
సాక్షి, న్యూఢిల్లీ : ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తమిళనాడులో కాంగ్రెస్-డీఎంకే కూటమి హవా సాగింది. పాలక ఏఐఏడీఎంకేతో జత కట్టిన ఎన్డీఏకు తమిళనాట నిరాశే ఎదురైంది. కాంగ్రెస్-డీఎంకే కూటమికి 29 స్ధానాలు దక్కనుండగా, ఏఐఏడీఎంకే-ఎన్డీఏ కూటమి కేవలం 9 స్ధానాలకే పరిమితమవనుంది. 2014 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఏఐఏడీఎంకే 30 శాతం ఓట్లను కోల్పోనుంది.
కర్నాటకలో..
కర్నాటకలో 28 స్ధానాలకు గాను బీజేపీ 20 స్ధానాలు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ-వీఎంఆర్ వెల్లడించింది. కర్నాటకలో బీజేపీ ఓటింగ్ శాతం 43 నుంచి 48.5 శాతానికి పెరగనుంది. పాలక జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి గట్టి షాక్ తగలనుంది. ఈ కూటమికి 2014లో 11 స్ధానాలు దక్కగా ఇప్పుడు ఏడు స్ధానాలు మాత్రమే లభించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment