
దొడ్డబళ్లాపురం : సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి మొదటిసారి ఎన్నికల్లో పోటీచేసి ఎంపీగా అఖండ విజయం సాధించిన గోరంట్ల మాధవ్‌కు కర్ణాటకలోనూ ఫ్యాన్స్ నీరాజనాలు పడుతున్నారు. గెలిచినా ఎటువంటి భేషజాలకు పోకుండా ఆచితూచి ఆయన చెబుతున్న మాటలు కూడా చాలామందికి నచ్చుతున్నాయి. ఇప్పటికే గోరంట్ల మాధవ్ గురించి కన్నడ పత్రికలు, మీడియా కూడా ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ఆయన గెలుపు ఒక ఎత్తయితే.. గెలిచిన తరువాత పై అధికారులకు సెల్యూట్ చేసిన ఫోటోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘గెలుపంటే ఇదీ...గొప్ప వ్యక్తి...గొప్పవాళ్లు ఇలాగే ప్రవర్తిస్తారు’ అంటూ ప్రశంసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment