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షం కోసం పోటీపడతామని ఆశించిన కమలనాథులు ఇప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఉంటుందా లేదా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఒక స్థానంలోనైనా గెలిచి.. ఐదారు చోట్ల రెండోస్థానంలో నిలిస్తే బాగుంటుందంటున్నారు. ఎలాగూ కేంద్రంలో అధికారం దక్కుతుంది కనుక జాతీయపార్టీ హోదాలో ప్రతిపక్ష రేసులో నిలవచ్చన్నది ఆ పార్టీ నేతల అంచనా. బీజేపీకి తోడు కాంగ్రెస్ కూడా.. తాము గెలిచే స్థానాలేంటి? ఎన్ని చోట్ల రెండో స్థానంలో నిలుస్తామన్న దానిపై లెక్కలు కట్టుకుంటోంది. కేంద్రంలో అధికారం దక్కకపోగా, ఇక్కడ కూడా ప్రతికూల ఫలితాలు వచ్చి బీజేపీ కన్నా పేలవ స్థాయిలో నిలిస్తే కాంగ్రెస్ శాసన సభాపక్షాన్ని విలీనం చేసే ప్రక్రియను టీఆర్ఎస్ వేగవంతం చేస్తుందని, దెబ్బమీద దెబ్బతో రాజకీయంగా మనుగడ సాగించలేని స్థితికి చేరుకుంటామోననే ఆందోళన కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. మొత్తంమీద ఎగ్జిట్‌పోల్ ఫలితాలు రాష్ట్రంలోని రెండు జాతీయపార్టీల నేతలు ఓ వైపు విజయం కోసం, మరోవైపు రెండో స్థానం కోసం అంతర్మథనంలో పడేశాయని రాజకీయ వర్గాలంటున్నాయి. రెంటికీ చెడ్డామా? కాంగ్రెస్, బీజేపీల మధ్య, ఆ పార్టీల నేతల స్థైర్యం విషయంలో ఒక్క తేడా మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మళ్లీ ఎన్డీయే అధికారంలోకి వస్తుందని, బీజేపీ గతం కన్నా దేశవ్యాప్తంగా లాభపడుతోందన్న ఎగ్జిట్ అంచనాలు రాష్ట్ర బీజేపీ నేతలకు, ఆ పార్టీ కేడర్‌కు ఉపశమనం కలిగిస్తుండగా, మరోసారి అధికారానికి దూరంగా ఉంటామన్న వాస్తవాన్ని కాంగ్రెస్ కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అధికారం దక్కని పరిస్థితుల్లో, కనీసస్థాయి ప్రాతినిధ్యం కూడా కరువైతే మరో ఐదేళ్లపాటు రాష్ట్రంలో పార్టీని నెట్టుకురావడం, కేడర్‌ను నిలుపుకోవడం కష్టసాధ్యమేనని ఆ పార్టీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. -
విదూషకుల విన్యాసాలు
ఏపీలో అధికారం కోల్పోతున్న తరుణంలో ఒక నాయకుడు చేయరాని పనులకు, దుర్మార్గాలకు చంద్రబాబు నాయకత్వం వహించడం దురదృష్టకరం. ఏ కాంగ్రెస్ నుంచి వచ్చి ఎన్టీఆర్ పంచనచేరి రాజ్యచక్రాన్ని తిప్పాడో, ఆ పార్టీ విధానానికే విరుద్ధంగా అదే కాంగ్రెస్‌లో చేరడానికి అన్ని మార్గాలూ వెతుక్కుంటున్నారు. ఈ ప్రహసన యాత్రలో అంతర్భాగమే ‘జగడపాటి’ విదూషక పాత్ర! ఇతని విద్య తిమ్మిని బమ్మిని చేయడం. గురుశిష్యులిద్దరిదీ ఒకటే మనస్తత్వం. ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే చంద్రగిరిలోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగడానికి ముందురోజున ఓటర్లను ప్రభావితం చేసేలా ఊహాజనిత ఫలితాలను ప్రసారం చేసిన ఘనుడు లగడపాటి. ‘‘ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఇంత ఘోరంగా జరుగుతాయా? ఇది ప్రజాస్వామ్య మేనా? చంద్రగిరిలో రికార్డయిన పోలింగ్ వీడి యోలు పరిశీలిస్తే ఒళ్లు గగుర్పొడుస్తోంది’’. – కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది (17.05.2019) ప్రకటన ‘‘దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతూ ఉండాలంటే.. నాయకుడు ఎంత గొప్పవాడైనా అతడి పాదాల కింద నలిగిపోయేలా ప్రజలు తమ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అప్పగించి కూర్చోరాదు. అలాగే తాము త్యాగాలతో నిర్మించుకున్న రాజ్యాంగ వ్యవస్థల్ని దారి తప్పించి కూల్చివేయగల అధికారాల్ని అతని చేతుల్లో పెట్టరాదు. రాజకీయాల్లో భక్తి భావన పతనానికి చివరికి వ్యక్తి నియంతృత్వానికి రాజమార్గం వేస్తుం దన్న సత్యాన్ని మరిచిపోరాదు’. – 1949 నవంబర్ 25న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగ నిర్ణయ సభలో చేసిన ఆఖరు ప్రసంగంలో హెచ్చరిక! మేడిపండుగా భావించిన ‘పండు’ను కాస్తా పొట్టవిప్పి చూడగానే పురుగులమయంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థ మారుతోందని ఎప్ప టికన్నా హెచ్చుస్థాయిలో గత 70 ఏళ్ల స్వాతంత్య్ర చరిత్రకు అపవాదుగా 2019 ఎన్నికల నిర్వహణ నిరూపించాయి. ఈ పతన దశకు ప్రస్తుత కేంద్ర, దేశంలోని వివిధ రాష్ట్రాల పాలకులు కారకులయ్యారు. ఆంధ్ర ప్రదేశ్‌లో పతనదశలో ప్రవేశించిన భ్రష్ట టీడీపీ నాయకుడు చంద్రబాబు అధికారం కోల్పోతున్న తరుణంలో ఒక నాయకుడు చేయరాని పను లకు, దుర్మార్గాలకు నాయకత్వం వహించడం దురదృష్టకరం. కాంగ్రెస్ కేంద్ర అధిష్టానవర్గం నిరంకుశ పాలనా వ్యవస్థకు అంకురార్పణ చేస్తున్న తరుణంలో ఆ పరిణామానికి అడ్డుకట్టడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ నెలకొల్పిన తెలుగుదేశం పార్టీని అష్టావక్రమార్గాల్లో నడిపించి భ్రష్టతవైపు మళ్ళించినవాడు చంద్రగిరి ప్రాంత చంద్రబాబు. అల్లుడిగా ఇంట్లో ప్రవేశించిన వ్యక్తి ‘నల్లి’ పోట్లు ద్వారా ఎన్టీఆర్‌ని సాగనంపి ముఖ్యమంత్రి పదవికి ఎగబాకిన వాడు అనంతరం తన పార్టీకి ఏకు మేకవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ విభజనకు కారకుడు కావడం జగమె రిగిన సత్యం. తాజాగా ఏ కాంగ్రెస్ నుంచి వచ్చి ఎన్టీఆర్ పంచనచేరి రాజ్యచక్రాన్ని తిప్పాడో, ఆ పార్టీ విధానానికే విరుద్ధంగా అదే కాంగ్రెస్‌లో చేరడానికి ఈ కష్టకాలంలో అన్ని మార్గాలూ వెతుక్కుంటున్నారు. ఈ ప్రహసన యాత్రలో అంతర్భాగమే ‘జగడపాటి’ విదూషక పాత్ర! ఇతని విద్య తిమ్మిని బమ్మిని చేయడం. గురుశిష్యులిద్దరిదీ ఒకటే మనస్తత్వం. ఒకరు పార్లమెంటును స్తంభింపచేయడం కోసం మిరియాల కారం (పెప్పర్ స్ప్రే) సభ్యుల కళ్లలో కొట్టడంలో నేర్పరి. మరొకరు అవసాన పదవీదశలో ఉన్న ముఖ్యమంత్రి. నిజానికి చంద్రగిరిని వదిలేసి కుప్పం నియోజకవర్గానికి చంద్ర బాబు ఎందుకు వలసపోవలసి వచ్చింది? కాంగ్రెస్‌లో ఉండి చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి శాసనసభకు ఎన్నికైన∙వ్యక్తి.. ఎన్టీఆర్‌ను అంటకాగిన తర్వాత ఆ నియోజక వర్గాన్ని విడిచి ‘కుప్పం’ ఒడిలోకి ఎందుకు చేరవలసి వచ్చింది? పైగా, శిక్షా ప్రాంతంగా పేరు మోసిన కుప్పంకు బదిలీ కావడానికి అధికారులు ఎందుకు ఇష్టపడరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఎడంగా, కడుకొసలో ఉన్న కుప్పం ఏనాడూ చంద్రగిరిలో అంతర్భాగమే కాదని చారిత్రికుల భావన. అందుకే, 1995 దాకా ఆంధ్ర ప్రదేశ్–కర్ణాటక–తమిళనాడు హద్దుల ముక్కోణం కూడలిలో ఉంది. ఏ అధికారినైనా శిక్షించాలంటే కుప్పానికి తోసి శిక్షిస్తారట. పైగా అమాయక తమిళనాడు పేదసాదలకు నిలయం కూడానట. ఈ ‘శిక్షాత్మక, సమ స్యాత్మక ప్రాంతాన్ని బాబు ఎంచుకుని తన రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకున్నారు. రామకుప్పం, గూడుపల్లి, శాంతిపురం మండలాలతో కూడిన కుప్పాన్ని నియోజకవర్గంగా ఏర్పరచి, దానికి వ్యవసాయ క్షేత్రం అని పేరు జోడించారు. గతంలో తొలి ముఖ్యమంత్రి హోదాలో, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ పరిశోధకులు, శాస్త్ర వేత్తలు వద్దు వద్దన్నా మన వాతావరణానికి సానుకూలపడని ఏటవాలు ‘పోడు’ వ్యవసాయ పద్ధతుల్లో ఇజ్రాయెలీ సాగు పద్ధతుల్ని ప్రవేశపెట్టి చంద్రబాబు అభాసుపాలయ్యారు. ఇజ్రాయెలీ సాగుకు మన రైతుల్ని అలవాటు చేయడం కోసం సంప్రదాయ క్షేత్ర సరిహద్దుల్ని చెరిపేసి, రైతుల్ని ఇబ్బందుల పాల్జేసి, తమ భూముల్ని తామే గుర్తించలేని దుస్థి తిలోకి రైతుల్ని నెట్టి తీవ్ర విమర్శలకు గురైన బాబు కనీసం మర్యాద కోసమైనా, గౌరవ భావంతో రైతులకు పొరపాటు అయిందని కూడా క్షమాపణ చెప్పకుండా తప్పుకున్నారు. అలాంటి చంద్రబాబు, బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మొన్నటిదాకా భాగస్వామ్య పక్షంగా ఉండి, ఇటీవలే విడాకులిచ్చి తిరిగి తన మాతృసంస్థ అయిన కాంగ్రెస్‌ను అంటకాగుతూ ఎన్టీఆర్ ‘తెలు గుదేశం’ పార్టీని భూస్థాపితం చేసే వైపుగా ప్రయాణిస్తున్నారు. ప్రజా వ్యతిరేక చర్య అయిన నోట్ల రద్దును మోదీ ప్రకటించకముందే మన రాష్ట్రంలో మొదట ప్రస్తావించి, ‘రద్దు’ పద్దుకు ప్రతిపాదించింది తానే నని గొప్ప కోసం ప్రకటించి, బీజేపీ సంకీర్ణానికి విడాకులిచ్చిన మరు క్షణం ఆ నెపాన్ని మోదీ మీదికి సునాయాసంగా నెట్టేశారు బాబు. ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడు పోలింగ్ కేంద్రాలలోనూ ఓట్ల రిగ్గింగ్‌కు భారీ స్థాయిలో పాల్పడిన ‘దేశం’ పార్టీ నాయకులు, కార్యకర్తల రక్షణ కోసం బాబు పడరానిపాట్లు పడుతున్నారు. పైగా, డబ్బుతో ఓట్ల కొనుగోళ్లకు తన చోటామోటా నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రోత్సహించిన బాబు ఢిల్లీలో ‘ఎన్నికల విధానం: జవాబు దారీతనం’ అన్న అంశంపై సదస్సులో (18.5.2019) మాట్లాడుతూ ‘పెద్ద నోట్లు రద్దుచేసి కొత్తగా రూ. 500, రూ. 2,000 నోట్లను ప్రవేశ పెట్టడంవల్ల రాజకీయ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచటం సులువైపోయింది. ప్రజలు కూడా రెండువేలు, అంతకుపైనే ఎక్కువగా ఆశిస్తున్నార’నీ చెప్ప టం ప్రజల మధ్య నవ్వులాటగా మారిందని అతను గుర్తించటం లేదు. ‘జవాబుదారీతనం’ గురించి ఊకదంపుడు కొట్టే బాబు రాష్ట్ర ఉన్నతాధికారుల క్రియాశీల నిర్ణయాలను, ఎన్నికల (కేంద్ర–రాష్ట్ర) కమి షన్ ఉన్నతాధికారుల్ని లెక్క చేయకుండా పోవటం– అంబేడ్కర్ శఠిం చిన రాజకీయ అహంకార ప్రదర్శన తప్ప మరొకటి కాదు. ఎన్నికల నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కిన వ్యక్తి అతను. ఈ అహంకారం తోనే చంద్రగిరి నియోజకవర్గంలోని కీలకమైన పోలింగ్ కేంద్రాల పరిధిలోని దళిత, మైనారిటీలను ఓటు హక్కును వినియోగించుకో కుండా సుమారు 30 ఏళ్లుగా నిర్బంధ విధానాన్ని బయటి ప్రపంచానికి తెలియనివ్వకుండా గుట్టుచప్పుడు కాకుండా చంద్రబాబు వర్గం జాగ్ర త్తపడింది. ఈ పరిణామాలను బయటకు పొక్కనివ్వకుండా ‘వదరు బోతు’గా చంద్రబాబు– ‘చిలకజోస్యాల’ ‘రగడ’ (లగడ)పాటి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే పార్టీల ఎన్నికల ప్రచారంపై ఆంక్షలు ఉండగానే తుది ఫలితాల ప్రకటన వెలువడక ముందే చంద్రగిరిలోని ఏడు పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ జరగడానికి ముందు రోజున ఓటర్లను ప్రభావితం చేసేలా ఊహాజనిత ఫలితాలను ప్రసారం చేశారు. అందుకు ఫలితాన్ని అనుభవించక తప్ప లేదు– అయిదు పోలింగ్ కేంద్రాలలో అధికార పార్టీకి అనుకూలంగా బాహాటంగా వ్యవహరించిన అధికారులపై ఎన్నిక సంఘం వేటు వేయవలసి వచ్చింది. ఇదిలా ఉండగా, ఫలితాల ప్రభావం ఎలా ఉండబోతోందో తెలిసి కూడా చంద్రబాబు ‘కాలుకాలిన పిల్లిలా’ దేశ ప్రతిపక్షాలన్నింటినీ ఒక్క తాటిపైకి తెచ్చే ప్రయత్నంలో విఫలమవుతున్నారని, పరువుకోసంగానూ ‘దేశం’ ఓటమిని ఆంధ్రప్రదేశ్‌లో హుందాగా ఒప్పుకోవడానికి మనస్సు బిక్క చచ్చిపోయినందున ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాలు, బెంగాల్, ఒడిశా నాయకులను తనలాగే కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టడానికి చేస్తున్న ప్రయ త్నాలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. ఇందుకు కారణం– సొంత రాష్ట్రంలోనే తన అధికార పునాదులు బీటలు వారుతూండటమేనని మరువరాదు. పళ్ల బిగువుతోనే ఢిల్లీ, పంజాబ్, కోల్‌కతాల పంచల్లో తల దాచుకోచూడటం. దళిత ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రానివ్వకుండా, బెదిరింపుల ద్వారా దౌర్జన్య హింసల ద్వారా అడ్డుకుని వారి ఓట్లను వారి పేరిట తామే గుద్దుకున్న ‘దేశం’ నాయకత్వ చర్యలు వేనోళ్ల ఖండించి ఏవగించుకోవలసినవి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ‘రగడ పాటి’ జరిపిన సర్వే ఫలితాలు ఉభయ ప్రాంతాల తెలుగు ప్రజల మధ్య ఎంతగా నవ్వుల పాలయ్యాయో తెలిసిందే. 24 గంటలు గడవకముందే చంద్రబాబు మాజీ నియోజకవర్గమైన చంద్రగిరిలో భారీ బందోబస్తు మధ్య జరపవలసి వచ్చిన రీ–పోలింగ్ సందర్భంగా కూడా పరమ ‘బోకు’ జోస్యంగా, కాదు కాదు, పరమ అపహాస్యంగా మిగిలిపోను న్నది. పైగా ఇప్పటికే అడుగూడిన ప్రతిపక్ష నాయకులతో రేపు ఏపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతున్న చంద్రబాబు మంతనాలు చేస్తున్నారు. యావద్భారతంలో ఆసేతు హిమాచల పర్యంతం ‘ప్రజాస్వామ్యం’ విలువలు 2019 ఎన్నికలలో మరింతగా దిగజారిపోవటం విచారకరం! ఎన్టీఆర్, వైఎస్. రాజశేఖరరెడ్డి హయాంలు తెలుగు వారి కీర్తి పతాకలను నిలబెట్టగా, వాటిని దించేయడానికి సాహసించినవారుగా, రేపటి పదవీభ్రష్టులుగా చంద్రబాబు అతని పార్టీ మిగిలిపోతారు. కానీ, రేపటి ఉషోదయానికి, పరిణామశీలమైన మార్పుకు ఆహ్వానం! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఎగ్జిట్ పోల్స్ సందడి
మునుముందు ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆత్రుత, ఉత్కంఠ అందరిలోనూ ఉంటాయి. నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీగా ఎన్నికల యుద్ధం సాగినప్పుడు ఇవన్నీ మరిన్ని రెట్లు పెరగడంలో వింతేమీ లేదు. కనుకనే ఆదివారం సాయంత్రం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంత సంచలనం సృష్టించాయి. మార్కెట్లు సైతం రెట్టించిన ఉత్సాహంతో స్పందించి పైపైకి ఎగబాకాయి. ‘చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవా...’ అన్నట్టు నాయకుల నడత, నడక... వారు గతంలో ఇచ్చిన హామీలు, అధికారంలో ఉండగా నెరవేర్చిన తీరు వగైరాలన్నీ ప్రజానీకానికి తెలుసు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసి భుజాలు తడుముకుంటున్నవారు ముందుగా ఆ సంగతి తెలుసుకోవాలి. కోట్లాదిమంది పౌరుల ఆశలు, ఆకాంక్షలు ఇప్పటికే ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. అవేమిటో, ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలని బడా నేతలు మొదలుకొని సాధా రణ పౌరుల వరకూ అందరూ ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. పైగా ఈసారి ఎప్పుడూ లేనట్టు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోలింగ్ ఏప్రిల్ 11నే ముగిసింది. అంటే... ఫలితాల వెల్లడికి తెలుగు ప్రజలు ఈ దఫా 43 రోజులపాటు నిరీక్షించవలసి వచ్చింది. కనుకనే అసలు ఫలితాలు ఎటూ రెండు రోజుల్లో వెల్లడికాబోతున్నా, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కోసం కూడా అందరూ అంతే ఆసక్తిగా ఎదురుచూశారు. ఎన్నికల సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ మన దేశంలోకి ప్రవేశించి రెండున్నర దశాబ్దాలవుతోంది. మొదట్లో పోలింగ్ పూర్తయిన ప్రతి దశలోనూ ఫలితాలు ప్రకటించి చాలా సంస్థలు పార్టీలనూ, నేతలనూ కంగారు పెట్టేవి. కానీ వీటిల్లో అధికభాగం పార్టీలకు ప్రయోజనం కలిగించేందుకు దొంగ లెక్కలు చెబుతున్నాయన్న ఆరోపణలు రావడం మొదలయ్యాక ఆఖరి దశ పోలింగ్ పూర్త య్యాకనే ఫలితాలు వెల్లడించాలన్న నిబంధన అమల్లోకి వచ్చింది. ఇప్పటికీ ఆ బాపతు సంస్థలు బోగస్ సర్వేలతో మభ్యపెట్టాలని చూస్తూనే ఉన్నాయి. ఆమధ్య తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తప్పుడు ఫలితాలిచ్చి అభాసుపాలైన లగడపాటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయంలోనూ ఆ బాపతు ప్రయత్నమే చేశారు. ఇలాంటి సంస్థల సంగతి పక్కనబెడితే మన దేశంలో నికార్సయిన అంచనాలిచ్చి విశ్వసనీయత పొందుతున్న సంస్థలున్నాయి. ఓటర్ల మనసులో ఏముందో పసిగట్టడం, వారు ఎటు మొగ్గు చూపుతున్నారో తెలుసుకోవడం సాధారణ విషయం కాదు. ఓటర్లలో వివిధ వర్గాల ఆలోచనలనూ, వారిని ప్రభావితం చేస్తున్న అంశాలను రాబట్టడం, వారి తీర్పు ఎలా ఉండబోతున్నదో నిర్ధారించడం కత్తి మీది సాము. అది ఒకరకంగా చీకట్లో తడు ములాట. సర్వే నిర్వహణలో శాస్త్రీయత కొరవడితే అంతా తలకిందులవుతుంది. ఓటర్లను అడగా ల్సిన ప్రశ్నల్లో... వాటిని అడిగే తీరులో... ఎంచుకున్న సామాజిక వర్గాల అమరికలో ఏమాత్రం తేడా లొచ్చినా అంచనాలు కుప్పకూలతాయి. సర్వేలు చేసిన సంస్థలు అభాసుపాలవుతాయి. ఈమధ్యే వెల్లడైన ఆస్ట్రేలియా పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఇందుకొక ఉదాహరణ. అక్కడ విపక్ష లేబర్ పార్టీ విజయం సాధిస్తుందని సర్వేలు జోస్యం చెప్పాయి. కానీ అందుకు భిన్నంగా అధికార లిబరల్ పార్టీ అధికారం చేజిక్కించుకుంటోంది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఇలాగే జరిగింది. డెమొక్రటిక్ పార్టీకి చెందిన హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తారని సర్వేలు చెప్పగా, రిపబ్లికన్ పార్టీ నేత డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకొచ్చారు. ఆ రెండుచోట్లా దాదాపు అన్ని సంస్థలూ ఓటర్లను ఫోన్ ద్వారా ప్రశ్నించి జవాబులు రాబడతాయి. కానీ మన దేశంలో సర్వే నిర్వహిస్తున్న సంస్థలు నేరుగా పౌరుల దగ్గరకెళ్తాయి. వారిని వివిధ కోణాల్లో ప్రశ్నిస్తాయి. చాలా సంస్థలు తమ అనుభవాలను సమీక్షించుకుని లోటుపాట్లు దిద్దుకుంటున్నాయి. సర్వే లకు శాస్త్రీయ ప్రమాణాలను ఏర్పరుచుకుని సరిగా అధ్యయనం చేయగలుగుతున్నాయి. మెరుగైన అంచనాలకు రాగలుగుతున్నాయి. అందుకే 2014నాటి ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాత జరి గిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ సరిగా జోస్యం చెప్పగలిగాయి. గతంలో ఈ పరిస్థితి లేదు. 2004లో యూపీఏ విజయం సాధించి నప్పుడు, 2009లో అది రెండోసారి అధికారం లోకొచ్చినప్పుడు చాలా సంస్థల లెక్కలు తప్పాయి. కేంద్రంలో ఎన్డీఏకు మరోసారి స్పష్టమైన మెజారిటీ రాబోతున్నదని ఈసారి దాదాపు అన్ని సంస్థలూ ఢంకా బజాయించి చెబుతున్నాయి. కాంగ్రెస్ పరిస్థితి 2014నాటి సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే గణనీయంగా మెరుగుపడినా అది బలమైన పోటీ ఇవ్వలేకపోయిందని అంటున్నాయి. ఎన్నికల ముందునాటి అంచనాలకు భిన్నంగా ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ నిలకడగా ఎన్నికల్లో మోదీకి ప్రతికూలం కాగలవనుకున్న పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు, ఉపాధి లేమి, వ్యవసాయ సంక్షోభం వంటి అంశాల ప్రభావం పెద్దగాలేదంటున్న సర్వేల జోస్యాల్లో నిజానిజాలేమిటో 23న వెల్లడయ్యే వాస్తవ ఫలితాలు నిగ్గుదేలుస్తాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధికార పీఠాన్ని అధిష్టించబోతున్నదని అత్యధిక సంస్థలు తేల్చి చెప్ప డంలో ఆశ్చర్యం లేదు. ఏపీలో బాబు అధికార పునాదులు కదలబారుతున్న వైనం చాన్నాళ్ల క్రితమే కనబడటం మొదలైంది. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో ప్రభుత్వం ఏ ఒక్కటీ నెరవేర్చక పోగా సాక్ష్యాధారాలు లేకుండా చేయడానికి ఏకంగా ఆనాటి మేనిఫెస్టోనే వెబ్సైట్ నుంచి మాయం చేసింది. అయిదేళ్లూ ఎలా పాలించినా చివరిలో రకరకాల పథకాల పేరిట డబ్బులు పంచి విజయం చేజిక్కించుకోవచ్చునని భావించారు. కానీ ఇదంతా బెడిసికొట్టిన వైనం ఆయనకు ముందే అర్ధ మైంది. అందుకే పోలింగ్ జరిగిన నాటినుంచి ఆయన ఈవీఎంలను తప్పుబడుతూనే ఉన్నారు. పైగా, జాతీయ స్థాయిలో ఏదో తవ్వి తలకెత్తుకుంటున్న అభిప్రాయం కలిగించడానికి ప్రయత్ని స్తున్నారు. ఇవన్నీ జనం ముందు చెల్లని కాసులయ్యాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. మరో రెండురోజుల్లో వెల్లడికాబోయే ఎన్నికల ఫలితాలు సైతం వీటినే ఎలుగెత్తి చాటుతాయి. -
ఎగ్జిట్ ఎవరు? ఎంట్రీ ఎవరు?
-
ఎగ్జిట్ ఎవరు? ఎంట్రీ ఎవరు?
-
ఎగ్జిట్ పోల్స్ అలా అయితే ఓకే..
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే భారీ ఆధిక్యం సాధిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తోసిపుచ్చిన విపక్షాలపై బీజేపీ మండిపడింది. ఇవే ఎగ్జిట్ పోల్స్ విపక్షాలకు అనుకూలంగా వస్తే వాటిని సమర్ధించేవని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రారంభానికి ముందు తాము చెప్పిన స్ధానాలకు అనుగణంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయని చెప్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల కంటే తమకు ఎక్కువ సీట్లు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్‌ను మమతా బెనర్జీ, కుమార స్వామి, చంద్రబాబునాయుడు వంటి విపక్ష నేతలు ప్రశ్నించడాన్ని ప్రస్తావిస్తూ వారి అంచనాలకు తగినట్టు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వస్తే అవి సరైనవేనని, లేకుంటే వాటిని తప్పుపడతారని వ్యాఖ్యానించారు. వారంతా ఈవీఎంల ద్వారానే గతంలో గెలిచినా ఇప్పుడు వాటి పనితీరును ప్రశ్నిస్తున్నారని ఆక్షేపించారు. విపక్ష నేతలకు ఈనెల 23న భంగపాటు తప్పదని స్పష్టం చేశారు. తమ పార్టీకి 300 స్ధానాల వరకూ దక్కుతాయని రాంమాధవ్ ధీమా వ్యక్తం చేశారు. -
‘బీజేపీని అడ్డుకోకపోతే చావడం మేలు’
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఎన్నికల్లో బీజేపీని అడ్డుకోకపోతే కాంగ్రెస్ పార్టీ చావాల్సిందేనని స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్ అన్నారు. దేశ వ్యాప్తంగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ మరోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీకి ప్రత్యమ్నాయంగా నిలవడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని కాపాడలంటే బీజేపీని అడ్డుకోని తీరలనీ, అది సాధ్యం కాకపోతే కాంగ్రెస్ చావడం మేలని అన్నారు. కాగా హోరాహోరీగా సాగిన 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీకే ప్రజామోదం ఉంటుందని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే. మోదీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఆదివారం సాయంత్రం విడుదల చేసిన అంచనాల్లో పేర్కొన్నాయి. ఎన్డీయే కూటమికి 300లక పైగా స్థానాలు వస్తాయని తెలిపగా.. యూపీఏ కేవలం 120 స్థానాలలోనే పరితమైదని పలు సర్వేల సంస్థలు వెల్లడించిన విషయం తెలిసిందే. -
‘ముందు వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలి’
సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ముందు ఈవీఎంలను కాకుండా వీవీ ప్యాట్లను లెక్కించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో సోమవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. న్యాయవాది యలమంజుల బాలాజీ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఒకవేళ వీవీ ప్యాట్లకు, ఈవీఎంలకు మధ్య తేడాలుంటే, ఈ అసెంబ్లీ లేదా పార్లమెంట్ నియోజకవర్గంలోని మొత్తం వీవీ ప్యాట్లను లెక్కించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. ఇందులో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ప్రధాన ఎన్నికల అధికారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. హౌస్ మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై మంగళవారం ఉదయం న్యాయమూర్తులు జస్టిస్ జి.శ్యాంప్రసాద్, జస్టిస్ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం విచారించనున్నది. కాగా కనీసం యాభై శాతం వీవీ ప్యాట్ల స్లిప్పులను లెక్కించాలన్న విపక్షాల అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పిటిషనర్ అన్నీ వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలన్న అభ్యర్థనను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంటుందా అనే దానిపై వేచి చూడాల్సిందే. -
కూటమి కూర్పు : దీదీతో అఖిలేష్ మంతనాలు
లక్నో : ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేకు భారీ ఆధిక్యతను కట్టబెట్టడంతో విపక్షం అప్రమత్తమైంది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత అవలంభించాల్సిన ఉమ్మడి వ్యూహంపై కసరత్తును వేగవంతం చేసింది. పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌లు ఈ దిశగా సోమవారం ఫోన్లో సంప్రదింపులు జరిపారు. హంగ్ పార్లమెంట్ వస్తే బీజేపీయేతర పార్టీలను కలుపుకునివెళ్లడంపైనా వీరు చర్చించినట్టు తెలిసింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం భావసారూప్య పార్టీలను ఏకతాటిపైకి తేవడంతో పాటు పరిస్థితులకు తగిన విధంగా అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు నేతలు సంప్రదింపులు జరిపారు. యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమి బీజేపీని నిలువరించిన తీరును ఈ సందర్భంగా దీదీకి అఖిలేష్ యాదవ్ వివరించినట్టు సమాచారం. ఎన్నికల ఫలితాల అనంతరం కూటమి ఏర్పాటుపై వేగంగా స్పందించడంపైనా వారు చర్చించారు. -
‘వారి పేర్లు చెబితే ఓట్లు రాలవు’
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం సాధిస్తుందని వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ బీజేపీలో నూతనోత్తేజం నింపాయి. కుటుంబం నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి పతనం తప్పదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి గాంధీ, నెహ్రూ కుటుంబ కార్డు ఎంతోకాలం పనిచేయదని తేటతెల్లమైందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఆ కుటుంబం లేకపోతే వారి సభలకు జనాలు కరువవుతారని, ఆ కుటుంబాన్ని ముందు నిలిపితే మాత్రం ఓట్లు రావని జైట్లీ ఎద్దేవా చేశారు. ఎగ్జిట్ పోల్స్ ప్రజల ఆలోచనాసరళికి అద్దం పడతాయని, మే 23న వెల్లడయ్యే ఫలితాలు ఇదేవిధంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. 2014లో వెల్లడైన ఫలితాలే 2019లోనూ పునరావృతం కానున్నాయని జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. హంగ్ పార్లమెంట్ వచ్చే అవకాశం లేదని, ప్రజలు విస్పష్ట తీర్పు ఇవ్వబోతున్నారని స్పష్టం చేశారు. అనైతిక కూటములతో ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నది వారికి తెలుసునని వ్యాఖ్యానించారు. ప్రజలు సామర్ధ్యం చూసి ఓటేస్తారని, కుటుంబ పేర్లను చూసి కాదని అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రచార సరళిని సమర్ధిస్తూ జైట్లీ పేర్కొన్నారు. -
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో సత్తా చాటిన స్టాక్ మార్కెట్లు
-
ఎగ్జిట్ పోల్స్ వ్యతిరేకంగా వచ్చాయి కాబట్టే..
సాక్షి, న్యూఢిల్లీ: విపక్షాలకు తక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తే సాధారణంగానే వారు ఆ ఫలితాలను తప్పుపడతారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాదవ్ వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి కేంద్రంలో అధికారంలోకి రాబోతుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. దీనిపై మాదవ్ స్పందిస్తూ.. ‘‘ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విపక్షాలకు అనుకూలంగా వస్తే అవి సరైనవి. వారికి వ్యతిరేకంగా వస్తే సరైనవి కావు అనే విధంగా ప్రతిపక్ష పార్టీల సభ్యులు వ్యవహరిస్తున్నారు. ఓటమిని అంగీకరించలేక ఎన్నికల సంఘం, ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారు. ఫలితాలు వారికి అనుకూలంగా వస్తే ఎవరినీ ప్రశ్నించరు. వారికి వ్యతిరేకంగా వస్తే వ్యవస్థనే తప్పుపడతారు. మమతా బెనర్జీ, చంద్రబాబు నాయడు, కూమరస్వామి వీరంతా ఎగ్జిట్ పోల్స్‌ను ప్రశ్నిస్తున్నారు. గతంలో వారు కూడా ఇవే ఈవీఎంలతో గెలిచిన విషయాన్ని మర్చిపోయారు. గతంలో కంటే ఈసారి తమకు మెరగైన ఫలితాలు వస్తాయి. మోదీ నాయకత్వంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మే 23న వచ్చే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. 300లకు పైగా స్థానాలకు గెలుచుకుంటాం’’ అని అన్నారు. కాగా హోరాహోరీగా సాగిన 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీకే ప్రజామోదం ఉంటుందని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే. మోదీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఆదివారం సాయంత్రం విడుదల చేసిన అంచనాల్లో పేర్కొన్నాయి. -
సెన్సెక్స్ దూకుడు
ముంబై : దలాల్ స్ట్రీట్‌నూ మోదీ మేనియా తాకింది. ఆకాశమే హద్దుగా సెన్సెక్స్, నిఫ్టీ దూసుకువెళ్లాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సార్వత్రిక సమరంలో ఘన విజయం సాధిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో సోమవారం స్టాక్ మార్కెట్లు సత్తా చాటాయి. కొనుగోళ్ల వెల్లువతో అన్ని రంగాల షేర్లు అమాంతం ఎగిశాయి. అదానీ కంపెనీల షేర్లు ఇంట్రాడేలో 17 శాతం మేర పరుగులు పెట్టాయి. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ 1422 పాయింట్ల లాభంతో 39,352 పాయింట్ల వద్ద ముగిసింది. సరికొత్త శిఖరాలకు చేరిన నిఫ్టీ ఏకంగా 421 పాయింట్ల లాభంతో 11,828 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్బీఐ, యస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్అండ్టీ తదితర షేర్లు భారీగా లాభపడ్డాయి. ఇక ఎఫ్ఐఐలతో పాటు సంస్ధాగత ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లకు దిగడం మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసిందని విశ్లేషకులు పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ ర్యాలీతో ఒక రోజులోనే ఇన్వెస్టర్ల సంపద రూ 5.33 లక్షల కోట్ల మేర పెరిగింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో సత్తా చాటిన స్టాక్ మార్కెట్లు -
మంగళగిగిలో లోకేశ్‌కు ఓటమి తప్పదు
-
‘మమత, చంద్రబాబు ఐసీయూలో చేరారు’
సాక్షి, న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి రాబోతుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రమంత్రి గిరిరాజ్ స్పందిస్తూ.. ప్రతిపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు సందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసిన తరువాత విపక్ష పార్టీల నేతలు షాక్‌కి గురైయ్యారు. ముఖ్యంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫలితాలను చూసి తట్టుకోలేక ఐసీయూలో చేరారు. మే 23న వెలువడే ఫలితాలు మరింత స్పష్టంగా ఉంటాయి. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయం’’ అని వ్యాఖ్యానించారు. కాగా ఆదివారం దేశ వ్యాప్తంగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. పలు సర్వేల నివేదిక ప్రకారం 280 సీట్లకు పైగా స్థానాలను సాధించి మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశాయి. కాగా ఎగ్జిట్ పోల్స్‌ను విపక్షాలు నేతలు కొందరు కొట్టిపారేసిన విషయం తెలిసిందే. -
ఓడిపోతున్నామని చంద్రబాబుకు ఎప్పుడో తెలుసు
-
మోదీ సర్కార్‌కు వచ్చే సీట్లు ఎన్ని?
సాక్షి, న్యూఢిల్లీ : 2019 సార్వత్రిక లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడడంతో సగం ఉత్కంఠకు తెరపడింది. దాదాపు అన్ని సర్వేలు కేంద్రంలో రానున్నది మళ్లీ నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వమేనని సూచించాయి. ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన 272 మ్యాజిక్ ఫిగర్‌కు దాటే బీజేపీకి సీట్లు వస్తాయని అన్ని సర్వేలు అంచనా వేశాయి. అందరికన్నా ఎక్కువ ఎన్డీయే కూటమికి 368 సీట్లు వస్తాయని ఆక్సిస్ సర్వే అంచనా వేసింది. అంటే 2014 ఎన్నికలకన్నా 32 సీట్లు ఎక్కువ వస్తాయని. నరేంద్ర మోదీ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని తేలిపోయాకా బీజేపీకి 272 సీట్లు దాటుతుందా? 350 సీట్లు దాటుతాయన్నది ప్రస్తుతానికి అప్రస్తుతమే! అయితే అధికారంలోకి వచ్చాక ఏ విషయంలోనైనా రాజ్యాంగ సవరణలు తీసుకరావాలంటే పాలక పక్షానికి మూడింట రెండు వంతుల మెజారిటీ ఉండాల్సిందే. అందుకు ఖచ్చితంగా గెలుచుకున్న అధిక స్థానాలు ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు. ఎగ్జిట్ పోల్స్ నిక్కచ్చిగా నిజమవుతాయని విశ్వసించడానికి వీల్లేదు. 2004, 2009, 2014 ఎన్నికల సందర్భంగా నిర్వహించిన పలు ఎన్నికల సర్వేల ఫలితాలకు, వాస్తవ ఫలితాలు ఎంతో దూరంగా ఉన్నాయి. విశ్వసనీయంకాని ఒకటి, రెండు సర్వేలు మాత్రమే నాడు నిజమని తేలాయి. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీకి అనుకూలంగా పవనాలు బలంగా వీచిన 2014 ఎన్నికల్లోనే బీజేపీకి 282 సీట్లు వచ్చాయి. ఈసారి అనుకూల పవనాలు అంతగా లేకపోవడమే కాకుండా యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్, అస్సాం రాష్ట్రాల్లో వ్యతిరేకత కూడా ఎంతో కనిపించింది. అలాంటప్పుడు గత ఎన్నికల కన్నా ఈసారి బీజేపీ అత్యధిక సీట్లు రావడం ఆశ్చర్యకరమే! ఈసారి ఎన్నికల్లో ఎన్డీయేకు 48.5 శాతం ఓట్లు వస్తాయంటూ ‘సీఎన్ఎన్–న్యూస్ 18’తరఫున ఎగ్జిట్ పోల్ సర్వే జరిపిన ఇప్సోస్ చెప్పడం అసాధారణం. 48.5 శాతం ఓట్లతో 336 సీట్లు వస్తాయని ఆ సంస్థ అంచనా వేసింది. గతం కన్నా పది శాతం ఓట్లు ఎక్కువ వస్తాయని అంచనా వేసింది. అదే సీట్లు గతంలోలాగా 336 వస్తాయని పేర్కొంది. అదెలా సాధ్యం ? పైగా వివిధ సర్వే సంస్థలు అంచనా వేసిన పోలింగ్ శాతానికి, వచ్చే సీట్ల సంఖ్యకు కూడా పొంతన కుదరడం లేదు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకు ‘హార్ట్‌ల్యాండ్’గా పరిగణించే యూపీ, బీహార్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర, తొమ్మిది రాష్ట్రాల్లో గతంలో 252 సీట్లు వచ్చాయి. వీటిలోని మూడు రాష్ట్రాల్లో గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత యూపీలో ఎస్పీ–బీఎస్పీ పార్టీలు పొత్తు కుదుర్చుకోవడం గణనీయమైన పరిణామం. వీటి ప్రభావం యూపీలో బాగా ప్రస్ఫుటంగా కనిపించాలి. ఈ రాష్ట్రం విషయంలో పలు సర్వేల ఫలితాలు భిన్నంగానే కాకుండా పరస్పర భిన్నంగా ఉన్నాయి. యూపీలో నీల్సన్ ఎన్డీయే కూటమికి 22 సీట్లు వస్తాయని నీల్సన్, 65 సీట్లు వస్తాయని ఆక్సిస్ సంస్థ అంచనా వేశాయి. తూర్పు రాష్ట్రాల ఫలితాలు భిన్నం తూర్పు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఈసారి బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని పలు సర్వేలు సూచించాయి. కొన్ని సర్వేలయితే పాలకపక్షాలకన్నా అధికంగా కూడా వస్తాయని అంచనావేశాయి. గత ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీకి రెండు సీట్లు రాగా, ఈసారి నాలుగు సీట్లు మొదలుకొని 23 సీట్ల వరకు వస్తాయని అంచనా వేశాయి. బీజేపీకి పెద్దగా ప్రభావంలేని ఒడిశా రాష్ట్రంలో గత ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటురాగా, ఈ సారి ఏడు నుంచి 17 సీట్లు వస్తాయని అంచనా వేశారు. అదే గత ఎన్నికల్లో 20 సీట్లు కలిగిన బీజేడీకి నాలుగు నుంచి 13 సీట్లు తగ్గుతాయని వివిధ సంస్థలు భిన్నంగా అంచనా వేశాయి. ఎలాంటి ప్రజావ్యతిరేకత లేని బీజేడీకి ఇన్ని సీట్లు తగ్గడం అన్నది ఆశ్చర్యకరమే. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో నవీన్ పట్నాయక్ ఐదోసారి ముఖ్యమంత్రి అవుతారని పలు ముందుస్తు, ఎగ్జిట్ సర్వేలు కూడా తేల్చాయి. అలాంటప్పుడు రాష్ట్ర అసెంబ్లీ విషయంలో, కేంద్రం విషయంలో తేడా చూపించాల్సినంత అవసరం ఆ రాష్ట్ర ప్రజలకు లేదు. గత ఎన్నికల్లోలాగా ఈసారి ఎన్నికల సందర్భంగా మోదీ హవా కనిపించలేదు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా ఉద్యోగులు రోడ్డున పడడమే కాకుండా నిరుద్యోగుల శాతం కూడా పెరగింది. చేపట్టిన అభివద్ధి కార్యక్రమాలు చెప్పుకునే స్థాయిలో విజయవంతం కాకపోవడంతో మోదీ జాతీయవాదాన్ని, బాలకోట్ సర్జికల్ స్ట్రక్స్ను ముందుకు తీసుకొచ్చారు. రాను, రాను ప్రతిపక్షాలపై వ్యక్తిగత దూషణలకు కూడా దిగారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం దేశంలో దాదాపు ఇదే మొదటిసారి. దాంతో కూడా మోదీ ప్రభావం మరింత తగ్గిందని రాజకీయ విశ్లేషకులు భావించారు. సర్వేల్లో అంచానా వేసిన పోలింగ్ శాతానికి, సీట్ల శాతానికి ఎక్కడా పొంతన లేని కారణంగా ఈసారి మౌన ఓటర్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్లు అర్థం అవుతుంది. వారి వల్ల ఎగ్జిట్ ఫలితాలు తలకిందులు కాకపోవచ్చుగానీ, పాలకపక్షానికి సీట్ల సంఖ్య తగ్గి హంగ్ పార్లమెంట్ ఏర్పడే అవకాశం ఉంది. -
ఢిల్లీ వచ్చి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు వృథా
-
ప్రజలకు బాబుపై విశ్వాసం పోయింది
-
టీడీపీ వెయ్యి శాతం అధికారంలోకి..అదేలా?
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఊసరవెల్లి మాదిరిగా ఎప్పటికప్పుడు రంగులు మారుస్తారంటూ రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తారన్న సంగతి తెలిసిందే. ఏ విషయాన్ని అయినా తనకు అనుకూలంగా మార్చుకుంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలోనూ చంద్రబాబు రెండు నాల్కల ధోరణి మరోసారి బయటపడింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో తాను అధికారానికి దూరమవడం ఖాయమని తెలుసుకున్న ఆయన..ఆ వాస్తవాన్ని అంగీకరించలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీ నూటికి వెయ్యి శాతం అధికారంలోకి వస్తుందంటూ విచిత్ర వ్యాఖ్యానాలు చేస్తూ.. ఒకప్పుడు ఎగ్జిట్ పోల్స్‌ను సమర్థించిన ఆయనే.. ప్రస్తుతం ఇదంతా తూచ్ అంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. 2014.. కాంగ్రెస్..క్విట్ ఇండియా! ‘దేశ ప్రజల మూడ్‌ను ఎగ్జిట్ పోల్స్ ప్రతిబింబిస్తాయి. కాంగ్రెస్‌కు ఇండియా ఇచ్చే మెసేజ్.. క్విట్ ఇండియా!’ అంటూ గతంలో చంద్రబాబు నాయుడు ఎంతో ఉత్సాహంతో.. ఒకింత ఉద్వేగంతో ఎగ్జిట్ పోల్స్‌పై తనకున్న నమ్మకాన్ని చాటుకున్నారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన, సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు తరిమి కొడతారు అంటూ చిన్న పిల్లాడిలా సంబరపడిపోయారు. 2014లో గుజరాత్ మాజీ సీఎం నరేంద్ర మోదీ హవాతో దేశంలో కమలం విరబూసే సమయం అది. అందుకే ‘సిసలైన’ రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు తన స్వలాభం కోసం బీజేపీతో జత కట్టారు. ఊహించినట్టుగానే ఎన్డీయే అధికారంలోకి రావడంతో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి రెండు కేంద్ర మంత్రి పదవులు లభించాయి. రాష్ట్రంలో కూడా స్వల్ప మెజార్టీతో తమ పార్టీ అభ్యర్థులు గట్టెక్కడంతో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయినప్పటికీ అధికార దాహం తీరక.. సంతలో పశువులను కొన్నట్టు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. తమ అధినాయకుడి నేతృత్వంలో టీడీపీ నేతలు తాము ఆడిందే ఆట అన్నట్లుగా యథేచ్చగా అవినీతికి పాల్పడ్డారు. దీంతో 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయిందని, టీడీపీ అధికారం కోల్పోవడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్త కంఠంతో ప్రతిధ్వనిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ వాస్తవ దూరంగా ఉన్నాయి..! నాలుగున్నరేళ్ల పాటు బీజేపీతో అధికారం పంచుకుని.. ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్న చంద్రబాబు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే కాంగ్రెస్‌తో జతకట్టి బీజేయేతర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ ప్రకటనలు జారీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు విశ్వసనీయత ఉంటుందన్న ఆయన తాజాగా.. ‘ప్రజానాడి పట్టుకోవడంలో టైమ్, ఎగ్జిట్ పోల్స్ మరోసారి విఫలమయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా తప్పని తేలింది. నిజానికి క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులు, వాస్తవాలకు ఇవి దూరంగా ఉన్నాయి. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అదే విధంగా కేంద్రంలో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి ఎన్డీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయని పూర్తి విశ్వాసంతో ఉన్నాం’ అంటూ ట్వీట్ చేసి మరోసారి ద్వంద్వ వైఖరిని బయటపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఫలితం తనకు అనుకూలంగా ఉంటే ఏ విషయాన్నైనా అంగీకరించే చంద్రబాబు.. వ్యతిరేక ఫలితం వస్తే మాత్రం ఈవీఎంలైనా, ఎగ్జిట్ పోల్స్ అయినా, ఆఖరికి ఈసీ అయినా సరిగ్గా పనిచేయలేదనే చెబుతారు అందులో కొత్తగా ఆశ్చర్యపడాల్సిందేముంది అంటూ రాజకీయ విశ్లేషకులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. Time and again exit polls have failed to catch the People's pulse. Exit polls have proved to be incorrect and far from ground reality in many instances. While undoubtedly TDP govt will be formed in AP, we are confident that non-BJP parties will form a non-BJP govt at the center. — N Chandrababu Naidu (@ncbn) May 19, 2019 -
ఎగ్జిట్ పోల్స్... చంద్రబాబుకు పొలిటికల్ ఎగ్జిట్ పోల్స్
-
కాంగ్రెస్‌ను గద్దె దింపే యత్నం!
భోపాల్ : ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో బీజేపీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారాన్ని చేపట్టబోతుందని స్పష్టమైన సంకేతాలు వెలువడటంతో.. బీజేపీ శ్రేణులు అవకాశం ఉన్న ఆయా రాష్ట్రాల్లో అధికారం కోసం కార్యాచరణను మొదలు పెట్టాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో ఉందని పేర్కొంటూ గవర్నర్ ఆనందిబెన్ పటేల్‌కు సోమవారం బీజేపీ లేఖ రాసింది. వెంటనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని కోరింది. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి కాంగ్రెస్ సరైన పాలనను అందించడంలో విఫలమైందని బీజేపీ నేత హితేష్ బాజ్పై మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సమాజ్ వాదీ పార్టీ (1), బీఎస్పీ (2), ఇండిపెండెంట్లు (4) సహకారంతో అధికారాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. మొత్తం 230 సీట్లున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ 114 సీట్లు దక్కించుకుని మ్యాజిక్ ఫిగర్ (116)కు ఒక అడుగు దూరంలో నిలిచింది. బీజేపీ 109 సీట్లతో అధికారాన్ని కోల్పోయింది. కేంద్రంలో తమ ప్రభుత్వమే కొలువుదీరనుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చడంతో మధ్యప్రదేశ్‌లో మళ్లీ పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే గవర్నర్‌ను కలిసి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని కోరినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నమ్మబోము
-
‘చంద్రబాబు కళ్లలో స్పష్టంగా ఓటమి భయం’
సాక్షి, కాకినాడ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కళ్లలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. అందుకే ఆయన ఎక్కే గుమ్మం...దిగే గుమ్మం చేస్తున్నారన్నారు. కన్నబాబు సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నిన్నటి ఎగ్జిట్ పోల్స్...చంద్రబాబుకు పొలిటికల్ ఎగ్జిట్ పోల్ అని వ్యాఖ్యానించారు. 2014లో ఇవే ఈవీఎంలపై గెలిచిన ఆయన ఇప్పుడు వాటిని తప్పుబడితే ఎలా అని సూటిగా ప్రశ్నించారు. అలా అనుకుంటే ఆనాడు చంద్రబాబు గెలుపు కూడా తప్పే అని అన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి రోజుకో డిమాండ్ ఎన్నికల సంఘం ముందు ఉంచుతున్నారన్నారు. ఆయనను అలాగే వదిలేస్తే ఎన్నికల కౌంటింగ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించమని డిమాండ్ చేస్తారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు హుందాగా వ్యవహరించాలని కన్నబాబు సూచించారు. అన్ని సంస్థల సర్వే నివేదికలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తే.. లగడపాటి రాజగోపాల్ మాత్రం దానికి వ్యతిరేకంగా చెప్పారని విమర్శించారు. లగడపాటి సర్వేలకు క్రెడిబులిటి ఏనాడో పోయిందని ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యకర్తల్లో ధైర్యం నింపడానికే లగడపాటి సర్వే అని కన్నబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ఎగ్జిట్ పోల్స్... చంద్రబాబుకు పొలిటికల్ ఎగ్జిట్ పోల్స్ -
ఎగ్జిట్ పోల్స్‌పై స్టాలిన్ తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను డీఎంకే అధినేత స్టాలిన్ కొట్టిపారేశారు. ఏడో విడత ఎన్నికలు ముగియడంతో ఆదివారం సాయంత్రం పలు మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నమ్మబోమని, మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడేవరకు వేచిచూస్తామని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో ఫలితాల అనంతరం ఆయన ఏ కూటమితో జట్టు కడుతారనే అంశంపై ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. కేంద్రంలో అతిపెద్ద పార్టీకి మద్దతిచ్చే అంశంపై స్టాలిన్ ప్రశ్నించగా.. ఆయన సమాధానం దాటవేశారు. కేంద్రంలో ఏ కూటమితో జట్టు కడుతారన్న అంశంపైనా స్పందించలేదు. ఫలితాలు వెలువడేవరకు వేచిచూస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే చంద్రబాబుతో టచ్‌లోనే ఉన్నట్టు ఓ ప్రశ్నకు బదులిచ్చారు. మరోవైపు అధికార అన్నాడీఎంకే కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తోసిపుచ్చింది. ఎన్నికల్లో తమ పార్టీ బాగా పనిచేసిందని, మంచి ఫలితాలు వస్తాయని తమిళనాడు సీఎం ఎడపాటి పళనిస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నమ్మబోము -
చంద్రబాబును ఫెవికాల్ బాబు అంటున్నారు
-
క్షణమొక యుగం
సాక్షి, తాడిపత్రి: సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో మొదటి విడతలోనే పూర్తయ్యాయి. ఎంతో ఉత్కంఠగా సాగాయి. దేశవ్యాప్తంగా ఏడు విడతలు పూర్తయిన తరువాతనే ఫలితాలు విడుదల కానున్నాయి. చివరి విడతగా ఆదివారం ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈనేపథ్యంలో అభ్యర్థులు సుదీర్ఘ కాలం ఎదురుచూడాల్సి వచ్చింది. దీంతో వారిలో ఆందోళన ఎక్కువ అవుతోంది. కౌటింగ్ సమయానికి ఇక రెండు రోజులే ఉండడంతో ఉత్కంఠతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈవీఎంలలో తీర్పు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి మొదటి విడతలోనే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మార్చి 18న నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 25 వరకు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రధాన పార్టీలు వైఎస్సార్సీపీ, టీడీపీ నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. వైఎస్సార్సీపీ నుంచి గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ, అధ్యక్షుడు వైయస్.జగన్మోహన్రెడ్డి, టిడిపి నుండి చంద్రబాబునాయుడులు తమ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్‌లో జిల్లా వ్యాప్తంగా 81.09శాతం ఓటింగ్ నమోదైంది. నిద్ర కరువు ఫలితాల కోసం 40 రోజులకు పైగా వేచి చూడాల్సి రావడంతో అభ్యర్థులకే కాదు వారి అనుచరులకూ నిద్ర కరువైంది. ఓటరు తీర్పు ఎలా ఉంటుందో అని తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు. కనీసం ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడకూడదని నిబంధనలు ఉండడంతో ఫలితాలు ఎలా ఉంటాయో అని తీవ్రంగా ఆందోళనకు గురయ్యారు. పార్టీపరంగా చూస్తే తమ కార్యకర్తలతో అంచనాలు వేసుకుంటున్నారు. ఎక్కడ ఓట్లు పడ్డాయే...ఎక్కడ పడలేదో లెక్కలు వేసుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో నాయకులు, కార్యకర్తల నుంచి అభ్యర్థులు ఒక్కొక్కరూ ఒక్కో రకం ఫలితాలు చెబుతున్నారు. దీంతో అభ్యర్థుల ఆందోళన మరింత పెరుగుతోంది. సర్వేల మీద సర్వేలు పోలింగ్ సరళిని గమనించిన తర్వాత ఓటమి తప్పదని టిడిపి నాయకులు అంచనా వేసుకుంటున్నారు. అయినా ఎక్కడో ఆశ మెదలుతోంది. దీంతో బూత్‌ల వారిగా ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో ఫోన్లు, ఇంటింటి సర్వేలు చేయించుకుంటున్నారు. తాడిపత్రిలో ఈసారి ఓటమి తప్పదనే వార్తలు వినిపిస్తుండంతో ఇప్పటికే మూడు సార్లు సర్వే నిర్వహించారు. ఎవరికి ఓటేశారు?ఎందుకు వేశారు? అంటూ నియోజకవర్గంలోని ప్రజలకు ఫోన్లు చేస్తున్నారు. రోజుకు కనీసం మూడుమార్లు ఫోన్లు వస్తున్నాయని కొందరు చెబుతున్నారు. పెద్దవడుగూరు, యాడికి, పెద్దపప్పూరు మండలాల్లో తమకు ఓటేశారాని ఆరా తీస్తున్నారు. -
చంద్రబాబుపై శివసేన వ్యంగ్యాస్త్రాలు
-
‘చంద్రబాబుది విచిత్ర మెంటాలిటీ..’
హైదరాబాద్: ‘పుల్వామా ఉగ్రదాడి’అనంతరం దేశం అంతా ఒక్కటిగా నిలవాల్సిన సమయంలో కొన్ని పార్టీలు పాకిస్తాన్ అనుకూల భాషను వాడటంతోనే ప్రజలు తిరగబడ్డారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నవభారత నిర్మాణం కోసం పనిచేస్తుంటే.. ప్రతిపక్షపార్టీలు దేశ సమగ్రతను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఆయన మాట్లాడారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వ పనితీరు, అవినీతి రహిత పాలన, అభివృద్ది, సాహసోపేతమైన నిర్ణయాలు, దేశ అంతర్గత భద్రతలో ఎక్కడ రాజీపడని తీరుతోనే ఎన్డీఏకు మరోసారి ప్రజల కట్టం కట్టనున్నారని అభిప్రాయపడ్డారు. ఎగ్జిట్ ఫలితాలకు మించి ఎన్డీఏకు సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుది విచిత్ర మెంటాలిటీ అంటూ లక్ష్మణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. సర్జికల్ స్ట్రైక్ చేస్తే.. రుజువులు కావాలా? ‘సైనికులు ఎంతో సాహసోపేతంగా సర్జికల్ స్ట్రైక్ చేస్తే ప్రతిపక్షాలు రుజువులు అడిగాయి. ఆ దాడిలో దోమలు కూడా చావలేదని ఆరోపించాయి. దేశ సైనికుల మీద కన్నా.. ఉగ్రవాది మసద్ అజార్‌పైనే ప్రతిపక్ష పార్టీలు నమ్మకం ఉంచాయి. దేశంలో రామరాజ్యం రాబోతుంది. మోదీ ఓటమికి కూటమి కట్టి అజెండా లేకుండా వెళ్లారు. జైల్ నుంచి బెయిల్ మీద ఉన్న వాళ్లంతా కూటమి కట్టారు. ఈ కూటమిలను ప్రజలు నమ్మలేదు. ఎన్డీఏకు గతం కన్నా ఎక్కువ సీట్లే వస్తాయి. పశ్చిమబెంగాళ్‌లో మమతా బెనర్జీ నియంతృత్వ పాలన సాగించింది. మమత కోటలకు బీటలు పడుతున్నాయి. బెంగాళ్లో కాషాయ జెండా ఎగరేస్తాం ‘ట్యాంపరింగ్ అన్నావ్.. ఐనా గెలుస్తా అంటున్నావ్?’ ఓటమికి చంద్రబాబు సాకులు వెతుకుతున్నారు. ట్యాంపరింగ్ జరిగింది అంటున్నారు.. మళ్లీ నేనే గెలుస్తానని పరస్పర విరుద్ద ప్రకటనలు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో నువ్వు గెలిస్తే ఈవీఎంలు బాగా పనిచేశాయి. కానీ ఇప్పుడు ఓడిపోయే పరిస్థితి వచ్చే సరికి ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయి అంటున్నావు. అందుకే బాబును యూటర్న్ మహానుభావుడు అనేది. చంద్రబాబు విచిత్ర మెంటాలిటీలో ఉన్నారు’అంటూ లక్ష్మణ్ మండిపడ్డారు. -
‘లగడపాటి.. వాళ్లు ఇక నీ ఫోన్లు కూడా ఎత్తరు’
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్ సర్వేపై వైఎస్సార్ సీపీ నేత విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘లగడపాటి ఎగ్జిట్ పోల్ సర్వేను నమ్మి ఎగ్జయిట్ అయిన తెలుగు తమ్ముళ్లు ఈ నెల 23న తర్వాత తేడా వస్తే ఆయన్ను నిలదీసేట్టున్నారు. పార్టీ ఓడి, బెట్టింగుల్లో నష్టపోయినోళ్లు ఊరుకుంటారా? మాజీ ఎంపీవి కాబట్టి పోలీసు ప్రొటెక్షన్ అడగొచ్చు తప్పులేదు. బాబు, కిరసనాయిలు రేపటి నుంచి నీ ఫోన్లు కూడా ఎత్తరు. రాజగోపాల్ సర్వేలో ఆయన మెదడును ఆయన డీఎన్ఏ డామినేట్ చేసింది’ అని విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నదేమిటో తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు సోనియా, ఉత్తరాది నేతల పాదాల ముందు పడేశారని విజయసాయిరెడ్డి విమర్శించారు. పొరుగున్న తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వినాశనాన్ని కోరుకుంటుందని బోరున విలపించిన చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నదేెెెమిటని ప్రశ్నించారు. ఎప్పుడు కలవాలో ఎప్పుడు విడిపోవాలో చంద్రబాబు కంటే వాళ్లకే ( ఉత్తరాది నేతలు, కాంగ్రెస్ నాయకులు) బాగా తెలుసని విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు. బాబును అందరూ ‘ఫెవికాల్ బాబా’ అంటున్నారట ప్రస్తుతం చంద్రబాబును ఢిల్లీలో అందరూ ‘ఫెవికాల్ బాబా’ అని పిలుస్తున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. పిలవని పేరంటంలా అందరి ఇళ్లపై పడి ఫొటోలు దిగుతూ, వాళ్లను, వీళ్లను కలుపుతా అంటూ చంద్రబాబు తిరుగుతున్నారని దుయ్యబట్టారు. ఇది చూసిన ఢీల్లీ నేతలు చంద్రబాబుకు ఈ మారుపేరు పెట్టారనీ, జోకులు వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ‘ఢిల్లీలో చంద్రబాబును అందరూ ‘ఫెవికాల్ బాబా’ అని పిలుస్తున్నారు. పిలవని పేరంటంలా అందరి ఇళ్లపై పడి ఫోటోలు దిగుతూ, వాళ్లను కలుపుతా వీళ్లను ఏకం చేస్తా అంటుంటే ఈ నిక్ నేమ్ తగిలించారట. ఎవరి టెన్షన్లలో వాళ్లుంటే సమయం, సందర్భం లేకుండా ఈ ఫెవికాల్ రాయబారాలేమిటని జోకులేసుకుంటున్నారట’ అని విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు. మరో ట్విట్లో ‘యూపీఏ, మాయా-అఖిలేశ్ ఫ్రంటులు చతికల పడ్డాయి. చంద్రబాబు గ్రాఫ్ ఢమాల్ అన్న విషయం కూడా వాళ్లకి అర్థమైంది. లగడపాటి సర్వేను అందరికీ చూపించబోగా విసుక్కున్నారట. పాపం అటు ఇటు కాకుండా పోయాడు బాబు’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. సొంత రాష్ట్రంలో గెలిచే సీన్ లేక ఢిల్లీ తిరుగుతున్నారు సొంత రాష్ట్రంలో గెలిచే సీన్ లేక సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ, లక్నోలో తిరుగుతున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్డీయేతర పార్టీలు అస్థిత్వ సమస్యను ఎదుర్కొంటుంటే చంద్రబాబు ఐక్యత చర్చలంటూ తిరుగుతున్నారని విమర్శించారు.‘ ఏడో దశ ఎన్నికల్లో తీరిక లేకుండా ఉంటే చంద్రబాబు వెళ్లి మాయా, అఖిలేశ్, రాహుల్, పవార్లను ఫోటో సెషన్ల కోసం హింస పెడుతున్నాడట. సొంత రాష్ట్రంలో గెలిచే సీన్ లేక ఢిల్లీ, లక్నోలలో తిరుగుతున్నాడు. ఎన్డీఏ యేతర పార్టీలు అస్థిత్వ సమస్యను ఎదుర్కొంటుంటే ఐక్యత చర్చలంట’ అని విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు. -
‘అక్కడ 53 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పని తేలింది’
న్యూఢిల్లీ : పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. దేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలు ఉండగా 542 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వెల్లూరులో ఈసీ ఎన్నికలు రద్దు చేసింది. ఎన్నికల్లో ప్రజానాడి ఎటువైపు ఉందో తెలుసుకోవడానికి పార్టీలతో పాటు జనాలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీ కూటమి దాదాపుగా 300 సీట్లు గెలుచుకుంటుందని.. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ 127 సీట్లకు పరిమితమయ్యే అవకాశం ఉందని సూచించాయి. ఈ రెండు కూటముల్లో లేని ప్రాంతీయ పార్టీలు 115 స్థానాలను కైవసం చేసుకునే పరిస్థితి కనుబడుతోందని సర్వే ఫలితాలు విశ్లేషిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్షాలు ఎగ్జిట్ పోల్స్ పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్‌ను నేను నమ్మను: మమతా బెనర్జీ ‘ఎగ్జిట్ పోల్స్ గాసిప్‌ను నేను నమ్మను. ఈ గాసిప్ ద్వారా జనాల దృష్టి మరల్చి.. వేలాది ఈవీఎంల్లో అవకతవకలకు పాల్పడటం, వాటిని మార్చడమే లక్ష్యం. ఇలాంటి సమయంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకమవ్వాలని, దృఢంగా కావాలని నేను కోరుతున్నాను. ఈ యుద్ధంలో మనందరం కలిసి పోరాడాలి’ అని మమత ట్వీట్ చేశారు. I don’t trust Exit Poll gossip. The game plan is to manipulate or replace thousands of EVMs through this gossip. I appeal to all Opposition parties to be united, strong and bold. We will fight this battle together — Mamata Banerjee (@MamataOfficial) May 19, 2019 ప్రారంభం నుంచి జరుగుతుంది ఇదే : రాహుల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ఈవీఎంలతో పాటు, ఎన్నికల షెడ్యూల్‌ను కూడ ప్రభావితం చేశారని విమర్శలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ వెలువడడానికి కొన్ని క్షణాల ముందే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలక్టోరల్ బాండ్ , ఈవీఎంలతో పాటు ఎన్నికల షెడ్యూల్‌ను కూడా మోదీ ప్రభావితం చేశారని రాహుల్ విమర్శించారు. నమో టీవీ, ఆర్మీని కూడ మోదీ తనకు అనుకూలంగా ఉపయోగించుకొన్నారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు కేదార్‌నాథ్‌లో పూజలు అంటూ మోదీ డ్రామాలు ఆడుతున్నారు. ఈసి కూడా మోదీకి పూర్తిగా లొంగిపోయింది అంటూ రాహుల్ విమర్శలు చేశారు. From Electoral Bonds & EVMs to manipulating the election schedule, NaMo TV, “Modi’s Army” & now the drama in Kedarnath; the Election Commission’s capitulation before Mr Modi & his gang is obvious to all Indians. The EC used to be feared & respected. Not anymore. — Rahul Gandhi (@RahulGandhi) May 19, 2019 ఎగ్జిట్ పోల్స్ ప్రజల నాడి పట్టలేదు : చంద్రబాబు ‘ప్రజల నాడి తెలుసుకోవడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయి. వాస్తవాలకు విరుద్ధంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఉన్నాయి. గతంలోనూ తప్పులు ఇచ్చాయి. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడడంలో ఎలాంటి అనుమానం లేదు. కేంద్రంలో బీజేపీయేతర పార్టీలు ఎక్కువ సీట్లు సాధిస్తాయనే నమ్మకం ఉంది’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. Time and again exit polls have failed to catch the People's pulse. Exit polls have proved to be incorrect and far from ground reality in many instances. While undoubtedly TDP govt will be formed in AP, we are confident that non-BJP parties will form a non-BJP govt at the center. — N Chandrababu Naidu (@ncbn) May 19, 2019 ఎగ్జిట్ పోల్స్ అన్ని తప్పే : శశి థరూర్ ‘ఎగ్జిట్ పోల్స్ అన్ని తప్పేనని నా నమ్మకం. గత వారం ఆస్ట్రేలియాలో 56 వేర్వేరు ఎగ్జిట్ పోల్ ఫలితాలు తప్పని రుజువైంది. మన దేశంలో జనాలు ప్రభుత్వాలకు భయపడి.. తాము ఏ పార్టీకి ఓటు వేశామో చెప్పరు. వాస్తవ ఫలితాల కోసం 23 వరకూ ఎదురు చూస్తాం’ అని శశి థరూర్ ట్వీట్ చేశారు. I believe the exit polls are all wrong. In Australia last weekend, 56 different exit polls proved wrong. In India many people don’t tell pollsters the truth fearing they might be from the Government. Will wait till 23rd for the real results. — Shashi Tharoor (@ShashiTharoor) May 19, 2019 కాంగ్రెస్ పార్టీ చనిపోతే మంచిది : యోగేంద్ర యాదవ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల పట్ల రాజకీయ పరిశీలకుడు యోగేంద్ర యాదవ్ స్పందించారు. ‘ఒక వేళ ఈ ఎన్నికల్లో గనక కాంగ్రెస్ పార్టీ బీజేపీని నిలవరించలేకపోతే.. భారతదేశ చరిత్రలో ఆ పార్టీకి సానుకూల పాత్ర లేదని స్పష్టమవుతోంది. అప్పుడిక కాంగ్రెస్ పార్టీ చనిపోతే మంచిది’ అంటూ ట్వీట్ చేశారు. The Congress must die. If it could not stop the BJP in this election to save the idea of India, this party has no positive role in Indian history. Today it represents the single biggest obstacle to creation of an alternative. My reaction to @sardesairajdeep https://t.co/IwlmBmf75d — Yogendra Yadav (@_YogendraYadav) May 19, 2019 -
‘23 వరకూ ఎదురుచూద్దాం’
సాక్షి, న్యూఢిల్లీ : నిన్న వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్ని తప్పని, తాను వాటిని విశ్వసించబోనని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ అన్నారు. మే 23న వచ్చే ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాలోని జరిగిన విధంగా ఇండియాలో కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పుతాయన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. ‘ ఆదివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నమ్మడం లేదు. ఆస్ట్రేలియాలో గతవారం 56 ఎగ్జిట్ పోల్స్ తప్పుగా తేలాయి. భారత్‌లో చాలామంది ప్రజలు తామెవరికి ఓటేశామో బహిరంగంగా చెప్పరు. అసలు ఫలితాల కోసం మే 23 వరకూఎదురుచూస్తాం’ అని శశిథరూర్ పేర్కొన్నారు. (చదవండి : బీజేపీకే ప్రజామోదం) కాగా, నిన్న(ఆదివారం) సాయంత్రం తుది విడత ఎన్నికల పోలింగ్ ముగియగానే వివిధ చానళ్లన్నీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. దాదాపు అన్నీ ఎన్డీయే మరోమారు అధికారంలోకి రాబోతోందని తేల్చి చెప్పాయి. ఎన్డీయేకు 300కు పైగా స్థానాలు వస్తాయని స్పష్టం చేశాయి. -
చంద్రబాబుకు శివసేన చురకలు
ముంబై: కేంద్రంలో విపక్షాలను ఏకం చేసి, ఎన్డీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలను శివసేన ఎద్దేవా చేసింది. కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్న ప్రశ్నకు ఇప్పటికే సమాధానం లభించిందని తమ పత్రిక ‘సామ్నా’లో రాసిన సంపాదకీయంలో శివసేన పేర్కొంది. ‘ప్రధాని పదవికి ప్రతిపక్షంలో కనీసం ఐదుగురు పోటీదారులు ఉన్నారు. కానీ వీరి కలలు కల్లలయ్యే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్న ప్రశ్నకు ఇప్పటికే జవాబు దొరికింది. బీజేపీ 300 సీట్లు గెలుస్తుందని అమిత్ షా ముందే చెప్పారు. ఐదో విడత ఎన్నికలు ముగిసేసరికే బీజేపీ తన లక్ష్యాన్ని చేరుకుంద’ని శివసేన తెలిపింది. ఎటువంటి కారణం లేకుండానే చంద్రబాబు తనకు తానుగా ఎందుకు ఆయాసపడిపోతున్నారని ప్రశ్నించింది. ఆయన పడుతున్న ఆత్రుతకు ఈనెల 23న ఫుల్‌స్టాఫ్ పడనుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. కాగా, గత వారం రోజులుగా చంద్రబాబు హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సోనియా, రాహుల్ గాంధీలతో పాటు శరద్ పవార్, మాయావతి, అఖిలేశ్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, శరద్ యాదవ్‌లను కలిసి చర్చోప చర్చలు సాగిస్తున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందే విపక్షాలన్నీ ఒక తాటిపైకి రావాలన్న ఉద్దేశంతో ఆయన ఢిల్లీ యాత్రలు చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్డీఏకు అనుకూలంగా రావడంలో ప్రతిపక్షాలు ఆలోచనలో పడ్డాయి. ఫలితంగా ఈరోజు జరగాల్సిన ఢిల్లీ పర్యటనను మాయావతి రద్దు చేసుకున్నారు. -
ఎగ్జిట్ పోల్స్ ,మారుతున్న రాజకీయ పరిణామాలు
-
ఎగ్జిట్ పోల్సే.. ఎగ్జాట్ పోల్స్ కాదు
సాక్షి, గుంటూరు : ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మొద్దంటున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. 1999 నుంచి వస్తోన్న ఎగ్జిట్ పోల్స్‌లో చాలా వరకూ తప్పుడు సమాచారాన్నే ఇచ్చాయన్నారు. శాంతి విశ్వవిద్యాలయం నుంచి తొలి డాక్టరేట్ పొందిన మొదటి భారతీయుడైన ఆయనకు ఆదివారం గుంటూరులోని క్లబ్లో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో 42 ఏళ్ల తర్వాత తొలిసారి తాను లేకుండా ఎన్నికలు జరిగాయన్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసినందున ఎగ్జిట్ పోల్స్ హడావుడి సహజమే అన్నారు. అయితే వీటికి ఎలాంటి బేస్ ఉండదని.. ఎగ్జాట్ పోల్స్ కోసం చూడాలని వెంకయ్య హితవు పలికారు. మే 23 న అసలైన ఫలితాలు వచ్చేవరకు గెలుపు పట్ల అన్ని పార్టీలు నమ్మకంగానే ఉంటాయన్నారు వెంకయ్య నాయుడు. కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం అన్నింటికన్నా ప్రధానమన్నారు. బలమైన ప్రజాస్వామ్యం ఉంటే.. ఎన్నికలు, అభ్యర్థులు, పార్టీల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. అంతేకాక నేటి చట్టసభలు నడుస్తున్న తీరు బాధాకరమని, రాజకీయ నేతల భాష అభ్యంతరకరంగా తయారైందని.. రాజకీయాలు చాలా దిగజారిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలలో ఎవరూ ఎవరికీ శత్రువులు కారని, వ్యక్తిగత దూషణలు, పరుష పదజాలం సరికాదని ఆయన సూచించారు. క్యారెక్టర్.. క్యాండిడేట్.. క్యాలిబర్.. కెపాసిటిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో అభ్యర్థులకు ఓట్లు వేయాలి. కానీ ప్రస్తుత రాజకీయల్లో క్యాష్, క్యాస్ట్ ఆధారంగా ప్రజలు ఓట్లు వేస్తున్నారని వెంకయ్యా నాయుడు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కోట్లు ఖర్చు పెడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థను మనమే అవహేళన చేసుకుంటున్నామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్; లక్నోలోనే మాయావతి
న్యూఢిల్లీ: కేంద్రంలో మళ్లీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేయడంతో విపక్షాలు డీలాపడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెల్లడితో హస్తినలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీలతో నేడు ఢిల్లీలో జరగాల్సిన భేటిని బహుజన సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి రద్దు చేసుకున్నారు. మాయావతి ఈరోజు ఢిల్లీకి రావడం లేదని, లక్నోలోనే ఉంటారని బీఎస్పీ నేత ఎస్సీ మిశ్రా తెలిపారు. మరోవైపు శనివారం లక్నోలో మాయావతితో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారు. ఈరోజు కూడా ఢిల్లీలో మాయావతిని ఆయన కలవనున్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి. అయితే మాయావతి ఢిల్లీ పర్యటన రద్దు చేసుకోవడంతో చంద్రబాబు హస్తిన పర్యటన కూడా సందిగ్ధంలో పడినట్టు సమాచారం. ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 సీట్లలో బీజేపీకి గరిష్టంగా 57 స్థానాల వరకు రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మహాకూటమికి 40 సీట్లు దాకా వచ్చే అవకాశముందని తెలిపాయి. కాంగ్రెస్‌కు రెండు సీట్లు వస్తాయని అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టీఆర్ఎస్కు పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్
-
ఏపీలో వైఎస్ఆర్సీపీదే అధికారం
-
130 సీట్లతో వైఎస్సార్సీపీ విజయం ఖాయం
వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా): ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 120 నుంచి 130 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుని విజయభేరి మోగించనున్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి స్పష్టం చేశారు. వెదురుకుప్పంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగి వేసారిన ప్రజలు తమ అభిమానాన్ని వైఎస్ జగన్‌కు ఓట్ల రూపంలో చూపించారని చెప్పారు. త్వరలో రాజన్నరాజ్యం రాబోతోందని, ఐదేళ్లుగా అవస్థలు పడ్డ ప్రజలకు మంచి పాలన అందించేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు. ఆంధ్ర ఆక్టోపస్‌గా పేరుపొందిన లగడపాటి రాజగోపాల్ టీడీపీ బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. తప్పుడు సర్వేలతో టీడీపీకి వంత పాడుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. చంద్రగిరిలో రీపోలింగ్ జరుగుతున్న సమయంలో ఎన్నికల కోడ్ నిబంధనలను ఖాతరు చేయకుండా టీడీపీకి అనుకూలంగా చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. కేవలం తన సామాజిక వర్గానికి ప్రయోజనం చేకూర్చేందుకు ఇలాంటి తప్పుడు సంకేతాలు ఇస్తున్నట్లు మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్ లగడపాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులను ఓట్లు వేయకుండా అడ్డుకుంటారా? చంద్రబాబు తన సొంత ఇలాకాలో దళితులను స్వేచ్ఛగా ఓట్లు వేయకుండా అడ్డుకోవడం విచారకరమన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రబాబు సామాజికవర్గం పెత్తనంతో ఎస్సీ, ఎస్టీలు ఓటు హక్కుకు దూరమైనట్లు చెప్పారు. నేటికీ ఇలాంటి దుస్థితి నెలకొనడంపై బాబు సిగ్గుతో తలదించుకోవాలని సూచించారు. ఇన్నేళ్లుగా ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించి ఎస్సీ, ఎస్టీలపై పెత్తనాన్ని చెలాయించినట్లు చెప్పారు. -
లగడపాటి రాజగోపాల్‌ది లత్కోర్ సర్వే
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ది లత్కోర్ సర్వే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పూతలపట్టు నియోజకవర్గం ఎన్నికల అబ్జర్వర్ శైలజ చరణ్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ఆంధ్ర బెట్టింగ్ బుకీలతో డీల్ కుదుర్చుకొని బోగస్ సర్వేను ఆయుధంగా విడుదల చేశాడని దుయ్యబట్టారు. లగడపాటి సర్వేలను తెలుగు ప్రజలు నమ్మే పరిస్ధితి లేదని, ఆయన సర్వేలకు కాలం చెల్లిందన్నారు. లగడపాటి సర్వే అంటేనే బెట్టింగ్‌ల కోసమే అనేది అందరికీ తెలిసిన రహస్యమే అన్నారు. తెలంగాణలోమహా కుటమి గెలుస్తుందని ప్రకటించి బోల్తా పడ్డాడని, ఇప్పుడు అదే తప్పిదాన్ని పునరావృతం చేస్తున్నాడన్నారు. బెట్టింగ్‌లను ప్రోత్సహించేలా బోగస్ సర్వే విడుదల చేసిన లగడపాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యమన్నారు. బాబు ప్రాపకం కోసమే.. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వెలగపల్లి ప్రదీప్ హనుమాన్ జంక్షన్ రూరల్ (గన్నవరం): తన రాజకీయ జీవితం అగమ్యగోచరంగా మారడంతో లగడపాటి రాజగోపాల్ ఎన్నికల ఫలితాలపై జ్యోతిష్యం చెప్పుకుంటూ మీడియాలో హల్చల్ చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వెలగపల్లి ప్రదీప్ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ బెట్టింగ్ రాయుళ్లను తప్పుదోవ పట్టించి రూ.కోట్లు దోచుకోవడంలో భాగంగానే చంద్రబాబు అండ్ కో లగడపాటిని అడ్డుపెట్టుకుని సర్వే నాటకాలు ఆడిస్తున్నారని ఆరోపించారు. -
ఎగ్జిట్ పోల్స్‌లో టీడీపీకి చావుదెబ్బ
-
వైఎస్ఆర్సీపీ ప్రభంజనం
-
నమో నమ:
2014లో ప్రధాని పీఠాన్నిచ్చిన యూపీలో ఈసారి బీజేపీకి భారీ దెబ్బ తప్పదు.. మమత, అఖిలేశ్–మాయావతి, నవీన్ పట్నాయక్, స్టాలిన్ వంటి ప్రాంతీయ పార్టీల నేతలు బీజేపీ జోరును విజయవంతంగా అడ్డుకుంటారు.. మొన్నటివరకు వెన్నంటి ఉన్న హిందీబెల్ట్ ఈసారి బీజేపీకి మొహం చాటేయడం ఖాయం.. మోదీ మళ్లీ ప్రధాని కావడం దాదాపుగా అసంభవం.. మోదీ, అమిత్ షా ముఖంలో ఆ ఆందోళన స్పష్టంగా కనబడుతోంది.. ఇదీ ఏడు విడతల వారీగా జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాజకీయ విశ్లేషకులు వేసిన అంచనాలు. కానీ ఈ అంచనాలేవీ నిజం కాకపోవచ్చని.. మోదీ మరోసారి స్పష్టమైన మెజారిటీతో ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తారని పోస్ట్‌పోల్ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. కనీసం 300 సీట్లతో ఎన్డీయే రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోబోతుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. న్యూఢిల్లీ: హోరాహోరీగా సాగిన 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీకే ప్రజామోదం ఉంటుందని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేస్తున్నాయి. మోదీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఆదివారం సాయంత్రం విడుదల చేసిన అంచనాల్లో పేర్కొన్నాయి. ఏడుదశల్లో హోరాహోరీగా జరిగిన పోరులో.. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల నుంచి తీవ్రమైన పోటీని తట్టుకుని మరీ మోదీ మరోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తారని అభిప్రాయపడ్డాయి. ప్రధానిగా మోదీ పనితీరుకు, కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవానికి, ప్రాంతీయ పార్టీల సత్తాకు అసలు సిసలు పరీక్షగా మారిన ఈ ఎన్నికల్లో ప్రజలు మోదీకే జై కొట్టబోతున్నారని వెల్లడించాయి. దాదాపుగా అన్ని సంస్థల సర్వే ఫలితాల్లోనూ ఎన్డీయే మేజిక్ ఫిగర్ (272)ను దాటి స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని వెల్లడైంది. 2014 ఎన్నికల్లో దారుణ పరిస్థితులను ఎదుర్కొన్న కాంగ్రెస్ గతంలో కంటే కాస్త మెరుగుపడినా.. బీజేపీకి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేదని సర్వేలు చెబుతున్నాయి. ఎన్నికలు జరిగిన 542 స్థానాలకు గానూ బీజేపీ కూటమి దాదాపుగా 300 సీట్లు గెలుచుకుంటుందని.. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ 127 సీట్లకు పరిమితమయ్యే అవకాశం ఉందని సూచించాయి. ఈ రెండు కూటముల్లో లేని ప్రాంతీయ పార్టీలు 115 స్థానాలను కైవసం చేసుకునే పరిస్థితి కనుబడుతోందని సర్వే ఫలితాలు విశ్లేషిస్తున్నాయి. ప్రభావవంతంగా మహా ఘట్బంధన్ అత్యంత కీలమైన మహారాష్ట్ర సహా హిందీ బెల్ట్‌లోని గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ మెజారిటీ సీట్లు సాధిస్తుందని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడిస్తున్నాయి. మోదీ వర్సెస్ దీదీ రణరంగంగా మారిన పశ్చిమ బెంగాల్లో బీజేపీ అనూహ్యంగా దూసుకుపోనుందని.. తృణమూల్‌కు గట్టిపోటీ ఇచ్చిందని సర్వేలు తెలియజేస్తున్నాయి. దేశంలోనే అత్యధిక స్థానాలున్న (80 ఎంపీలు) ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ–బీఎస్పీ మహాఘట్బంధన్ ప్రభావం స్పష్టంగా ఉందని పలు ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు సూచిస్తున్నాయి. ఇక్కడ బీజేపీకి 40 సీట్ల వరకు రావొచ్చని అభిప్రాయపడ్డాయి. అయితే యూపీలో కోల్పోయే సీట్ల నష్టాన్ని పశ్చిమ బెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో కొంతమేరనైనా పూడ్చుకోవాలన్న బీజేపీ ప్రయత్నాలు విజయవంతమయ్యే సూచనలు కనబడుతున్నాయి. 2014 ఎన్నికల్లో యూపీలో బీజేపీ 71 సీట్లు గెలుచుకుంది. ప్రియాంక, రాహుల్ ప్రభావమేదీ? గతేడాది చివర్లో జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలవడం, కాంగ్రెస్ బలం పుంజుకోవడం, మోదీ సర్కారు తీసుకున్న పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు, వ్యవసాయ సంక్షోభం, యూపీ ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమి మొదలైన కారణాలతో మోదీకి ఎదురుగాలి వీస్తోందనే చర్చ మొదలైంది. బాలాకోట్ దాడుల ప్రభావం బీజేపీకి నైతిక బలాన్నిస్తుందని భావించినప్పటికీ.. వ్యవసాయరంగ సమస్యలు, నిరుద్యోగుల్లో అసంతృప్తి వంటివాటిపైనే కాంగ్రెస్ ప్రధానంగా దృష్టిసారించింది. దీంతో బీజేపీకి ఎదురుగాలి తప్పదని.. పరిశీలకులు అంచనా వేశారు. ప్రియాంక గాంధీ రాక కాంగ్రెస్‌కు బలాన్నిస్తుందని భావించారు. 2014 ఎన్నికల్లో ఎన్డీయే 336 సీట్లు గెలుచుకుంటే, కాంగ్రెస్‌కు 59, ఇతరులకు 148 సీట్లు వచ్చాయి. అయితే, మోదీ హవా ఏ మాత్రం తగ్గలేదని, రాహుల్‌గాంధీ, ప్రియాంకలు అనుకున్నంతగా ఓటర్లను ఆకట్టుకోలేకపోయారని ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. దక్షిణభారతంలో మాత్రం బీజేపీ అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన చేయలేదని.. మొత్తంగా 30 స్థానాల్లోపే ఉండొచ్చని కూడా సర్వేలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీకే మెజారిటీ వస్తుందని మెజారిటీ సంస్థలు స్పష్టం చేశాయి. ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీ 18–20 స్థానాలు గెలుచుకుంటుందని తెలిపాయి. దేశానికి నిస్వార్థం, అంకితభావంతో సేవలు అందించిన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి సానుకూలంగా భారీగా పోలింగ్ జరిగిందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంగా చెబుతున్నాయి. సుపరిపాలన అందించిన మోదీకి ప్రజలు మరోసారి బ్రహ్మరథం పట్టారు. మోదీపై నిరాధార ఆరోపణలు, అబద్ధాలు చెప్పిన ప్రతిపక్షాలు ఈ ఫలితాలు చెంపపెట్టులాంటివి. –జీవీఎల్ నరసింహారావు, బీజేపీ ఆస్ట్రేలియాలో గతవారం 56 ఎగ్జిట్ పోల్స్ తప్పుగా తేలాయి. భారత్‌లో చాలామంది ప్రజలు తామెవరికి ఓటేశామో బహిరంగంగా చెప్పరు. అసలు ఫలితాల కోసం మే 23 వరకూ ఎదురుచూస్తాం. – శశిథరూర్, కాంగ్రెస్ రిపబ్లిక్ టీవీ డబుల్ ఎగ్జిట్ పోల్ మళ్లీ ఎన్డీయేనే..! 17వ లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలు మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికే పట్టం కట్టనున్నారని ప్రముఖ ఆంగ్ల వార్తా చానల్ రిపబ్లిక్‌టీవీ సీ–ఓటర్, జన్ కీ బాత్ సంస్థలతో కలసి నిర్వహించిన డబుల్ ఎగ్జిట్ పోల్ జోస్యం చెప్పింది. రిపబ్లిక్సీ–ఓటర్ సర్వే ప్రకారం ఎన్డీఏ 287 సీట్లు (42.3% ఓట్లు), కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ 128 స్థానాలు (28.1% ఓట్లు), యూపీ లోని బీఎస్పీ, ఎస్పీ, ఆరెల్డీతో కూడిన మహాగఠ్ బంధన్ 40 సీట్లు, రెండు కూటముల్లో లేని ఇతర పార్టీలు 87 సీట్లు గెలుచుకోనున్నాయి. 2014 ఎన్నికల్లో ఎన్డీఏకు 336 సీట్లు రాగా ఈసారి 49 సీట్లు తగ్గుతా యని ఈ సర్వే జోస్యం చెబుతోంది. మరోవైపు రిపబ్లిక్– జన్ కీ బాత్ సర్వే ప్రకారం ఎన్డీఏ 305 (45.5%), యూపీఏ 124 (24.5%), మహాఘట్బంధన్కు 26 సీట్లు సాధిస్తాయని తేలింది. యూపీలో బీజేపీ x మహాకూటమి ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 సీట్లలో బీజేపీకి 38, మహాకూటమికి 40, కాంగ్రెస్‌కు రెండు సీట్లు వస్తాయని రిపబ్లిక్–సీ ఓటర్ సర్వే అంచనా వేయగా రిపబ్లిక్–జన్ కీ బాత్ సర్వే బీజేపీకి 46–57 సీట్లు, మహాకూటమి 21–32 సీట్లు, కాంగ్రెస్ 2–4 సీట్లు వస్తాయని పేర్కొంది. మహరాష్ట్రలోని 48 సీట్లలో బీజేపీ–శివసేన కూటమికి 34, యూపీఏకు 14 సీట్లు లభిస్తాయని రిపబ్లిక్–సీ ఓటర్ సర్వే పేర్కొంది. బీజేపీ–శివసేన కూటమికి 34–39, కాంగ్రెస్, ఎన్సీపీతో కూడిన యూపీఏకు 8–12 సీట్లు లభిస్తాయని రిపబ్లిక్–జన్ కీ బాత్ సర్వేలో అంచనా వేశారు. అలాగే 42 సీట్లున్న పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు 29, బీజేపీకి 11, కాంగ్రెస్‌కు రెండు సీట్లు దక్కుతాయని సీ–ఓటర్–రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. బీజేపీకి 18–26, తృణమూల్ కాంగ్రెస్‌కు 13–21, కాంగ్రెస్‌కు మూడు సీట్లు వస్తాయని జన్ కీ బాత్ సర్వే తెలిపింది. మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో కమలం స్వీప్ మధ్యప్రదేశ్‌లోని 29 సీట్లలో బీజేపీకి 24, కాంగ్రెస్‌కు 5 స్థానాలు లభిస్తాయని సీ–ఓటర్ సర్వే, బీజేపీ 21–24, కాంగ్రెస్‌కు 5–8 సీట్లు గెలుచుకుంటాయని జన్‌కీబాత్ ఎగ్జిట్ పోల్ అంచనా వేశాయి. అలాగే ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఉన్న 26 ఎంపీ సీట్లలో బీజేపీకి 22, కాంగ్రెస్‌కు 4 సీట్లు దక్కుతాయని సీ–ఓటర్ ఎగ్జిట్ పోల్, బీజేపీకి 22–23, కాంగ్రెస్‌కు 3–4 సీట్లు దక్కుతాయని జన్‌కీబాత్ సర్వేలు జోస్యం చెప్పాయి. 40 సీట్లున్న బిహార్‌లో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీతో కూడిన ఎన్డీఏకు 33, ఆర్జేడీ, కాంగ్రెస్ తదితర పార్టీలున్న ప్రతిపక్ష కూటమికి 7 సీట్లు లభిస్తాయని సీ–ఓటర్ సర్వే జోస్యం చెప్పింది. జన్ కీ బాత్ సర్వే ప్రకారం ఎన్డీఏకు 28–31, ఆర్జేడీ కూటమికి 11–8 ఇతరులకు ఒక సీటు వస్తాయని అంచనా వేశారు. కర్ణాటకలో కాషాయపక్షానిదే హవా 28 సీట్లున్న కర్ణాటకలో బీజేపీకి 18, కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి 9 సీట్లు లభిస్తాయని, ఓ సీటును స్వతంత్ర అభ్యర్థి గెలుచుకుంటారని సీ–ఓటర్ సర్వే, బీజేపీకి 18–20, కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి 10–7 సీట్లు దక్కుతాయని జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ సూచిస్తున్నాయి. తమిళనాడులో పోలింగ్ జరిగిన 38 సీట్లలో కాంగ్రెస్, డీఎంకేతో కూడిన యూపీఏకు 27, బీజేపీ, ఏఐడీఎంకేతో కూడిన ఎన్డీఏకు 11 సీట్లు వస్తాయని సీ–ఓటర్ సర్వే తెలిపింది. జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ ప్రకారం ఎన్డీఏకు 9–13, యూపీఏకు 15–29 సీట్లు దక్కుతాయని అంచనా వేశారు. టైమ్స్ నౌ టీవీ చానల్ వీఎంఆర్ సంస్థతో కలసి నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మొత్తం 542 ఎంపీ స్థానాలకుగాను 306 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 3,211 ప్రత్యేక ప్రాంతాల్లో తాము సుమారు 40 వేల మందితో శాంపిల్ సేకరించామని, భౌగోళిక, ఓటింగ్ సరళిలను పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేసిన మరో 40 వేల మంది నుంచి సమాచారం సేకరించిన తరువాత తుది అంచనాకు వచ్చామని టౌమ్స్ నౌ వెల్లడించింది. తొలిదశ పోలింగ్ మొదలైన ఏప్రిల్ 11 నుంచి ఆదివారం జరిగిన తుది విడత వరకు సమాచార సేకరణ జరిగిందని తెలిపింది. తుది అంచనాల ప్రకారం ఎన్డీయే 306 స్థానాలు గెలుచుకోనుండగా యూపీఏ 132స్థానాలకు పరిమితం కానుంది. అదే సమయంలో ఇతర పార్టీలు మొత్తం 104 స్థానాల్లో విజయం సాధించ వచ్చు. కూటముల వారీగా ఓటింగ్ శాతాన్ని గమనిస్తే ఎన్డీయే 41.1% ఓట్లు కైవసం చేసుకోనుండగా యూపీఏ 31.7, ఇతర పార్టీలు 27.2 % ఓట్లు సాధిస్తాయని తెలిపింది. యూపీలో బీజేపీకి 58 సీట్లు దేశంలోనే అత్యధికంగా 80 ఎంపీ సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 58 స్థానాలు సాధిస్తుందని, కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలకు పరిమితమవు తుందని టైమ్స్ నౌ–వీఎంఆర్ ఎగ్జిట్ పోల్ లెక్క గట్టింది. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ, ఆర్ఎస్ఎల్పీలతో కూడిన మహాఘట్ బంధన్ 20 స్థానాలు సాధిస్తుందని అంచనా వేసింది. అలాగే 42 సీట్లున్న పశ్చిమ బెంగాల్లో టైమ్స్ నౌ–వీఎంఆర్ అంచనాల ప్రకారం బీజేపీ 11 స్థానాలు గెలుచుకోవచ్చు. అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ 28 స్థానాల్లోనూ, కాంగ్రెస్ రెండు స్థానాల్లోనూ విజయం సాధించవచ్చు. మొత్తం 48 స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ–శివసేన కూటమి 38 స్థానాల్లో విజయం సాధించనుండగా.. కాంగ్రెస్– ఎన్సీపీల కూటమి పది స్థానాలు గెలుచుకోనుంది. నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో మొత్తం 26 ఎంపీ స్థానాలు ఉండగా బీజేపీ అత్యధికంగా 23 స్థానాలు గెలుచుకోనుంది. కాంగ్రెస్ మూడు స్థానాలకే పరిమితం కానుంది. తమిళనాడు విషయానికొస్తే డీఎంకే 29 స్థానాలు, ఏఐఏడీఎంకే తొమ్మిది స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఎన్డీయేకి 300 వరకు సీట్లు న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో 300 వరకు సీట్లతో ఎన్డీయే సునాయాస విజయం సాధిస్తుందని ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. యూపీఏ 127, ఇతర పార్టీలు 123 వరకు సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేశాయి. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, బిహార్, ఉత్తర ప్రదేశ్‌ల్లో బీజేపీ దాని మిత్రపక్షాలు అత్యధిక స్థానా ల్లో విజయం సాధించనున్నట్లు అంచనా వేశాయి. హరియాణ, అసోం, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రా ల్లోనూ బీజేపీ విజయకేతనం ఎగురవేయనుంది. ఉత్తరప్రదేశ్‌లో 80 సీట్లలో బీజేపీకి 49 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీఎస్పీ, ఎస్పీల కూటమి 29 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్లో (42 సీట్లు) 2014 ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకు పరిమితమైన బీజేపీ ఈసారి 14 సీట్లతో రెండంకెలకు చేరుకోనుంది. టీఎంసీకి 26, కాంగ్రెస్‌కు 2 సీట్లు దక్కే అవకాశం ఉంది. మహారాష్ట్రలో (48 సీట్లు) బీజేపీ–శివసేనల విజయం సుస్పష్టమవుతోంది. ఒడిశాలో (21) మాత్రం బీజేపీ (10), అధికార బిజూ జనతాదళ్ (10) మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ ఒక సీటులో విజయం సాధించే అవకాశం ఉంది. తమిళనాడులో (38) బీజేపీ, ఏఐఏడీఎంకేల కూటమికి 11, డీఎంకే, కాంగ్రెస్‌ల కూటమి 27 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. బిహార్‌లో (40) బీజేపీ, జేడీయూలు 32 సీట్లలో విజయకేతనం ఎగురవేయనున్నాయి. గుజరాత్లో (మొత్తం 26) 23 సీట్లతో, రాజస్తాన్‌లో (25) 22 సీట్లతో బీజేపీ దాదాపుగా క్లీన్‌స్వీప్ చేయనున్నట్లు ఎగ్జిట్ పోల్స్‌ను బట్టి తెలుస్తోంది. కర్ణాటక.. కాషాయానిదే హవా దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నాలకు ఊపునిచ్చిన తొలి రాష్ట్రం కర్ణాటక. రాష్ట్రంలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలున్నాయి. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల అనంతరం జట్టు కట్టిన కాంగ్రెస్ జేడీఎస్‌లు ఒకవైపు.. బీజేపీ మరోవైపు తీవ్రంగా పోటీపడ్డాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోనుందంటున్నాయి. కాంగ్రెస్–జేడీఎస్ పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు సక్రమంగా జరక్కపోవడంతోపాటు.. ఇరు పార్టీల్లోనూ అంతర్గత కుమ్ములాటలు కూటమికి మైనస్ కానుంది. దీనికితోడు కర్ణాటకలోని తీర ప్రాంతంలో బీజేపీ పట్టు కొనసాగడం ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. 2014 ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో మొత్తం 17 స్థానాలు గెలుచుకోగా, వీటిల్లో అత్యధికం కోస్తా ప్రాంతం నుంచే రావడం గమనార్హం. తమిళనాడు .. డీఎంకేకు జై ప్రాంతీయ పార్టీల కలగూర గంప తమిళనాడులో ఈసారి డీఎంకే పూర్తి అధిపత్యం కనబరుస్తుందని ఎగ్జిట్‌పోల్స్ తేల్చి చెప్పాయి. మొత్తం 38 స్థానాలుండగా.. వెల్లూరు లోక్‌సభ స్థానం పోలింగ్ వాయిదా (భారీగా డబ్బు పట్టుబడడంతో) పడింది. కాంగ్రెస్, డీఎంకేతో సహా పలు పార్టీలకు యూపీయే కూటమిగా.. ఏఐఏడీఎంకే, పలు చిన్న పార్టీలతో బీజేపీ మరో కూటమిగా బరిలో నిలిచింది. ఇండియాటుడే ఎగ్జిట్‌పోల్స్ ప్రకారం.. డీఎంకే కూటమి 34–38 స్థానాల్లో.. బీజేపీ–ఏఐఏడీఎంకే కూటమి గరిష్టంగా 5చోట్ల గెలవొచ్చని తెలుస్తోంది. న్యూస్ 18– ఐఎస్పీఎస్ఓస్ అంచనా కాస్త భిన్నంగా ఉంది. ఈ సర్వే డీఎంకే 22–24 స్థానాలు.. బీజేపీ–ఏఐఏడీఎంకే 14–16 స్థానాలను అంచనావేస్తోంది. జయలలిత, కరుణానిధి వంటి దిగ్గజాల మరణం తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలపై ఆసక్తి పెరిగింది. కేరళ.. కాంగ్రెస్‌కు బలం దశాబ్దాలుగా తమను గెలిపిస్తున్న అమేథీతోపాటు కేరళలోని వయనాడ్‌లోనూ పోటీచేయాలన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయాన్ని చాలామంది తప్పుపట్టినప్పటికీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి చూస్తే అతడి నిర్ణయం సరైందే అనిపించకమానదు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకోగలదని దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్ చెబుతూండటం ఇందుకు కారణం. రాష్ట్రంలో మొత్తం 20 లోక్‌సభ స్థానాలు ఉండగా.. యూడీఎఫ్ 15 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇది 3స్థానాలు ఎక్కువ. ఇదే సమయంలో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ 3చోట్ల బీజేపీ ఒకచోట గెలిచే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి. బెంగాల్.. దీదీ కోటకు బీటలు పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ కోటలోకి చొరబడాలన్న కమలనాథుల ఆశ నెరవేరనున్నట్టు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో మమత ఆధ్వర్యంలోని తృణమూల్‌కు 24–28 సీట్లు వస్తాయని, బీజేపీ 14 సీట్లలో జయకేతనం ఎగురవేసే అవకాశం ఉందని సర్వేలంటున్నాయి. 2014 ఎన్నికల్లో తృణమూల్ 34 సీట్లు గెలుచుకోగా, బీజేపీకి కేవలం 2 స్థానాలే దక్కాయి. అయితే ప్రధాని మోదీ ఏకంగా రాష్ట్రంలో 17 ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారంటే బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతోంది. రాష్ట్రంలో పోలింగు హింసాత్మకంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేకత, సీపీఎం శ్రేణులు పరోక్షంగా బీజేపీకి సహకరించడం మమతకు నష్టం కలిగించి ఉండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. మహారాష్ట్ర.. ఎన్డీయేదే పైచేయి దేశంలో యూపీ తర్వాత రెండో పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో ఈసారి కూడా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయకే మెజారిటీ సీట్లు దక్కే అవకాశం ఉంది. మొత్తం 48 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీయే 38–42 సీట్లు.. యూపీయే 6–10 చోట్ల గెలుస్తాయని సర్వేలు పేర్కొన్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ కూటమి 42 సీట్లు గెలుచుకుంది. బీజేపీ–శివసేనల విభేదాలను అనుకూలంగా మలుచుకోవాలన్న కాంగ్రెస్ ఆశ నెరవేరలేదు. పుల్వామా దాడి, బాలాకోట్ సర్జికల్ దాడుల నేపథ్యంలో బీజేపీ–శివసేన విజయం సాధిస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కీలకంగా మారాయి. గుజరాత్.. బీజేపీ క్లీన్ స్వీప్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయనుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి తెలుస్తోంది. రాష్ట్రంలోని 26 లోక్‌సభ సీట్లలో.. బీజేపీకి 25 సీట్లు రావచ్చని న్యూస్18–ఐపీఎస్వోఎస్ సర్వేలో వెల్లడయింది. ఇక్కడ కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాకపోవచ్చని ఆ సర్వే వెల్లడించింది. న్యూస్ 24–చాణక్య సర్వే ప్రకారం బీజేపీ మొత్తం 26 సీట్లలోనూ జయకేతనం ఎగురవేయనుంది. ఇండియాటుడే–యాక్సిస్ సర్వేలో కాంగ్రెస్‌కు ఒక సీటు రావచ్చని వెల్లడయింది. 2014 ఎన్నికల్లో మొత్తం 26 స్థానాలూ బీజేపీకే దక్కాయి. యూపీ.. మహాఘట్బంధన్ సత్తా అత్యధిక లోక్‌సభ సీట్లున్న యూపీలోని 80 సీట్లలో బీజేపీకి అత్యధిక సీట్లు వస్తాయని టైమ్స్ నౌ (58), రిపబ్లిక్ టీవీ–జన్‌కీబాత్ (53), ఇండియాటుడే (62–68) ఎగ్జిట్‌పోల్స్ సూచిస్తున్నాయి. కాగా, బీఎస్పీ–ఎస్పీ–ఆర్ఎల్డీ మహాఘట్బంధన్కు 20 స్థానాలకు పైనే దక్కుతాయని టైమ్స్ నౌ (20), జన్‌కీ బాత్ (24), సీ–ఓటర్ (40), న్యూస్ ఎక్స్ (41), నీల్సన్ (56) అంచనావేశాయి. ఎగ్జిట్‌పోల్ అంచనాల ప్రకారం ఎస్పీ–బీఎస్పీ మధ్య ఓట్ల బదిలీ బాగానే జరిగిందనీ, ఎస్సీ, బీసీలతోపాటు ముస్లింలు పెద్ద సంఖ్యలో కూటమికి ఓట్లేశారని అర్థమౌతోంది. కాంగ్రెస్‌కు 2–4 సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది. బిహార్.. ఎన్డీయే కూటమిదే.. బిహార్‌లోనూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మూడొంతులకు పైగా సీట్లు లభిస్తాయని మెజారిటీ సర్వేలు సూచిస్తున్నాయి. 40 లోక్‌సభ సీట్లున్న బిహార్‌లో ఎన్డీయే కూటమికి టైమ్స్ నౌ (30 సీట్లు), సీ–ఓటర్ (33), జన్‌కీ బాత్ (29) సీట్లు రావొచ్చని సర్వేలు అంచనావేశాయి. యూపీయే మహాకూటమికి 7–10 సీట్లే దక్కుతాయని సర్వేలు చెబుతున్నాయి. లాలూ యాదవ్ జైల్లో ఉండడం, కుటుంబంలో విబేధాల కారణంగా ఆర్జేడీకి ఓటేయలేదని తెలుస్తోంది. రాజస్తాన్.. 20కి పైనే 2014లో రాజస్తాన్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. ఈసారి కూడా 20కి పైగానే స్థానాలు కాషాయపక్షం గెలుచుకుంటుందని ఇండియా టుడే (22), టైమ్స్–నౌ (21), సీ–ఓటర్(22), టుడేస్ చాణక్య (25), ఏబీపీ నీల్సన్ (19) వస్తాయని అంచనావేశాయి. గతేడాది డిసెంబర్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో గరిష్టంగా ఆరుకు మించి సీట్లు రావనే అత్యధిక ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. రాజస్తాన్ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో వసుంధరా రాజేపై వ్యతిరేకతతో బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. అయితే మోదీ మళ్లీ ప్రధాని కావాలని లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని భారీ స్థాయిలో గెలిపిస్తున్నారని రాజకీయ పండితులు జోస్యం చెబుతున్నారు. ఒడిశా, మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్‌లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్డీయే గాలి వీస్తుండగా ఒడిశాలో (21 సీట్లు) మాత్రం బీజేపీ పక్షాలు, బిజూ జనతాదళ్ మధ్య పోటాపోటీ వాతావరణం కన్పిస్తోంది. ఎన్డీటీవీ బీజేడీ, బీజేపీలకు చెరో 10, కాంగ్రెస్‌కు 1 సీటు వస్తుందని అంచనా వేస్తే, సీఓటర్ బీజేడీకి 11 సీట్లు వస్తాయని అంచనా వేసింది. చాణక్య మాత్రం బీజేపీ 14 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. మధ్యప్రదేశ్‌లో (29 సీట్లు) బీజేపీ గాలి వీస్తుండటం గమనార్హం. ఎన్డీటీవీ, సీఓటర్, టైమ్స్ నౌ మూడూ బీజేపీ 24 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపాయి. -
దివాలాకోరు లగడపాటి సర్వే పెద్ద బోగస్
సాక్షి, అమరావతి: నలభై వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టి లగడపాటి రాజగోపాల్ దివాలా తీశారని, ఆయన ఇచ్చే సర్వే పెద్ద బోగస్ అని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. ఈ సర్వేను ఆసరా చేసుకుని ‘కిరసనాయిలు’ పగలు బాబుకు, రాత్రి బుకీలతో డీల్స్ కుదుర్చుతున్నాడన్నారు. తెలంగాణ ఎన్నికల్లో వీళ్లిద్దరూ ఇలాగే బోగస్ సర్వే ఇచ్చి రూ.వెయ్యి కోట్లు సంపాదించారని, మళ్లీ అదే డ్రామా ఆడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు విదిల్చే కాంట్రాక్టు, బుకీస్ ఇచ్చే కమీషన్లపై లగడపాటి రోజులు వెళ్లదీస్తున్నాడన్నారు. ‘భీమవరం, విజయవాడ కేంద్రాలుగా బెట్టింగ్ ఆడేవారు 90 శాతం మంది ఫ్యాన్ గెలుస్తుందని పెట్టారట. బుకీలు రూ.వేల కోట్లు నష్టపోయేట్టున్నారు. లగడపాటి, కిరసనాయిలు ఇద్దరూ కలిసి బాబు కోసం, బుకీల కోసం ఆడుతున్న డ్రామా ఇది’ అని పేర్కొన్నారు. ‘లగడపాటి లాంటి వారు సర్వే చేస్తారు. బుకీలు యాక్టివ్ అయిపోతారు. అమాయకులను నమ్మించి సైకిల్‌పై పందేలు పెట్టిస్తారు. తన పేపర్లో ఎన్ని సీట్లలో గెలిచేది కిరసనాయిలు రాస్తాడు. సాయంత్రం 6 గంటలలోగా బుకీలు సేఫ్’ అని దుయ్యబట్టారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి లగడపాటి ఊగాడని.. ఆ పార్టీ పరిస్థితి అర్థమై ఓడిపోయే దానికి ఎందుకులే అని తప్పుకున్నాడని, ఇప్పుడేమో పార్టీతో సంబంధం లేదని కోతలు కోస్తున్నాడని ఎద్దేవా చేశారు. -
ఫ్యాన్‌కే స్పష్టమైన ఆధిక్యం
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎన్నికలపై సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ మూడు సార్లు శాస్త్రీయంగా సర్వే చేసిందని ఆ సంస్థ చైర్మన్ డా. వేణుగోపాలరావు తెలిపారు. ఎగ్జిట్ పోల్‌లోనూ ఆ పార్టీకి మరింత ఆదరణ కనిపించిందని వివరించారు. ఎగ్జిట్ పోల్ వివరాలను ఆదివారం సాయంత్రం ఆయన సాక్షి మీడియాకు తెలిపారు. వైఎస్సార్సీపీకి క్లియర్ కట్ ఎడ్జ్ ఉందని తెలిపారు. టీడీపీ గ్రాఫ్ 2017 నుంచి పడిపోతూ, వైఎస్సార్సీపీ గ్రాఫ్ పెరుగుతోందని ఆయన వివరించారు. 2017లో ట్రాకర్లు పెట్టి ఇప్పటికి ప్రీపోల్, ఎగ్జిట్ పోల్, పోస్ట్‌పోల్...ఇలా మూడుసార్లు సర్వే చేశామని తెలిపారు. 2017 జూలైలో 1.05,000 శాంపిల్స్‌తో సర్వే చేయగా వైఎస్సార్సీపీకి 45.2 శాతం, టీడీపీకి 43.2 శాతం ఓటర్లు మొగ్గు చూపగా టీడీపీకి 82 సీట్లు, వైఎస్సార్సీపీకి 93 నియోజకవర్గాల్లో ఆధిక్యం లభించిందని వేణుగోపాలరావు వివరించారు. 2018 డిసెంబర్లో చేపట్టిన సర్వేలో వైఎస్సార్సీపీకి 44.2 శాతం, టీడీపీకి 41.5 శాతం ఓటర్లు మద్దతు పలికారని వివరించారు. వైఎస్సార్సీపీకి 98–110 సీట్లలోనూ, టీడీపీకి 55–63 సీట్లలో ఆధిక్యం కనపడింది. మూడో ట్రాకర్ ద్వారా చేపట్టిన సర్వేలో నియోజకవర్గానికి 2.500 శాంపిల్స్‌తో సర్వేచేశామని తెలిపారు. దీనిలో 47.8 శాతం వైఎస్సార్సీపీకి, 43.3 శాతం టీడీపీకి అనుకూలంగా ఉంది. టీడీపీ 53 స్థానాల్లో, వైఎస్సార్సీపీకి 122 సీట్లలో ఆధిక్యాన్ని కనబరిచింది. ఏప్రిల్ 2న చేపట్టిన ప్రీపోల్ సర్వేలో వైఎస్సార్సీపీకి 123 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ, టీడీపీ 48–51 స్థానాల్లో, జనసేన ఒక స్థానంలో గెలిచే అవకాశాలు కనిపించాయని వేణుగోపాలరావు వివరించారు. ఈ విధంగా వైఎస్సార్సీపీ గ్రాఫ్ పెరుగుతుండగా, టీడీపీ గ్రాఫ్ పడిపోతుందని ఆయన తెలిపారు. ఎగ్జిట్ పోల్‌లో వైఎస్సార్సీపీకి 133–135 అసెంబ్లీ స్థానాల్లో, టీడీపీకి 37–40 స్థానాల్లో, జనసేనకు ఒక్క స్థానంలో ఆధిక్యం ఉందన్నారు. పార్లమెంట్‌కు...వైఎస్సార్సీపీకి 21–22 స్థానాల్లో, టీడీపీకి 3–4 స్థానాల్లో గెలుపు అవకాశాలున్నాయన్నారు. పోల్మేనేజ్మెంట్లో వైఎస్సార్సీపీ సఫలం... వైఎస్సార్సీపీ పోల్మేనేజ్మెంట్లో ముందుంది. ఈసారి జగన్‌కు ఒక అవకాశం అనేది బాగా వినిపించి అది వేవ్‌గా మారిందని ఆయన చెప్పారు. సోషల్ మీడియా కాంపెయిన్లో వైఎస్సార్సీపీ దూసుకుపోయింది. పసుపు–కుంకుమ, డ్వాక్రా మహిళలకు టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలు ఫలించలేదు. పసుపు–కుంకుమ మహిళలు, డ్వాక్రా మహిళలు, నాన్ డ్వాక్రా మహిళల్లో ఎక్కువ మంది వైఎస్సార్సీపీకే మొగ్గుచూపారని వివరించారు. -
వైఎస్సార్సీపీ విజయభేరి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టించి అధికారంలోకి రానుందని ‘ఆరా’ సంస్థ అధిపతి షేక్ మస్తాన్‌వలి ప్రకటించారు. 175 అసెంబ్లీ స్థానాలకుగానూ వైఎస్సార్ సీపీ 119 సీట్లను ఖాయంగా గెల్చుకుంటుందని చెప్పారు. మరో 18 స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నువ్వా? నేనా? అన్నట్లుగా గట్టి పోటీలో ఉన్నారని, ప్రత్యర్థుల కన్నా 3 శాతం ఓట్ల ఆధిక్యతతో ఉన్నారని స్పష్టం అవుతోందన్నారు. ఈ స్వల్ప శాతం ఆధిక్యతను అంచనా వేయడం కష్టతరం కనుక కచ్చితంగా చెప్పలేకపోతున్నామని ఫలితాలపై విశ్లేషించారు. ఆ నియోజకవర్గాల్లో 3 శాతం ఆధిక్యత అలాగే కొనసాగితే వైఎస్సార్ సీపీ గెలుచుకునే అసెంబ్లీ స్థానాల సంఖ్య 135 వరకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర లేదని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎగ్జిట్ పోల్స్ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ 47 సీట్లకు పరిమితమవుతుందని తెలిపారు. జనసేనకు 2 స్థానాలు (ప్లస్ లేదా మైనస్ 1 సీట్లు) రావచ్చన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వెయ్యి శాంపిల్స్ చొప్పున తీసుకుని అభిప్రాయ సేకరణ చేశామని వివరించారు. లోక్‌సభ స్థానాల విషయానికి వస్తే వైఎస్సార్ సీపీకి 22 ఎంపీ సీట్లు (ప్లస్ లేదా మైనస్ 2 సీట్లు), టీడీపీకి 3 (ప్లస్ లేదా మైనస్ 2) ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొన్నారు. జనసేనకు ఒక్క ఎంపీ సీటు కూడా రాదన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ తాను పోటీ చేసిన భీమవరంలో గెలవరని, గాజువాకలో మాత్రం స్వల్ప ఆధిక్యతలో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. మంత్రి నారా లోకేష్ పోటీ చేసిన మంగళగిరిలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారని, అక్కడ ఎవరు గెలిచినా 2,000 – 3000 ఓట్ల తేడానే ఉంటుందని, అయితే లోకేష్ ఓటమి చవి చూసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి 48.78 శాతం, టీడీపీకి 40.15 శాతం, జనసేనకు 7.81 శాతం ఓట్లు, ఇతరులకు 3.26 శాతం ఓట్లు లభించి ఉంటాయనేది తమ అంచనా అని ఆయన చెప్పారు. -
జగన్‌కే జనామోదం
‘‘ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుకూల పవనాలు రాజకీయ ప్రభంజనం సృష్టించబోతున్నాయి. వైఎస్సార్ సీపీ విజయ భేరి మోగించనుంది. అసెంబ్లీలోనూ, లోక్‌సభ స్థానాల్లోనూ మూడింట రెండు వంతుల మెజారిటీ సీట్లను ‘ఫ్యాన్’ గెలుచుకోనుంది. మాట తప్పని, మడమ తిప్పని పాదయాత్రికుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్న సంకల్పంతో ప్రాంతాలు, వర్గాలతో సంబంధం లేకుండా అంతా వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పట్టారు. ఫలితాలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఏకపక్షంగా ఉంటాయి. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీని ప్రజలు తిరస్కరించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు టీడీపీకి చేదుగా ఉండవచ్చు. ఈనెల 23న ఓట్ల లెక్కింపు రోజు వారికి వాస్తవం బోధపడుతుంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమే కొనసాగుతుంది....’’ – ప్రతిష్టాత్మక జాతీయ, రాష్ట్ర స్థాయి సంస్థల ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడి సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు నిర్వహించిన ప్రీ పోల్ సర్వే ఫలితాలే ఎగ్జిట్ పోల్స్‌లోనూ ప్రతిబింబించాయి. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం పట్టారని, రాష్ట్రానికి ఆయన నూతన ముఖ్యమంత్రి కానున్నారని ప్రతిష్టాత్మక జాతీయ, రాష్ట్ర స్థాయి సర్వే సంస్థలు చేపట్టిన ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. దేశవ్యాప్తంగా తుదివిడత పోలింగ్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగియగానే ఎన్డీటీవీ, టైమ్స్ నౌ, రిపబ్లిక్ టీవీ – జన్‌కీ బాత్, ఇండియాటుడే, మిషన్ చాణక్య, ఆరా, సీపీఎస్, ఏబీపీ నీల్సన్ మార్గ్ , సీఎన్ఎన్ న్యూస్ –18, ఐ పల్స్, కేకే సర్వీస్ తదితర సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ విజయదుందుభి మోగిస్తుందని, కేంద్రంలో మళ్లీ ఎన్డీఏనే అధికార పగ్గాలు చేపడుతుందని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తేల్చి చెప్పాయి. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్సార్సీపీకి మూడింట రెండొంతులకుపైగా మెజార్టీ ఖాయమని తెలిపాయి. ఫలితాలు ఏకపక్షం.. ప్రతిష్టాత్మక ఇండియాటుడే సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో వైఎస్సార్సీపీకి 130–135 అసెంబ్లీ సీట్లు వస్తాయని తేలింది. టీడీపీ 37–40 సీట్లకే పరిమితం కానుందని పేర్కొంది. జనసేనకు ఒక్క సీటు లేదంటే అది కూడా రాకపోవచ్చని విశ్లేషించింది. ఇక ఎంపీ సీట్లు వైఎస్సార్సీపీకి 18–20, టీడీపీకి 4–6 వస్తాయని అంచనా వేసింది. ఇతరులకు ఒక స్థానం దక్కే అవకాశం కూడా ఉందని తెలిపింది. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్‌లో వైఎస్సార్సీపీకి 98 అసెంబ్లీ సీట్లు లభించగా టీడీపీకి 65 సీట్లు రావచ్చని తెలిపింది. జనసేనకు 2 సీట్లు దక్కే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. వైఎస్సార్ సీపీకి 18 ఎంపీ సీట్లు, టీడీపీకి 7 ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది. వీడీపీ అసోసియేట్స్ వైఎస్సార్సీపీకి 111–121 స్థానాలు, టీడీపీకి 54–60 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్‌లో తెలిపింది. ఇతరులు 4 చోట్ల గెలుపొందవచ్చు. వైఎస్సార్సీపీ 133 నుంచి 135 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటుందని సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ (సీపీఎస్) పేర్కొంది. అధికార టీడీపీ కేవలం 37 నుంచి 40 సీట్లకే పరిమితమవుతుందని సీపీఎస్ సర్వే వెల్లడించింది. జనసేన సున్నా లేదా ఒక్క స్థానంలో గెలుపొందే అవకాశం ఉంది. ‘ఆరా’ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వైఎస్సార్ సీపీ 126 సీట్లతో అగ్రస్థానంలో నిలిచింది. టీడీపీకి 47 సీట్లు, ఇతరులకు 2 సీట్లు వస్తాయని పేర్కొంది. లోక్‌సభ స్థానాలకు సంబంధించి వైఎస్సార్ సీపీ 20–24 చోట్ల, టీడీపీ 1–5 చోట్ల గెలుపొందే అవకాశాలున్నట్లు తెలిపింది. కేకే సర్వేస్లో వైఎస్సార్ సీపీకి 130–135 సీట్లు లభించాయి. టీడీపీ 30–35 సీట్లకే పరిమితమవుతుందని అంచనా వేసింది. ఇతరులు 10–13 చోట్ల గెలుపొందే అవకాశాలున్నట్లు పేర్కొంది. మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్స్‌లో వైఎస్సార్ సీపీకి 98 స్థానాలు దక్కగా, టీడీపీకి 58 సీట్లు వచ్చాయి. ఇతరులు 7 చోట్ల నెగ్గే అవకాశం ఉంది. వివిధ సంస్థల ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు 25 లోక్‌సభ స్థానాలకు.. ఎంపీ స్థానాల్లోనూ ‘ఫ్యాన్’ ప్రభంజనం రిపబ్లిక్ జన్‌కీ బాత్ 13–16 ఎంపీ సీట్లను వైఎస్సార్ సీపీ గెలుస్తుందని, టీడీపీ 8–12 సీట్లలో నెగ్గుతుందని తెలిపింది. సీఎన్ఎన్ న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్‌లో వైఎస్సార్ సీపీకి 13–15 ఎంపీ సీట్లు లభించగా టీడీపీకి 10–12 సీట్లు వచ్చాయి. ఏబీపీ నీల్సన్ ఫలితాల్లో వైఎస్సార్ సీపీ అత్యధికంగా 20 ఎంపీ సీట్లను తన ఖాతాలో వేసుకోగా టీడీపీ ఐదు స్థానాలకే పరిమితమైంది. ఐ పల్స్ సంస్థ వైఎస్సార్ సీపీ 19–21 ఎంపీ సీట్లను, టీడీపీ 4–6 సీట్లను సాధిస్తాయని తెలిపింది. రిపబ్లిక్ సీ ఓటర్ 11 చోట్ల లోక్‌సభ స్థానాలను వైఎస్సార్ సీపీ గెలుచుకుంటుందని, 14 చోట్ల టీడీపీ విజయం సాధిస్తుందని పేర్కొంది. కాగా వైఎస్సార్ సీపీ 8–12 ఎంపీ సీట్లను, టీడీపీ 13–17 ఎంపీ సీట్లను గెలుస్తాయని లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన అనంతరం పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ 72 అసెంబ్లీ స్థానాలు, టీడీపీ 100 సీట్లు, జనసేన, ఇతరులు 3 సీట్లు గెలుస్తారని చెప్పారు. ఓట్ల శాతంలోనూ భారీ తేడా వైఎస్సార్సీపీ, – టీడీపీ మధ్య ఓట్ల శాతంలోనూ వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుందని వివిధ సర్వేలు తేల్చాయి. వైఎస్సార్సీపీకి 50.1 శాతం, టీడీపీకి 40.2 శాతం, జనసేనకు 7.3 శాతం, ఇతరులకు 2.6 శాతం ఓట్లు వస్తాయని సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ (సీపీఎస్) పోస్ట్ పోల్ సర్వే పేర్కొంది. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ఉండాలని 45 శాతం మంది కోరుకున్నట్లు వీడీపీ అసోసియేట్స్ విశ్లేషణలో తేల్చింది. అన్ని వర్గాల ఆదరణ అన్నకే రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలు జగన్‌వైపే మొగ్గు చూపాయని పలు సర్వేల్లో తేలింది. ఆరా, సీపీఎస్ తదితర సంస్థలు కులాలవారీగా కూడా సర్వే చేశాయని, అన్ని సామాజిక వర్గాలు జగన్‌వైపే మొగ్గు చూపారని ఆయా సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. ‘రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, గౌడ, క్షత్రియ, బోయ, రజక తదితర కులాల ప్రాతిపదికగా కూడా సర్వే చేశాం. అన్ని వర్గాల్లోనూ జగన్ పట్ల ఆదరణ కనిపించింది. చంద్రబాబు పసుపు – కుంకుమ పథకం వల్ల మహిళలు ఎక్కువగా టీడీపీకి ఓట్లు వేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే మహిళల ఓట్లు వైఎస్సార్ సీపీకే పడ్డాయని మా సర్వేలో తేలింది’ అని ఆరా సంస్థ ప్రతినిధి మస్తాన్‌వలి తెలిపారు. ‘బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్‌వైపే నిలిచారు.’ అని సీపీఎస్ ప్రతినిధి వేణుగోపాల్ పేర్కొన్నారు. వంద శాతం నిజం ‘ఎన్నికల ముందు ఓట్ల కోసం చంద్రబాబు ప్రకటించిన తాయిలాలు ఏమాత్రం పనిచేయలేదు. జనం జగన్‌కే జైకొట్టారు. పోలింగ్ సందర్భంగా ఈ విషయం స్పష్టంగా కనిపించింది. అందుకే ఫలితాలు ఏకపక్షంగా ఉండనున్నాయి. చంద్రబాబు అధికారమే పరమావధిగా గత ఎన్నికల్లో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, జాబు రావాలంటే, బాబు రావాలి..అంటూ అసత్య హామీలు ఇచ్చి అమలు చేయకుండా గాలికొదిలేశారు. ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం అనేక ఎరలు వేసినా జనం నమ్మలేదు’ అని ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ సంస్థల ప్రతినిధులు, చానళ్ల విశ్లేషణల్లో పాల్గొన్న సెఫాలజిస్టులు విశ్లేషించారు. ‘చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితే ఏదో జరగరాని అద్భుతం జరిగినట్లే....’ అంటూ అది అసాధ్యమని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక ఛానల్ విశ్లేషణలో పేర్కొన్నారు. ‘మా ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా ఎన్నికల ఫలితాలను ప్రతిఫలిస్తాయి. అత్యంత పకడ్బందీగా, అన్ని ప్రమాణాలతో శాస్త్రీయంగా నిర్వహించాం. ఏ ఫలితాలైనా ఒక పార్టీవారికే అనుకూలంగా ఉంటాయి. వ్యతిరేకంగా ఉన్నవారు ఎగ్జిట్‌పోల్స్‌నే తప్పుబట్టడం సరికాదు. మేం తప్పుడు ఫలితాలు ప్రకటించి మా సంస్థలను మూసుకుంటామా?’ అని సెంటర్ ఫర్ సెఫాలజీ సర్వే (సీపీఎస్) అధినేత ప్రొఫెసర్ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. -
టీఆర్ఎస్దే హవా
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ హవా కొనసాగుతుందని ఎగ్జిట్ పోల్స్ అం చనా వేశాయి. రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాలకుగాను ఆ పార్టీ అత్యధికంగా 15 సీట్లు గెలుచుకుంటుం దని ఆదివారం పలు జాతీయ చానళ్లు తమ సర్వేల ద్వారా తేల్చాయి. న్యూస్ఎక్స్–నేతా సర్వే ప్రకారం టీఆర్ఎస్కు 15 స్థానాలు రానున్నాయి. ఈ సర్వే ప్రకారం చూస్తే కాంగ్రెస్‌కు ఒక్క స్థానం వస్తుండగా ఎంఐఎం మరో సీటు గెలుచుకోనుంది. బీజేపీ ఖాతా తెరవడం లేదు. ఇండియా టుడే సర్వే ప్రకారం అయితే టీఆర్ఎస్కు 10–12 స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తుండగా కాంగ్రెస్‌కు 1–3 స్థానాలు, బీజేపీకీ అదే స్థాయిలో సీట్లు రావొచ్చని సర్వే అంచనా వేసింది. ఇక అన్ని జాతీయ చానళ్ల సర్వేల్లోనూ ఎంఐఎం తన ఒక్క స్థానాన్ని పదిలపరుచుకుంటుందని వెల్లడైంది. ఆ రెండు పార్టీల్లో ఉత్కంఠ... ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అన్ని సర్వేల్లో కాంగ్రెస్ కనీసం ఒక్క స్థానం గెలుచుకుంటుందని తేలింది. ఒక్క న్యూస్ఎక్స్–నేతా మినహా అన్నింటిలోనూ బీజేపీ ఒక్క స్థానం గెలుచుకోబోతోంది. దీంతో ఆ ఒక్క స్థానం ఏమిటనేది ఆ రెండు పార్టీల్లో ఉత్కంఠ కలిగిస్తోంది. మిగిలిన సర్వేల్లో ఆ రెండు పార్టీలకు మూడు స్థానాల వరకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించడంతో అసలు ఎక్కడెక్కడ విజయావకాశాలు ఉన్నాయన్న దానిపై ఇరు పార్టీలు లెక్కలు మొదలుపెట్టాయి. కాంగ్రెస్ పార్టీ నల్లగొండ, భువనగిరి, చేవెళ్ల, ఖమ్మం, మల్కాజిగిరి స్థానాలపై ఆశలు పెట్టుకోగా బీజేపీ సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లలో సానుకూల ఫలితాలు ఆశిస్తోంది. ఈ సర్వేల ప్రకారం కనీసం ఒకటి లేదా మూడు స్థానాలు గెలిచే అవకాశం ఆ రెండు పార్టీలకు ఉన్నా గెలుపు తీరం ఎక్కడ చేరుతుందన్నది మాత్రం ఈ నెల 23న తుది ఫలితాలు వెల్లడయ్యాక తేలనుంది. -
‘రెండేళ్లలోనే టీడీపీ గ్రాఫ్ పడిపోయింది’
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టింస్తుందని సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ (సీపీఎస్) పోస్ట్ పోల్ సర్వే చీఫ్ వేణుగోపాల్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ అంశాన్ని తీసుకున్నా వైఎస్సార్సీపీకే అనుకూలంగా ఉందని ఆయన తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల నుంచే చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, గత రెండేళ్లుగా టీడీపీ గ్రాఫ్ పడిపోయిందని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4లక్షలకు పైగా శాంపిల్స్ సేకరించి సర్వే చేపట్టినట్లు వేణుగోపాల్ వివరించారు. చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతతోనే వైఎస్ జగన్‌కు పట్టం కట్టారని ఆయన పేర్కొన్నారు. కేవలం అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు అవకాశంఇచ్చారని, కానీ ప్రజల అంచనాలను ఆయన అందుకోలేకపోయారని తెలిపారు. ఐదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పకుండా.. కేవలం సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని అన్నారు. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ 133-135 స్థానాలను గెలుపొందనుందని, అధికార టీడీపీ కేవలం 37 నుంచి 40 సీట్లు మాత్రమే విజయం సాధిస్తుందని సీపీఎస్ సర్వే వెల్లడించింది. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ సున్నా లేదా ఒక్క స్థానం గెలిచే అవకాశముందని, ఐదు స్థానాల్లో హోరాహోరీ పోటీ నెలకొని ఉంటుందని పేర్కొంది. వైఎస్సార్సీపీకి 50.1% శాతం ఓట్లు వస్తాయని, టీడీపీకి 40.2% శాతం ఓట్లు, జనసేనకు 7.3% శాతం ఓట్లు, ఇతరులకు 2.6% శాతం ఓట్లు వస్తాయని సీపీఎస్ వెల్లడించింది. -
వైఎస్ జగన్ పడ్డ కష్టానికి ప్రతిఫలం
-
‘లగడపాటి సర్వే ఏంటో అప్పుడే తెలిసింది’
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలినుంచి ప్రజల పక్షాన చేస్తున్న పోరాటానికి ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్‌లో ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై సజ్జల మాట్లాడుతూ.. మే 23న మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు హఠాత్తుగా వచ్చినవి కావని, ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్ పడ్డ కష్టానికి ప్రతిఫలమని అభిప్రాయపడ్డారు. లగడపాటి సర్వేపై ఆయన స్పందిస్తూ.. ఆయన సర్వేలో ఎంత నిజముందో తెలంగాణ అసెంబ్లీ ఫలితాలప్పుడే ప్రజలందరికీ తెలిసిపోయిందని అన్నారు. కొందరి ప్రయోజనాల కోసమే లగడపాటి తప్పుడు సర్వేలు చేస్తున్నారని కొట్టిపారేశారు. ఆంధ్రా ఆక్టోపస్‌గా ఆయనను ఆయనే చిత్రీకరించుకున్నారని పేర్కొన్నారు. సర్వే విడుదలకు ముందు టీడీపీ నేతలతో చర్చించి వారికి అనుకూలంగా ఫలితాలను ఇస్తారని సజ్జల ఆరోపించారు. కేసులు, అక్రమాల నుంచి తప్పించుకోవడాకే చంద్రబాబు నాయుడు జాతీయ నేతల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. ఓటమిని ముందే ఊహించిన చంద్రబాబు.. ఈవీఎంలపై, ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కలుస్తామని వైఎస్ జగన్ మొదటి నుంచి చెపుతూనే ఉన్నారని, కేసీఆర్‌తో భేటీలో రహస్యమేమీ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం తమతో కలిసోచ్చే వారితో కలిసి ముందుకు సాగుతామని వైఎస్ జగన్ చెప్పిన మాటలను సజ్జల మరోసారి గుర్తుచేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : వైఎస్ జగన్ పడ్డ కష్టానికి ప్రతిఫలం -
ఎగ్జిట్ పల్స్ 2019
-
హస్తినలో ఆధిక్యత ఎవరిది?
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బీజేపీ క్లీన్‌స్వీప్ సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఉత్కంఠ భరింతంగా సాగిన ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం ఏడు స్థానాలను బీజేపీ సొంతం చేసుకుని గత ఫలితాలను పునరావృత్తం చేస్తుందని స్పష్టం చేశాయి. కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలను ఢిల్లీ ఓటర్లు ఈసారి కూడా నిరాకరించినట్లు తెలుస్తోంది. కాగా ఆదివారం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్‌లో దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. అదే ఊపు జాతీయ రాజధానిలో కూడా కొనసాగించింది. ఇండియా టుడే వెల్లడించిన సర్వేలో మాత్రం బీజేపీ 6-7, కాంగ్రెస్ 0-1 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఆప్-కాంగ్రెస్ మధ్య పొత్తు లేకుండా విడివిడిగా పోటీ చేయడం ఆయా పార్టీలకు నష్టం చేసినట్లు తెలుస్తోంది. కాగా కాంగ్రెస్ సీనియర్ నేతలైన షీలా దీక్షిత్, అజయ్ మాకెన్‌కు కూడా ఓటమి తప్పదని సర్వే ఫలితాలు తెలిపాయి. -
బెంగాల్లో దీదీకి బీజేపీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌తో బీజేపీ దీటుగా తలపడింది. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తృణమూల్ ఆధిపత్యానికి గండికొడుతూ బెంగాల్లో కమలదళం 11 స్ధానాలు గెలుచుకోనుంది. 2014లో బెంగాల్లో బీజేపీ కేవలం రెండు స్ధానాల్లో గెలుపొందడం గమనార్హం. ఇక గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓటింగ్ శాతం 17 నుంచి ఏకంగా 32 శాతానికి ఎగబాకనుంది. ఇక సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ కేవలం ఒక స్ధానానికే పరిమితం కానుంది. కాగా, బెంగాల్లో బీజేపీకి 10 నుంచి 19 సీట్లు రావచ్చని మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. -
తమిళనాట డీఎంకే.. కర్నాటకలో బీజేపీ హవా
సాక్షి, న్యూఢిల్లీ : ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తమిళనాడులో కాంగ్రెస్-డీఎంకే కూటమి హవా సాగింది. పాలక ఏఐఏడీఎంకేతో జత కట్టిన ఎన్డీఏకు తమిళనాట నిరాశే ఎదురైంది. కాంగ్రెస్-డీఎంకే కూటమికి 29 స్ధానాలు దక్కనుండగా, ఏఐఏడీఎంకే-ఎన్డీఏ కూటమి కేవలం 9 స్ధానాలకే పరిమితమవనుంది. 2014 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఏఐఏడీఎంకే 30 శాతం ఓట్లను కోల్పోనుంది. కర్నాటకలో.. కర్నాటకలో 28 స్ధానాలకు గాను బీజేపీ 20 స్ధానాలు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ-వీఎంఆర్ వెల్లడించింది. కర్నాటకలో బీజేపీ ఓటింగ్ శాతం 43 నుంచి 48.5 శాతానికి పెరగనుంది. పాలక జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి గట్టి షాక్ తగలనుంది. ఈ కూటమికి 2014లో 11 స్ధానాలు దక్కగా ఇప్పుడు ఏడు స్ధానాలు మాత్రమే లభించనున్నాయి. -
ఎగ్జిట్ పల్స్ 2019
-
లోకేష్ బాబు గెలవటం డౌటే!
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి కుమారుడు, మంత్రి నారా లోకేష్‌బాబు మంగళగిరిలో గెలవటం డౌటేనని ఆరా పోస్ట్ పోల్ సర్వే వెల్లడించింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 135 స్థానాలు సాధించే అవకాశం ఉందని ఆరా పోల్స్ స్ట్రాటజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేపట్టిన పోస్ట్ పోల్ సర్వేలో స్పష్టమైంది. ఆరా సర్వే వివరాలను సంస్థ ప్రతినిధి షేక్ మస్తాన్ వలి ఆదివారం మీడియాకు వివరించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆరా సంస్థ అనేక పర్యాయాలు పోస్ట్ పోల్స్ నిర్వహించింది. తెలుగు రాష్ట్రాల్లో 2008 నుంచి ఆరా సంస్థ ఖచ్చితమైన లెక్కలతో సర్వే చేపట్టింది. 2014లో ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినందున అనుభవజ్ఞుడైన నారా చంద్రబాబునాయుడికి ప్రజలు పట్టం కట్టడం జరిగింది. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీకి బీజేపీనుంచి నరేంద్రమోదీ, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ మద్దతు లభించడం వలన అధికారంలోకి రాగలిగారు. ఆంధ్రప్రదేశ్‌లోని 175 స్థానాల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీకి స్పష్టమైన మెజారిటీ వస్తోంది. వైఎస్సార్ సీపీకి 48.78 శాతం, టీడీపీకి 40.18 శాతం, జనసేనకు 7.81 శాతం, ఇతరులకు 3.26 శాతం ఓట్లు పడ్డాయి. ఆంద్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్ సీపీ 22 స్థానాలను గెలుచుకుంటుంది. టీడీపీ 3 స్థానాలు గెలవొచ్చు లేదా ఒకటికే పరిమితం అయ్యే అవకాశం కూడా ఉంది. పసుపు కుంకుమ పథకం వలన ఆడవారు ఓట్లు టీడీపీకి ఎక్కువగా వేశారని ప్రచారం జరిగింది. కానీ వాస్తవ రూపంలో మహిళల ఓట్లు టీడీపీ కంటే వైఎస్సార్ సీపీకే ఎక్కువగా పడ్డాయని మా సర్వేలో తేలింది. మహిళల ఓట్లను పరిశీలిస్తే వైఎస్సార్ సీపీకి 48.95 శాతం, టీడీపీకి 45.06 శాతం, జనసేనకు 3.88 శాతం ఓట్లు పడ్డాయి. మగవారి ఓట్ల వివరాలు చూసుకుంటే వైఎస్సార్ సీపీకి 50.08 శాతం, టీడీపీకి 30.96 శాతం, జనసేనకు 7.71 శాతం మంది ఓట్లు వేశారు. ఏప్రిల్ 17 నుంచి మే 18 వరకు సిస్టమాటిక్ రాండమ్ శాంపిల్ మెథడాలజీ ద్వారా సర్వే చేపట్టాము. బాలకృష్ణ తక్కువ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. ఆరాకు గల అనుభవం, స్పష్టమైన, ఖచ్చితమైన విలువల ఆధారంగా సర్వే చేపట్టామ’ని మస్తాన్ వలి పేర్కొన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ఆరా పోస్ట్ పోల్స్ : వైఎస్సార్సీపీకి మెజారిటీ -
ఆరా పోస్ట్ పోల్స్ : వైఎస్సార్సీపీకి మెజారిటీ
-
యూపీలో తగ్గనున్న కమలం ప్రాభవం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోనే అత్యధిక లోక్ సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార బీజేపీకి సీట్లు తగ్గిపోనున్నాయి. గత ఎన్నికల్లో ఏకపక్షంగా సీట్లను కైవసం చేసుకున్న బీజేపీ ఈసారి భారీగా సీట్లు కోల్పోనున్నట్లు ఆయా సంస్ధలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. యూపీలో బీజేపీ హవాకు అడ్డుకట్ట వేయడానికి అఖిలేష్ యాదవ్ - మాయావతి కూటమి పనిచేసినట్టు ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలుస్తోంది. ఎస్పీ - బీఎస్పీలు కలిసి పోటీ చేసినప్పటికీ ఆ పార్టీలు ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితాలు రావని తెలుస్తోంది. భారీ స్థానాలు కోల్పోతున్నప్పటికీ అధికార బీజేపీ యూపీలోని మొత్తం 80 స్థానాల్లో సగానికి పైగా గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఏడు వేర్వేరు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మేరకు యూపీలో బీజేపీకి 45 స్ధానాలు, మహాకూటమికి 32 స్ధానాలు దక్కుతాయని తేలింది. రిపబ్లిక్ జన్ కీ బాత్ యూపీలో బీజేపీ గరిష్టంగా 57 సీట్లు దక్కించుకుంటుందని వెల్లడించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో 80 స్ధానాలకు గాను బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్‌తో కలిసి 80 స్ధానాలు కైవసం చేసుకుంది. రాజకీయ రంగ ప్రవేశం చేసిన ప్రియాంక గాంధీ తాజా ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా బరిలో దింపినప్నాపటికీ కాంగ్రెస్‌కు యూపీలో ఆశించిన ఫలితాలు సాధించడం లేదని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది.